Brahmamudi December 22nd:కల్యాణ్, అనామిక హల్దీ వేడుకల్లో అప్పుకు అవమానం.. అరుణ్‌కు షాకిచ్చిన స్వప్న
బ్రహ్మముడి సీరియల్‌లో కల్యాణ్, అప్పు మాట్లాడుకుంటుంటే అనామిక గదిలోకి వస్తుంది. నీతో మాట్లాడుదామంటే ఎప్పుడూ ఎవరో ఒకరు అడ్డుగా ఉంటున్నారని అనామిక అంటుంది. మన బ్రోనే కదా అని కల్యాణ్ అంటాడు. ఇక అప్పు వెళ్లిపోతుంటే... డోర్ దగ్గర నిలబడి ఎవరూ రాకుండూ చూడమని చెప్తుంది అనామిక. అదేం మర్యాదా అలా అంటావ్ అని కల్యాణ్ అంటాడు. మన బ్రోనే కదా అర్థం చేసుకుంటుందని అనామిక మాట్లాడుతుంది. ఇక అప్పు బయట డోర్ దగ్గర కాపాలాగా నిల్చుంటుంది.
ఇక గదిలోకి వచ్చిన అనామిక... నా పేరెంట్స్ కు కొడుకు అయినా, కూతురు అయినా నేనే అని చెప్తుంది. పెళ్లి తర్వాత కూడా నేను వాళ్లకు సహాయంగా నిలవాలని అనుకుంటున్నానని కల్యాణ్ కు చెప్తింది. కాబట్టి, వాళ్లకు ఏ సమస్య వచ్చినా నాకు సహాయం చేస్తానని మాట ఇవ్వు అని చెప్పి.. కల్యాణ్ దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది. దీంతో థ్యాంక్స్ అంటూ కల్యాణ్ ను హగ్ చేసుకుంటుంది అనామిక. ఇంతలో ధాన్యలక్ష్మీ, ప్రకాశం వస్తారు.

అప్పు డోర్ దగ్గర కాపాలా ఉండటం చూసి... ఇక్కడ ఉన్నావ్ అంటూ ధాన్యలక్ష్మి, ప్రకాశం లోపలికి వెళ్తారు. ఇక డోర్ ఓపెన్ చేయగానే కల్యాణ్, అనామిక హగ్ చేసుకోవడం చూసి షాక్ అవుతారు. పెళ్లికి ముందే కొంప ముంచకురా సుపుత్ర అని ప్రకాశం అంటాడు. నీతో నా బ్యాగ్ వచ్చింది. తీసుకెళ్దామని వచ్చానని ధాన్యలక్ష్మి అంటుంది.
మరోవైపు కావ్యకు అరుణ్ కాల్ చేసిన విషయం చెబుతుంది స్వప్న. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తుందని స్వప్న బాధపడుతుంది. స్వప్న ముందు భయపడిన చివరికి కావ్య చెప్పినదానికి ఒప్పుకుంటుంది. రిసార్ట్‌కు వచ్చిన అరుణ్ రాహుల్‌కు కాల్ చేసి లోపలికి రమ్మంటారా అని అడుగుతాడు. టైమ్ చూసుకుని స్వప్నకు ఎదురుపడు అంతే అని రాహుల్ చెబుతాడు.
హల్దీ ఫంక్షన్‌లో కావ్యపై ప్రేమ ఉన్నట్లు కావాలనే, తనను తిట్టించేందుకు నటిస్తాడు రాజ్. దాంతో అంతా సంతోషిస్తే.. అమ్మాయిలు చేయాల్సిన పనిని అబ్బాయి చేస్తుంటే చూస్తుంటావేంటీ, బుద్ధి లేదా అని అపర్ణ కావ్యను తిడుతుంది. ఇప్పుడు కాదు వదినా ఇంట్లోవాళ్లంతా నెత్తిన మీద పెట్టుకున్నప్పుడే దించాల్సింది అని రుద్రాణి అంటుంది. తనే పని చేసుకుంటే నువ్వే వెళ్లి హెల్ప్ చేస్తానని పనులు చేశావ్. ఇప్పుడు కావ్యను అంటుంటే ఏం మాట్లాడవేంటీ అని రాధమ్మ రాజ్‌ను నిలదీస్తుంది.

దాంతో అంతా రాజ్ ను తప్పుబడుతుంటారు. సుభాష్ కూడా ఫైర్ అవుతాడు. తర్వాత హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తారు. పసుపు గొప్పతనం గురించి ఇందిరాదేవి చెబుతుంది. తర్వాత ప్రకాశం మతిమరుపు గురించి అంతా జోకులు వేస్తారు. కల్యాణ్‌ను చూసి అప్పు బాధపడుతుంది. నువ్ కోరుకున్న అమ్మాయితోనైనా సంతోషంగా ఉండు అని అనుకుంటుంది.
మరోవైపు అప్పును చూసి పద్మావతి ఏమైంది, ఎందుకు బాధపడుతున్నావని అడుగుతుంది. ఆ కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయని అడగ్గా.. అవి ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని కనకం చెబుతుంది. ఇంతలో అప్పుని కల్యాణ్ పిలుస్తాడు. అప్పుకు ఏమైందని పద్మావతి అనుమానపడుతుంది. తర్వాత కడుపుతో ఉన్న అరవింద మెట్లు ఎక్కుతుంటే కిందపడబోతుంది. దాంతో తన తమ్ముళ్లు వచ్చి పట్టుకుంటారు. దాంతో ఈ బంధం ఇలాగే ఉండాలని అంతా అనుకుంటారు.
అరుణ్ ను రమ్మనమని, వాడిని చూసి స్వప్న షాక్ అవుతుందని, దాంతో తప్పులు చేస్తుంది. అప్పుడు నేను కథ నడిపిస్తానని రుద్రాణి అంటుంది. దాంతో అరుణ‌్‌కు కాల్ చేసి రమ్మంటాడు రాహుల్. రాజ్, కావ్య సంతోషంగా లేరని ఇందిరాదేవితో రుద్రాణి అంటుంది. అది కావ్యకు స్వప్న చెబుతుంది. ఇప్పుడు మీ అత్తకు షాక్ ఇస్తానంటూ వెళ్లి రాజ్‌కు పసుపు పూస్తుంది కావ్య. ఇద్దరూ సంతోషంగా పసుపు పూసుకుంటారు. దాంతో వాళ్లు సంతోషంగా ఉన్నారు.

లేనిపోని అనుమానాలు పెట్టుకోకు అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. తర్వాత తన అక్క కోసం పద్మావతితో విక్రమాదిత్య పసుపు పూయించుకుంటాడు. ఇలా అంతా పసుపు పూసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇంతలో అరుణ్ స్వప్నకు కనిపిస్తాడు. దాంతో స్వప్న పరిగెత్తుకుంటూ వెళ్లి కావ్యను తీసుకొస్తుంది. అప్పుడు అరుణ్ దాక్కుంటాడు. ఇద్దరూ చెరోవైపు వెతుకుతుంటారు. హమ్మయ్యా అనుకుంటూ అరుణ్ వెళ్లిపోతాడు.
మరోవైపు అప్పును లాక్కొచ్చి కాబోయే అల్లుడితో అలా రాసుకుపూసుకు తిరగడానికి సిగ్గు లేదా అని నానామాటలు అంటారు. అది విన్న కనకం వచ్చి తనకు అలాంటి ఆలోచన లేదని అంటుంది. మాకు అలా అనిపించట్లేదని శైలజ అంటుంది.


Click it and Unblock the Notifications











