Brahmamudi November 14th: కళ్యాణ్ పెళ్లి ఫిక్స్.. స్వప్న బాయ్ ఫ్రెండ్ రీ ఎంట్రీ.. కావ్య కొత్త డ్రామా!

(నవంబర్ 14వ తేదీ) ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో సీతారామయ్య కోసం ఫారిన్ నుంచి ఓ డాక్టర్ వస్తాడు. వచ్చి రిపోర్ట్స్ చూసి.. నయం అవుతుందని చెప్తాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా సంతోషిస్తారు. ఇక ఉమ్మడి కుటుంబాన్ని చూసి మురిసిపోతాడు డాక్టర్. ఇక డాక్టర్ మళ్లీ వస్తాను అంటూ వెళ్లిపోతాడు. ఇక ఇందిరాదేవి కూడా చాలా సంతోషం పడుతుంది. ఇక సీతారామయ్య.. పిచ్చి చిట్టి నన్ను బావ అని ఎవరు పిలుస్తారు.. పైకి వెళ్లినా రంభ, ఊర్వశిలు కూడా తాతాయ్య అంటారు కానీ బావ అనరు కదా అంటాడు. దానికి ఇంట్లో వాళ్లంతా నవ్వుతారు. ఇక తాతాయ్య మీరు ఏం చెప్పినా చేస్తామని రాజ్ అంటాడు.

అందరూ ఎప్పటిలాగే కలిసి ఉందాం.. అన్ని పొరపాట్లను మరిచిపోదాం అని చెప్తాడు. ఇక ఇంట్లో ఏదో ఒక శుభ కార్యం చేద్దామని అంటే.. కళ్యాణ్ పెళ్లి ఉంది కదా అదే చేద్దామని ఇందిరాదేవి అంటుంది. ఇక ఇంట్లో వాళ్లంతా సంతోషంతో మురిసిపోతారు. ఇక కనకం వాళ్లకి కావ్య ఫోన్ చేసి.. తాతాయ్యకు నయం అవుతుందని డాక్టర్లు చెప్పారు అని చెప్తుంది. ఇక కనకం కుటుంబం కూడా సంతోష పడిపోతుంది. ఇక కావ్య డల్ గా ఉందని గమనిస్తారు. ఏమందని కనకం, మూర్తి అడుగుతారు. ఏం లేదని చెప్తారు.

Kalyan Anamika Marriage Fix in November 14th 2023 Episode number 253 in Brahmamudi Telugu Serial

కల్యాణ్ ఫోన్ చేస్తాడు.. కానీ అప్పు కట్ చేస్తుంది. మళ్లీ చేస్తాడు.. అప్పుడు కనకం వచ్చి... ఫోన్ ఎత్తు అని ఇస్తుంది. ఇక అప్పు ఏమైంది రా బై అంటూ మాట్లాడుతుంది. నీకో విషయం చెప్పాలి కలుద్దామని చెప్తే.. నేను రాను అంటుంది అప్పు. ఇక కనకం పో అని చెప్తుంది. లోకేషన్ షేర్ చేస్తాను వచ్చేయ్ అని కల్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక అనామికకు కూాడా ఫోన్ చేస్తాడు కళ్యాణ్. అనామికను కూడా రమ్మని చెప్తుంది.

మరోవైపు రాజ్, కావ్య గొడవ పడుతుంటారు. కావ్య.. రాజ్ తో మాట్లాడడానికి వస్తే... అతను మాత్రం సెటైర్ వేస్తుంటాడు. ఇక మనం ప్రేమించుకోవాలి అని కావ్య అంటుంది. పళ్లు రాలుతాయ్ అని రాజ్ అంటాడు. మనం ప్రేమించుకోవాలి.. మనం సంతోషంగా ఉండాలి అని చెప్తుంది. తాతాయ్య ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తుంది కావ్య. ఈ సందర్భాన్ని అడ్వాంటైజ్ గా తీసుకుని ఒక్కటై పోవాలి అని చూస్తున్నావా అని రాజ్ అంటాడు. మీ సమస్య ఏంటి అని అడుగుతాడు కావ్య. నువ్వే నా సమస్య అంటాడు రాజ్. నువ్వు దూరంగా ఉంటే నా సమస్య పోతుంది అని రాజ్ అంటాడు.

Kalyan Anamika Marriage Fix in November 14th 2023 Episode number 253 in Brahmamudi Telugu Serial

నా వల్ల కాదు అని కావ్య చెప్తుంది. నా వల్ల అవుతుందని రాజ్ అంటాడు. అయినా సరే నా వల్ల కాదు అని కావ్య అంటుంది. కుటుంబం కోసం నాతో ప్రేమగా ఉన్నట్లు మీరు నటించారు. నేను నా అక్క కోసం నిజం తెలిసినా తెలియనట్టు నటించాను.. నాది నాటకం అయితే.. మీది నాటకమే అంటుంది. ఇద్దరు చేరో అబద్ధం ఆడి.. తిరిగాం. అవును నేను నటించాను.. అవసరం అయితే ఇకపై కూడా నటిస్తాను.. అంతే తప్ప నీతో కలిసి కాపురం మాత్రం చేయలేను. భార్యగా ఎప్పుటికి ఒప్పుకోను అని చెప్తాడు రాజ్.

ప్రేమగా చూసుకుంటేనే కదా నేను ఇంట్లో ఉండేది అని చెప్తుంది కావ్య. ప్రేమ అనే పదానికి మన ఇద్దరి మధ్య ఎప్పటికీ స్థానం ఉండదు అని రాజ్ చెప్తాడు. ఇన్నాళ్లు మహా నటిగా నటించావ్.. ఇకముందు కూడా అలాగే నటించు అని రాజ్ అంటాడు. ఇక కావ్య.. నేను నటిస్తే ఎవరు కనిపెట్టలేరు అని కావ్య చెప్తుంది. మీకు కావాల్సింది నటనే కదా... అని కావ్య అంటుంది. తాతాయ్య గారి కోసం నేను అదే చేయబోతున్నా అంటాడు రాజ్. ఇక కావ్య మనసులో నేను కూడా ఆయన రూటులోనే వెళ్లాలి అనుకుంటుంది. నేను కూడా నటిస్తాను అని చెప్తుంది కావ్య. ఏవండీ అంటూ కావ్య ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నటనే అండి.. ముందుంది అసలు సినిమా అని చెప్తుంది.

కావ్యను ఇంట్లోంచి ఎలా పంపించాలో అని రాహుల్ ఆలోచిస్తూ ఉంటాడు. రుద్రాణి వచ్చి... ఇంట్లో ఇప్ప‌టికే మ‌న మీద అంద‌రూ కోపంగా ఉన్నార‌ని, పిచ్చి ప‌నులు చేసి న‌న్ను కూడా ఇర‌కాటంలో పెట్టొద్ద‌ని కొడుకుతో అంటుంది. ఆస్తి ద‌క్క‌ద‌ని తేలిపోవ‌డంతో మ‌రో దారిలో కోటీశ్వ‌రులు కావాల‌ని రాహుల్ ఆలోచన చేస్తుంటాడు. స్వ‌ప్న అడ్డు తొల‌గించుకొని మ‌రో పెళ్లి చేసుకుంటేనే అది సాధ్య‌మ‌వుతుంద‌ని తల్లితో చెప్తాడు.

స్వ‌ప్న త‌న పాత బాయ్‌ఫ్రెండ్‌ తో ఇంకా రిలేష‌న్ షిప్ కంటిన్యూ చేస్తుంద‌ని దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రిని న‌మ్మించేలా చేస్తే త‌మ ఫ్లాన్ ఫ‌లిస్తుంద‌ని రుద్రాణికి చెప్తాడు. ఈ అబ‌ద్ధాన్ని మొద‌ట‌ రాజ్‌, అప‌ర్ణ‌ల‌ను న‌మ్మించేలా చేస్తే త‌మ ప్లాన్ ఫ‌లించిన‌ట్లేన‌ని అనుకుంటారు. అప్పుడే స్వ‌ప్న ఇంట్లో నుంచి వెళ్లిపోయే అవ‌కాశం ఉంద‌ని అనుకుంటారు. మరోవైపు పెళ్లి విష‌యం చెప్పాల‌ని అనామిక‌, అప్పును పిలుస్తాడు క‌ళ్యాణ్‌. అత‌డిపై ప‌దే ప‌దే అప్పు ఫైర్ అవుతుంది. త‌న ముందే అప్పు, క‌ళ్యాణ్ గొడ‌వ‌ప‌డ‌టం అనామిక స‌హించ‌లేక‌పోతుంది.

అస‌లు ఎందుకు పిలిచావో చెప్ప‌మ‌ని నిల‌దీస్తుంది అప్పు. ఇంట్లో వాళ్లు మ‌న పెళ్లికి డేట్ ఫిక్స్ చేశార‌ని అనామిక‌తో అంటాడు క‌ళ్యాణ్. ఆ మాట విని అనామిక ఆనందం ప‌ట్ట‌లేక‌పోతుంది. క‌ళ్యాణ్‌ ను కౌగిలించుకుంటుంది. పెళ్లి క‌బురు విని అప్పు షాక్ అవుతుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో సారీ కళావతి అని బోర్డ్ మీద రాసి ఉంటుంది. అది చూసిన ఇంట్లో వాళ్లు రాజ్ రాశాడు అని అనుకుంటారు. రాజ్ వచ్చి ఏముంది ఇందులో అని చూస్తాడు. ఇక ధాన్య లక్ష్మి.. నోటీతోనే చెప్పేయొచ్చు కదా.. ఇలా బోర్డ్ మీద రాయడం ఎందుకు అంటుంది. ఇక మరోవైపు రాజ్ ను కోపంగా చూస్తుంది అపర్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X