జోగుళాంబ ఆలయంలో ‘కలవారి కోడలు’ షూటింగ్

By Srikanya

Kalavari Kodallu
అలంపూర్: అయిదో శక్తిపీఠం జోగుళాంబ ఆలయం, ఉత్తరవాహిణీ నవబ్రహ్మఆలయాల పరిసరాల్లో 'కలవారికోడలు' టీవీ సీరియల్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. సన్నివేశాల్లో హరిత, అజేమ్‌, శరత్‌కుమార్‌, దుర్గాదేవి, నీరుపామ్‌, శిరీష, కల్యాణ్‌, మాధురి తదితరులు పాల్గొన్నారు. నిర్మాత హరీషారాణి కూడా ఉన్నారు. ఇక్కడ చిత్రీకరణ పూర్తి అయిన తరువాత కర్నూల్‌ టీటీడీ కల్యాణ మండపంలో చిత్రీకరిస్తున్నట్లు మేనేజర్‌ కాశీవిశ్వనాధ తెలిపారు. ప్రస్తుతం 651 ఏపిసోడ్‌ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. చిత్రీకరణ దృశ్యాలను తిలకించడానికి స్థానికులు అధికసంఖ్యలో వచ్చారు.

ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అందులోనూ బుల్లితెరలో నటిగా కెరీర్‌ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత స్థాయికి చేరిన నటి హర్షారాణి. స్క్రీన్ పేరు నవీన. తొలిసారిగా 'అలౌకిక' సీరియల్‌తో ప్రారంభమైన ఆమె కెరీర్ 'చంద్రముఖి' 'సృష్టి' 'కలవారి కోడళ్లు' సీరియల్స్‌తో బిజీగా ఉంది. మంచి రేటింగ్‌తో సాగుతున్న 'చంద్రముఖి'లో మేనకగా తన పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టిందని చెబుతోంది. 'కలవారి కోడలు'ను యాటాస్ మూవీ ఫెస్టివల్స్ బేనర్‌పై హర్షారాణి నిర్మాతగా మారటం వెనుక ఆమె భర్త యాటా సత్యనారాయణ ప్రోత్సాహం ఉందని అంటోంది. జీ తెలుగులో 'కలవారి కోడళ్లు' సీరియల్ 650 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని విజయపథంలో నడుస్తోంది. జీటీవీలో సాయంత్రం 6.30 గంటలకు ప్రసారమవుతున్న ఈ సీరియల్‌తోపాటు తమ బేనర్‌లో గేమ్స్ షోలు కూడా ఏర్పాటు చేయాలను కుంటున్నట్టు చెబుతోంది.

బుల్లితెర అంటేనే డైలీ సీరియల్స్‌. డైలీ సీరియల్స్‌ అంటేనే మహిళా ప్రేక్షకులు. అందుకే మహిళా ప్రేక్షకుల కోరిక మేరకు ముచ్చటగా రెండు డైలీ సీరియల్స్‌ 'వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి', 'కలవారి కోడళ్లు' 'చిన్న కోడలు' వారానికి 6 రోజులు అంటే సోమవారం నుండి శనివారం వరకు ప్రసారం చేస్తున్నారు. ఇది జీ తెలుగు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి మరింత ఆనందాన్ని కలిగిస్తుందని, వారి ఆదరాభిమానాలు యిలాగే కొనసాగేలా సీరియల్స్‌ని రూపొందిస్తున్నామని జీ తెలుగు బిజినెస్‌ హెడ్‌ అనురాధ జి. తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X