Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వాళ్లిద్దరు పెళ్లైన వాళ్లు.. ఛాన్సిస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకొంటా.. కాజల్ అగర్వాల్
మిర్చి, బాహుబలి చిత్రాల్లో కలిసి నటించిన తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి మధ్య రిలేషన్‌పై అనేక రూమర్లు వచ్చాయి. వారిద్దరూ కలిసి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అయినా అలాంటి డేటింగ్ వార్తలకు అడ్డుకట్ట పడలేదు. తాజాగా ప్రభాస్ పెళ్లి అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. అయితే కాజల్ అగర్వాల్ లింకు పెడుతూ ఆ వార్త ఉండటం సహజంగానే ఆసక్తిని రేపింది. అయితే కాజల్ ఈ మాట చెప్పిన తర్వాత అనుష్కకు కాజల్ పోటీగా వస్తుందా అంటూ నెటిజన్లు గుసగుసలాడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
రూమర్ క్రియేట్ చేయాలంటే..
కాజల్ అగర్వాల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నీ మీద ఇప్పటి వరకు రూమర్లు రాలేదు కాదా.. ఏదైనా రూమర్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తావు అని మంచులక్ష్మీ అడిగిన ప్రశ్నకు.. నాకు కావాల్సిన వరుడు నాకు దక్కాడు అని చెబుతాను. అదే నేను క్రియేట్ చేసే రూమర్ అని కాజల్ చెప్పింది.
రానాతో కష్టం.. ఇష్టం..
ఇక నీ కెరీర్లో ఎక్కువగా ఇష్టపడే, ఇరిటేట్ చేసే హీరో ఎవరంటే.. రానా. రానాతో పనిచేయాలంటే ఫన్నీగా ఉంటుంది. చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంటాడు. సెట్లో బాగా ఏడిపిస్తుంటాడు. అలాగే నన్ను బాగా చూసుకొంటాడు కూడా. నాకు మంచి స్నేహితుడు అని కాజల్ చెప్పింది.
రాత్రి పడుకొనే ముందు..
నీవు పడుకొనే ముందు నీ బెడ్ పక్కన ఏలాంటి వస్తువులను పెట్టుకొంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పెద్ద బాటర్ బాటిల్, పుస్తకం, కళ్లద్దాలు, భగవంతుడి ప్రతిమ. ఇవి ఉంటే ఇంట్లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. నేను శివుడిని పూజిస్తాను. ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్లినా ఇవన్నీ నాతోపాటు ఉంటాయి. ఇక నా పర్సులో డబ్బులు, క్రెడిట్ కార్డ్సు ఉంటాయి. ఇక ఫోన్లో లాస్ట్ ముగ్గురి చేసిన మెసేజ్‌లో ఎవరి పేర్లు ఉన్నాయనే విషయాన్ని చెప్పను అని కాజల్ పేర్కొన్నది.
అవకాశం వస్తే రాంచరణ్‌ను
ఒకవేళ అవకాశం వస్తే రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లో ఎవరిని చంపుతావు? ఎవరితో లేచిపోతావు? ఎవరిని పెళ్లి చేసుకొంటావు అని మంచు లక్ష్మీ అడిగిన ప్రశ్నలకు కాజల్ సమాధానం ఇస్తూ.. రాంచరణ్‌ను చంపేస్తా. ఎన్టీఆర్‌తో లేచిపోతా. ఎందుకంటే వారిద్దరూ పెళ్లి అయిన వారు కాబట్టి. ఇక ప్రభాస్‌కు పెళ్లి కాలేదు కాబట్టి నేను ఆయనను పెళ్లి చేసుకొంటాను అని కాజల్ చెప్పింది.