Brahmamudi November 28th: స్వప్న ప్రియుడిపై ఎంక్వైరీ మొదలు పెట్టిన కావ్య.. అనామిక అసలు రంగు బయటకు!

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (నవంబర్ 28వ తేదీ) అప్పు ప్రేమ విషయంలో సలహా ఇవ్వమని కనకం.. అన్నపూర్ణమ్మను అడుగుతుంది. కానీ అన్నపూర్ణమ్మ.. అప్పు, కల్యాణ్ పెళ్లి జరగొద్దు... ఇప్పటికే మనం మోస్తున్న నిందలు చాలు... వద్దని చెప్తుంది. కానీ అప్పు బాధ చూసి తట్టుకోలేకపోతున్నా అని కనకం ఆవేదన చెందుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా అవతల అనామిక, కల్యాణ్ పెళ్లి ఏర్పాట్లు జరగుతున్నాయని అన్నపూర్ణమ్మ చెప్తుంది.

కల్యాణ్ కు కూడా అప్పు అంటే చాలా ఇష్టం. కాకపోతే అనామి ముందు చెప్పింది కాబట్టి ఒప్పుకున్నాడేమో.. అదే అప్పు చెప్తే ఒప్పుకోడా.. ఎలాగూ పెళ్లికి ముందే కల్యాణ్ ను ఒప్పిస్తే అని కనకం చెప్తుంది. ఈలోపు కృష్ణ మూర్తి ఎంటర్ అయి.. కనకం మీద సిరీయస్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్.. దీన్ని కూడా ఆ ఇంటికే కోడలుగా పంపుతావా... నువ్వు మళ్లీ అబద్దాలు, మోసాలు మొదలు పెడతావా అంటూ ఫైర్ అవుతాడు.

Kalyan Concern For Appu in November 28th 2023 Episode number 265 in Brahmamudi Telugu Serial

ఈ విషయం తెలిస్తే... మనల్ని రానివ్వడం కాదు.. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు కూతుర్లను బయటకు గెంటేస్తారు అని మూర్తి అంటాడు. ఇంకోసారి నీ సొంత తెలివితేటలు వాడకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇక మరోవైపు స్వప్న గదికి వెళ్లి కావ్య మాట్లాడుతుంది. కాసేపు వాదించుకుంటారు. నువ్వు తప్పు చేసినా... అది నా మెడకు చుట్టుకుంటుందని కావ్య చెప్తుంది. అరుణ్ కు డబ్బులు ఎందుకు ఇచ్చావని కావ్య.. స్వప్నను అడుగుతుంది. ఏదైనా ఉంటే నాకు చెప్పమని చెప్పా కదా.. అని కావ్య అంటుంది.

ఇక స్వప్న మాట్లాడుతూ.. అరుణ్ కాలేజ్ డేస్ నుంచి ఎలా ఉన్నాడో నీకు కూడా తెలుసు... అలాంటి వ్యక్తి ఇలా చేస్తాడు అనుకుంటామా.. అంతే కాదు.. నాకు రాహుల్ పెళ్లి విషయంలో కూడా ప్రెగ్నెన్సీ ఫేక్ సర్టిఫికెట్ ఇప్పించాడు.. అంత సాయం చేసిన వ్యక్తి ఇలా ఎందుకు చేస్తాడు... డబ్బు కోసం చేస్తే ఎందుకు బయటపెడుతాడు ఇవన్నీ అని అంటుంది. కావ్య కూడా ఆలోచనలో పడుతుంది. ఇక స్వప్నకు జాగ్రత్తలు చెప్తుంది. దీంతో అక్క చెల్లెళ్లు ఒక్కటైపోయారని తెలుస్తోంది.

ఇక కావ్య.. అరుణ్ ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచిస్తూ వెళ్తుంది. మరోవైపు తల్లి కొడుకులు రాహుల్, రుద్రాణి మాట్లాడుకుంటారు. అది కావ్య గమనిస్తూ ఉంటుంది. తర్వాత అక్కడికి ఎంటర్ అయి రాహుల్ మీద సెటైర్స్ వేస్తుంది కావ్య. ముందు మీ అక్క గురించి చూసుకో అని రుద్రాణి అంటుంది. ఇక కావ్య.. అరుణ్ ఫోటోలు మీకు ఎవరు పంపించారు.. అని క్వశ్చనరీ మొదలు పెడుతుంది. ఇక రాహుల్ ఆవేశంలో అరుణ్ ఫోన్ నెంబర్ ఇస్తాడు. అతనే పంపాడు అని చెప్తాడు.

ఇక అరుణ్ ను పట్టుకుంటే అసలు విషయం తెలుస్తుందని కావ్య అనుకుంటుంది. మరోవైపు అనామిక, కల్యాణ్ షాపింగ్ కు బయలుదేరుతారు. అప్పును తీసుకుపోవాలని అనుకుంటారు. ఇక కనకం అప్పు ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కల్యాణ్.. కనకం ఇంటికి వస్తాడు. అనామిక కారులో ఉంటుంది. కల్యాణ్ ఇంటి లోపలికి వెళ్తాడు.

Kalyan Concern For Appu in November 28th 2023 Episode number 265 in Brahmamudi Telugu Serial

అప్పు ఎక్కడ అని కల్యాణ్ అడుగుతాడు. ఈ మధ్య తినడం లేదు.. ఎవరితో మాట్లాడటం లేదు అని కనకం చెప్తుంది. నేను మాట్లాడుతా అంటీ అని కల్యాణ్ లోపలికి వెళ్తాడు. ఇక అప్పును చూసి.. బ్రో ఏమైంది ఇలా ఉన్నావ్ అని కల్యాణ్ అంటాడు. అప్పును బయటకు తీసుకువచ్చి.. బయటకు పోదాం అని అడుగుతాడు. అనామిక కూడా వచ్చింది పదా అంటాడు కల్యాణ్. ఇక అప్పు సిరీయస్ అవుతుంది.

ఏంటి బ్రో ఒకప్పుడు మనం ఎలా ఉండే వాళ్లం... ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావ్.. ఒకప్పుడు నేను కూడా ఇలా గదిలోనే ఉండే వాడిని.. కానీ నువ్వే నన్ను బయటకు తీసుకువచ్చావ్.. నిజమైన ఆనందం మనుషుల మధ్య ఉంటుందని నేర్పించావ్ అని కల్యాణ్ అంటాడు. ఇన్ని చేసిన నువ్వు ఇలా ఉంటే ఎలా వదిలి వెళ్లిపోతాను అని కల్యాణ్ అంటాడు. ఈ లోపు అనామిక వచ్చి.. సిరీయస్ అవుతుంది. ప్రేమించన దాన్ని రోడ్డు మీద ఒదిలేసి.. ఇక్కడ నీ ఫ్రెండుతో ముచ్చట్లుచెప్తున్నావా అంటుంది.

అలా అనకు అనామిక అప్పు ఫీల్ అవుద్ది అని అంటాడు కల్యాణ్. అయితే నా ఫిలింగ్స్ తో పనిలేదా అని అంటుంది అనామిక. ఇలా గొడవ అవుతున్న క్రమంలో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో రాహుల్ అరుణ్ దగ్గరకు వెళ్తాడు. ఇక కావ్య నీ దగ్గరకు రాబోతుందని చెప్తాడు. అరుణ్ షాక్ అవుతాడు. ఇంతలో కావ్య.. రాజ్ ను తీసుకుని అరుణ్ దగ్గరకు బయలుదేరుతుంది. అరుణ్ క్యాబిన్ లోకి వచ్చి షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X