అప్పుడే భర్త బిజినెస్‌లో కాలు పెట్టేసిన కాజల్ అగర్వాల్.. ఖర్చు లేకుండా..

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లి వేడుకతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్ కు ఎట్టకేలకు ఊహించని విధంగా ఎండ్ కార్డ్ పెట్టిన ఈ బ్యూటీ మొత్తానికి తనకు ఇష్టమైన వాడి చేత మూడు ముళ్ళు వేయించుకుంది. అయితే కాజల్ లాంటి అగ్ర హీరోయిన్ ను ఇంట్లోకి వచ్చింది అంటే ఒక విధంగా భర్త గౌతమ్ రేంజ్ కూడా పెరిగినట్లే. అయితే ఈ గౌతమ్ కాజల్ ను బిజినెస్ లో ఉపయోగించుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం.

Recommended Video

Kajal Aggarwal Honeymoon budget
పెళ్లికి సిద్ధమై చాలా కాలమవుతోంది

పెళ్లికి సిద్ధమై చాలా కాలమవుతోంది

కాజల్ ప్రేమ ఈనాటిది కాదు. పదేళ్లకు పైగా పరిచయం ఉన్న గౌతమ్ తో ప్రేమలో మునగడానికి సమయం చాలానే పట్టిందట. ఇక డేటింగ్ అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై కూడా చాలా కాలమవుతోంది. ఇన్నేళ్లు చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న అమ్మడు మొత్తానికి పెళ్లి చేసుకొని కొత్త ఇంట్లోకి వెళ్లింది.

సినిమా కెరీర్ పై ఎఫెక్ట్ పడకుండా..

సినిమా కెరీర్ పై ఎఫెక్ట్ పడకుండా..

ప్రస్తుతం కొందరు పెళ్లైన కూడా హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. మరికొందరు మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కూడా కొనసాగుతాను అంటూ ముందే క్లారిటీ ఇచ్చేసింది. గౌతమ్ కూడా అందుకు ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పలేదని ఒక క్లారిటీ వచ్చేసింది. హనీమూన్ ఫొటోస్ తో ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

బ్రాండ్ అంబాసిడర్ గా..

బ్రాండ్ అంబాసిడర్ గా..

ఇక ఇటీవల గౌతమ్ కాజల్ అగర్వాల్ కు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ బిజినెస్ లో అగ్ర వ్యాపారవేత్తగా పేరు గాంచిన గౌతమ్ తన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కాజల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రూమర్స్ వైరల్ కాకముందే చందమామ ట్విట్టర్ ద్వారా ఒక క్లారిటీ కూడా ఇచ్చేసింది. కమింగ్ సూన్ అంటూ విడుదల చేసిన స్టైలిష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొదటిసారి రెమ్యునరేషన్ లేకుండా..

మొదటిసారి రెమ్యునరేషన్ లేకుండా..

గౌతమ్ కిచ్లు ఈ- కామర్స్ సంస్థ డిస్కర్స్ లీవింగ్ కోసమని కాజల్ అగర్వాల్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగనుందట. యాడ్స్ ద్వారా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న కాజల్ ఈ యాడ్ ను ఎలాంటి పేమెంట్స్ లేకుండా నటించిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బహుశా అలా నటించడం ఇదే మొదటిసారి అయ్యుంటుందేమో. గౌతమ్ కిచ్లుకు ఒక విధంగా కాజల్ స్టార్ డమ్ చాలా హెల్ప్ అవుతుందనే చెప్పాలి. మరి దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X