ప్రముఖ టీవీ యాక్టర్ ఆత్మహత్య.. 2 రోజుల తర్వాత వెలుగులోకి..

బాలీవుడ్‌లో దిశా సలియాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాలపై వివాదం కొనసాగుతుండగానే మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడారు. బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న ప్రముఖ నటుడు సమీర్ శర్మ బుధవారం రాత్రి సూసైడ్ చేసుకోవడం హిందీ వినోద పరిశ్రమలో కలకలం రేపింది. ఆయన మరణంతో పలువరు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. సమీర్ శర్మ మరణం గురించి వివరాల్లోకి వెళితే..

పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో

పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో

సమీర్ శర్మ యే రిస్తే హై ప్యార్‌ కే, కహానీ ఘర్ ఘర్ కీ, క్యోంకి సాస్ బీ కబీ బహూ తీ, ఇస్ ప్యార్ కా క్యా నామ్ దూ లాంటి సీరియల్స్‌లో సమీర్ శర్మ నటించారు. ఆయన తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు. సమీర్ శర్మతో విడదీయలనే అభిమానం బంధం ప్రేక్షకులకు ఏర్పడింది.

మలాడ్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఘటన

మలాడ్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఘటన

సమీర్ శర్మ వయసు 44 సంవత్సరాలు. ఆయన ముంబైలోని మలాడ్ వెస్ట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. గత ఫిబ్రవరిలోనే అపార్ట్‌మెంట్‌లోకి మారారు. బుధవారం అర్ధరాత్రి తన ఇంటిలోని కిచెన్‌లో ఉరి వేసుకొని మరణించడం షాక్ గురి చేసింది. సమీర్ మరణంతో పలు టీవీ నటులు విషాదంలో మునిగిపోయారు.

ఉరి వేసుకొని వేలాడుతుండగా..

ఉరి వేసుకొని వేలాడుతుండగా..

తన ఇంటిలో సమీర్ శర్మ ఉరి వేసుకొని ఉండటాన్ని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ గుర్తించారు. వెంటనే అపార్ట్‌మెంట్ సొసైటీ సభ్యులను అప్రమత్తం చేయడంతో తలుపులు పగలకొట్టి దేహాన్ని కిందకు దించారు. దీంతో ఆయన మరణ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సమీర్ శర్మ దేహాన్ని పోస్టు మార్టంకు పంపించినట్టు సమాచారం.

Recommended Video

#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look
రెండు రోజుల క్రితమే ఘటన

రెండు రోజుల క్రితమే ఘటన

ముంబైలోని పోలీసులు తెలిపిన ప్రకారం.. సమీర్ శర్మ రెండు రోజుల క్రితమే మరణించి ఉంటారు. ఆయన గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. సమీర్ మరణాన్ని అనుమానాస్పద మరణంగా కేసు రిజిస్టర్ చేశాం. పార్ధీవ దేహాన్ని శవ పరీక్ష కోసం పంపామని చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు ఏమిటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. సన్నిహితులను, స్నేహితులను ఆరా తీస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X