Kalki 2898 AD: బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్.. అక్కడ మాత్రం డిజాస్టర్!
ఖచ్చితంగా మన ఇంియన్ సినిమా అలాగే తెలుగు సినిమా కూడా ఎంతో గర్వించదగ్గ ప్రైడ్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలు కొన్ని ఉంటాయి. తాను ఇపుడు చేస్తున్న సినిమాల్లో ఏదన్నా హిట్ టాక్ తెచ్చుకుంది అంటే దానికి థియేటర్స్ లో ఆల్ ఓవర్ ఇండియా కాసులు వర్షం కురావాల్సిందే. అంతే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా వందల కోట్లు ప్రభాస్ సినిమాలు సాధిస్తాయి.
ఇలా లేటెస్ట్ గా వచ్చి దుమ్ము లేపిన చిత్రాల్లో ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం "కల్కి 2898 ఎడి" కూడా ఒకటి. అయితే ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి సీక్వెల్ కాకుండా ఓ సినిమా ఫ్రాంచైజ్ లో మొదటి సినిమాగా వచ్చి 1000 కోట్లు పైగా అందుకున్న చిత్రంగా నిలిచి అరుదైన ఫీట్ అందుకుంది.

కాగా బిగ్ స్క్రీన్స్ పై ఇంతలా హిట్ అయ్యిన ఈ సినిమా మాత్రం బుల్లితెరపై డిజాస్టర్ అయ్యినట్టుగా తెలుస్తుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమాకి ఆడియెన్స్ థియేటర్స్ లో బ్రహ్మరథం పట్టారు. దాదాపు 8 వారాలు పాటుగా థియేటర్స్ లో సినిమా సెన్సేషనల్ రన్ అందుకుంది. మరి అనూహ్యంగా ఇలాంటి సినిమాకి తెలుగులో చాలా తక్కువ రేటింగ్ అది కూడా మొదటి టెలికాస్ట్ లో వచ్చినట్టుగా తెలుస్తుంది.
కాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులు తెలుగలో జీ తెలుగు వారు సొంతం చేసుకోగా గత సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ కి తీసుకొచ్చారు. మరి పండుగ మూమెంట్ లో కూడా ఈ సినిమా కనీసం 10 టీఆర్పీ రేటింగ్ ని తెచ్చుకోలేకపోయింది. ఈ సినిమాకి ఫస్ట్ ఎవర్ టెలికాస్ట్ లో కేవలం 5.26 రేటింగ్ మాత్రమే వచ్చిందట. అంత పెద్ద హిట్ సినిమాకి ఇంత తక్కువ రేటింగ్ అంటే స్మాల్ స్క్రీన్ పై డిజాస్టర్ లెక్క లోకే వేసుకోవాలి.

అల్లు అర్జున్ పుష్ప 1, మహేష్ బాబు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలకి ఇప్పటికీ దీనికంటే ఎక్కువ రేటింగులు నమోదు అవుతూ ఉంటాయి. అంటే ఈ లెక్కన కల్కి 2898 ఎడి సినిమాని తెలుగు ఆడియెన్స్ బుల్లితెర దగ్గర పెద్దగా పట్టించేకోలేదు అని చెప్పక తప్పదు. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ప్రభాస్ లాస్ట్ భారీ సినిమా సలార్ సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇంతే..
థియేటర్స్ లో వందల కోట్లు చస్తున్నప్పటికీ బుల్లితెర దగ్గర మాత్రం తన సినిమాలు రిజెక్ట్ అవుతున్నాయి. మరి దీనికి కారణం ఏమై ఉంటుందో చూడాలి. కాగా ఇపుడు కల్కి పార్ట్ 2 పనులు ఓ పక్క జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ లేని కీలక సన్నివేశాలు మేకర్స్ చేసేస్తున్నారు. ఈసారి ప్రభాస్ కి కమల్ హాసన్ ని నడుమ భారీ యాక్షన్ సీన్స్ ఉండనుండగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా కీలకంగా కొనసాగుతుందట. ఇక ఈ సినిమాలోకి ప్రభాస్ ఎపుడు ఎంటర్ అవుతాడో అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











