షర్ట్‌ని అలా పైకి మడిచి గ్లామర్ షో.. రొమాంటిక్ ఫోజులతో కచ్చా బాదం బ్యూటీ అరాచకం

సోషల్ మీడియా రాకతో ఇన్‌ఫ్లూయెన్సర్లుగా మారి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న వారెందరో. చిన్న రీల్, డ్యాన్స్ వీడియో, పాటలతో ఇలాంటి వారు రాత్రికి రాత్రి స్టార్లుగా మారిపోతున్నారు. తమ టాలెంట్‌తో సినిమాలు, టీవీలలో అవకాశాలను అందుకోవడంతో పాటు రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఇలాంటి కోవలోకే వస్తారు అంజలి అరోరా. ఈ పేరు చెబితే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. అదే కచ్చా బాదం బ్యూటీ అంటే చాలు కుర్రకారుకు మెలికలు తిరిగే అమ్మాయి గుర్తొస్తుంది.

ఢిల్లీకి చెందిన అంజలి అరోరా .. నగరంలోని దేశబంధు కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన అంజలి హిందీ, పంజాబీ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో యూత్‌లో క్రేజ్ సంపాదించారు. ఆమె రూపొందించిన టెంపరీ ప్యార్, అషిక్ పూరాణ, సజ్జా హై ముజే, టేరే బార్గీ వంటి పాటలు సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు అంజలికి యువతలో మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే ఆమె కెరీర్‌ను కచ్చా బాదం పాట మలుపు తిప్పింది.

kacha badam fame Anjali Arora stunning looks goes viral Her latest photos here

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లా కరుల్జూరి గ్రామానికి చెందినప భువన్ బద్యాకర్ తన బైకుపై పల్లీల మూట వేసుకుని పాత, పాడైపోయిన వస్తువులకు పల్లీలు ఇచ్చేవాడు. ఇందుకోసం ఓ పాట రాసుకుని దానికి ట్యూన్ కట్టి వీధుల వెంట తిరుగుతుండేవాడు. ఈ పాట కాస్తా అంజలి అరోరా కంట పడటంతో ఆమె రీమిక్స్‌తో పాటు ఆధునిక సాంకేతికత సాయంతో పూర్తిగా పాటను మార్చేసింది. ఈ పాటలో అంజలి వేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్, ఆమె అందం యువతను పిచ్చెక్కించింది. సోషల్ మీడియాలో పెను ప్రకంపనలు సృష్టించిన కచ్చా బాదం సాంగ్‌ను ఓ పాపులర్ సంస్థ ర్యాప్‌ను యాడ్ చేసి ఇంకొన్ని హంగులు అద్దింది.

కచ్చా బాదం తర్వాత అంజలి అరోరాకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన లాక్ అప్ గేమ్ షోలో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దక్కింది. ఈ కార్యక్రమంలో మునావర్ ఫరూఖీతో ఆమె రాసుకు పూసుకు తిరిగి చివరికి రన్నరప్‌గా నిలిచింది. బిగ్‌బాస్ హిందీ ఓటీటీ 3లో కంటెస్టెంట్‌గానూ అలరించింది. అయితే అంజలికి సంబంధించిన ఓ అభ్యంతరకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అయ్యారు.

ఇది అంజలి దృష్టికి రావడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ఫేక్ వీడియో అని , ఇదంతా ఎవరు? ఎందుకోసం చేస్తున్నారంటూ? ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కొన్ని ఛానెల్స్ పనిగట్టుకుని దీనిపై ప్రచారం చేశాయని అంజలి మండిపడ్డారు. జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్ధితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అంజలి అరోరా.. ఎప్పటికప్పుడు రీల్స్ చేస్తూ, హాట్ హాట్ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా జీన్స్ ప్యాంట్ వేసి షర్ట్‌ని బ్రా వరకు మడతపెట్టి కవ్వించే అందాలతో ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం అంజలి అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: anjali arora bigg boss
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X