‘కలవారి కోడళ్లు’ ఎఛీవ్ చేసారు

By Srikanya

Kalavari kodallu heading towards 1000 episodes
హైదరాబాద్ : ఎన్ని ఎపిసోడ్లు టెలీకాస్ట్ అయ్యాయి అనేదానిపైనే ఏ టీవి షో ఎంత మేరకు విజయం సాధించింది అనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి ఎఛీవ్ మెంట్ ని తెలుగు టీవి సీరియల్ 'కలవారి కోడళ్లు'సాధించింది. బుల్లి తెరపై వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారి 900 ఎపిసోడ్లనుండి 1000వ ఎపిసోడ్‌వరకు పరుగులు తీస్తోంది. ఈ మేరకు ఆ టీవి యూనిట్ సంబరాలుజరుపుకుంటోంది.

సాధారణంగా అత్తాకోడళ్లు అనగానే వారి మధ్య అపోహలు, అపార్థాలు, పొరపొచ్చాలు వంటివి రావడం సహజమని అందరూ భావిస్తారు. కానీ, అత్తగారంటే ఇలా ఉండాలని ప్రతి కోడలు పిల్ల ఆశించే విధంగా అత్త జగదీశ్వరీదేవి 'కలవారి కోడళ్లు'లో ప్రతిరోజూ కనిపిస్తుంది. తల్లిదండ్రులను మరపించే విధంగా తమను కంటిపాపలా లాలించి, పాలించే అత్తమ్మ కోవెలమూడి జగదీశ్వరీ దేవి పాత్రను డిజైన్ చేయటమే ఈ టీవి సీరియల్ ఇంత విజయానికి కారణం అంటున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అందులోనూ బుల్లితెరలో నటిగా కెరీర్‌ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత స్థాయికి చేరిన నటి హర్షారాణి. స్క్రీన్ పేరు నవీన. తొలిసారిగా 'అలౌకిక' సీరియల్‌తో ప్రారంభమైన ఆమె కెరీర్ 'చంద్రముఖి' 'సృష్టి' 'కలవారి కోడళ్లు' సీరియల్స్‌తో బిజీగా మారింది. 'కలవారి కోడలు'ను యాటాస్ మూవీ ఫెస్టివల్స్ బేనర్‌పై హర్షారాణి నిర్మాతగా మారటం వెనుక ఆమె భర్త యాటా సత్యనారాయణ ప్రోత్సాహం ఉందని అంటోంది. జీ తెలుగులో 'కలవారి కోడళ్లు' సీరియల్ 900 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని విజయపథంలో నడుస్తోంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X