బిగ్‌బాస్ 2: రఫ్పాడించిన లేడీ గ్యాంగ్, లేపి అవతల పారేసిన జెంట్స్ గ్యాంగ్
Recommended Video

బిగ్ బాస్ 2 షోలో మరింత ఫన్ క్రియేట్ చేయడంలో భాగంగా ఇంటి సభ్యులకు రకరకాల టాస్కులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటి సభ్యులను రెండు జట్లుగా విడగొట్టిన బిగ్‌బాస్ వీరికి కబడ్డీ పోటీలు నిర్వహించారు. అయితే ఇంట్లోని ఆడవాళ్లంతా ఒకటీమ్‌గా, మగవాళ్లంతా ఒక టీమ్‌గా ఉండటంతో కబడ్డీ పోటీలు మరింత రసవత్తరంగా సాగిందని తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే స్పష్టమవుతోంది.

లేడీస్ వర్సెస్ జెంట్స్
మగాళ్ల టీంలో కౌశల్, అమిత్, గణేష్, సామ్రాట్ రెడ్డి... ఆడవాళ్ల టీం తరుపున శ్యామల, దీప్తి నల్లమోతు, పూజా, గీత మాధురి పోటీ పడ్డారు. ఇరు జట్లు తమదైన శైలిలో గేమ్ ఆడి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేశారు.

రప్ఫాడించిన లేడీస్
మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా లేడీస్ కబడ్డీ గేమ్‌లో రఫ్పాడించారు. శ్యామల, దీప్తి, పూజా ఉత్సాహంగా గేమ్ ఆడారు. గీత మాధురికి పాటలు తప్ప ఇలాంటి ఆటలు అలవాటు లేదుకాబట్టి కాస్త భయం భయంగా గేమ్ ఆడినట్లు స్పష్టమవుతోంది.

కండబలంతో లేపి అవతల పారేసిన జెంట్స్ గ్యాంగ్
మగాళ్ల టీంలో కండబలం కలిగిన అమిత్, కౌశల్, సామ్రాట్ లాంటి ఉండటంతో... కూతకు వచ్చిన లేడీ గ్యాంగ్ టీమ్ సభ్యులను అమాంతం లేపి అవతల పారేశారు.
సూపర్ ఫన్
మొత్తానికి ఇంటి సభ్యుల మధ్య నిర్వహించిన ‘కబడ్డీ' గేమ్ టాస్క్ ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్టెన్ చేసిందని . బుధవారం రాత్రి ప్రసారం అయ్యే షోలో ఈ కబడ్డీ గేమ్ టాస్క్ ప్రేక్షకులను వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications











