Brahmamudi November 29th: అప్పు కోసం అనామికను హర్ట్ చేసిన కల్యాణ్.. అందరి ముందు రాజ్‌ను ఇరికించిన కావ్య

కల్యాణ్.. అప్పుతో మాట్లాడుతుంటే.. కోపంతో అనామిక లోపలికి వస్తుంది. ఏమైంది కార్లో కూర్చొమన్న కదా అని కల్యాణ్ అంటాడు. నేనేం పిచ్చిదాన్ని కాదు.. నా కోసమే అందరూ వెయిట్ చేసేవాళ్లు.. ఇప్పుడు నన్ను వెయిట్ చేయిస్తున్నావ్ అని అనామిక అంటుంది. అప్పు ఫీలవుతుందని కళ్యాణ్‌ అంటాడు. అయితే నీ ఫ్రెండుతోనే ఉండు అంటూ అనామిక అలిగి వెళ్లిపోతుంది. కనకం పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎందుకు బాధపెడుతావు అని కనకం అంటుంది.

అనామికను ఎలాగైనా కన్వీన్స్‌ చేయగలను కానీ అప్పును సంతోషంగా చూసే వరకు ఇక్కడి నుంచి వెళ్లను అని కల్యాణ్ అంటాడు. నువ్వు ఎంత సేపు కూర్చున్నా నీకు సమాధానం దొరకదని అప్పు అంటుంది. ఎందుకంటే నేను ఏ విషయంలోనూ బాధపడటంలేదు. కాబట్టి నువ్వు అనవసరంగా టైం వేస్ట్‌ చేసుకుంటున్నావని చెప్తుంది. నీ దగ్గర నుంచే మొండితనం నేర్చుకున్నానని కల్యాణ్ అంటాడు. నువ్వు మారి నువ్వు నోరి తెరిచి నిజం చెప్పేంత వరకు నేను ఎక్కడికి వెళ్లను. చూసుకుందాం నువ్వో నేనో అని అలాగే కూర్చుంటాడు.

Kalyan hurt Anamika for Appu in November 29th 2023 Episode number 266 in Brahmamudi Telugu Serial

మరోవైపు రాజ్‌ బెడ్‌రూంలో రెడీ అవుతుంటాడు. కావ్య అక్కడికి వచ్చి..: తొందరగా రెడీ అవ్వమని చెబుదామని వచ్చా కానీ మీరే రెడీ అయ్యారని చెప్తుంది. రోజూ నువ్వు చెప్తేనే రెడీ అవుతున్నానా? ఈరోజు వచ్చి కొత్తగా చెప్తున్నావు అని రాజ్ అంటాడు. రోజూ మీరు ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అయ్యేవారు. ఈరోజు మాత్రం నాకోసం రెడీ అయ్యారని కావ్య అంటుంది. నీ కోసమా అని అంటాడు రాజ్. అవును ఈరోజు మీరే నన్ను బయటికి తీసుకెళ్తున్నారని కావ్య అంటుంది.

నీతో కలిసి రాను అంటాడు రాజ్. అయితే మన ఫ్యామిలీ కోసమైనా రావా అని అడుగుతుంది కావ్య. ఫ్యామిలీ కోసమా అంటే అని రాజ్‌ ప్రశ్నిస్తాడు. ఎలాగైనా మీరు వచ్చేలా చేస్తానని ఛాలెంజ్‌ చేసి బయటికి వెళ్తుంది కావ్య. హాల్లో అందరూ కూర్చుని ఉంటారు. కావ్య సిగ్గుపడుతూ రావడం చూసి..ఏంటి కోడలు పిల్లా ఇవాళ కొత్తగా కనిపిస్తుందని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అది మీ అబ్బాయి బయటికి వెళ్దామని చెప్పారని అంటుంది కావ్య.

బయటికి అంటే ఎక్కడికి అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. అది ఎవ్వరికీ చెప్పొద్దన్నారు. సర్‌ ప్రైజ్‌ అట అని కావ్య అంటుంది. చెప్తుండగానే రాజ్‌ వస్తాడు. ఇక తన మాటలతో రాజ్ ను ఇరికించి.. బయటకు తీసుకువెళ్లేలా చేస్తుంది కావ్య. ఇదంతా చూసిన రుద్రాణి ఏమి ఎరుగని వెల్లుల్లిపాయ ముంతలో వేస్తే కరిగిపాయే.. రాజ్ ను నీ కోడలు బాగానే మ్యానేజ్ చేస్తుందని అంటుంది. మధ్యలో నీకేంటి బాధ.. పతివ్రత పరామన్నం చేస్తే.. తెల్లారిన చల్లారలేదంట.. వాళ్ల కాపురం అలాంటిది అని ధాన్యలక్ష్మి అంటుంది.

Kalyan hurt Anamika for Appu in November 29th 2023 Episode number 266 in Brahmamudi Telugu Serial

అప్పు ఒక్కతే కూర్చొని అన్నం తింటూ ఉంటుంది. అది చూసి కనకం సంతోషపడుతుంది. కల్యాణ్ చెప్పగానే అన్నం తింటుందని కనకం అన్నపూర్ణతో అంటుంది. అవును నేను చూస్తున్నాను అని అంటుంది. ఇక అనామిక వచ్చి కోప్పడినా అప్పు కోసం ఇక్కడే ఉండి పోయాడు అంటుంది అన్నపూర్ణ. అప్పులాగే కల్యాణ్‌ కూడా తనకు తెలియకుండా అప్పును ప్రేమిస్తున్నాడని అనిపిస్తుందని కనంక అంటుంది. అది కల్యాణ్ కు తెలిసేలా చేయాలని కనకం అనుకుంటుంది. దేవుడు ఒక్కచాన్స్‌ ఇస్తే బాగుండు. నేను ఆ ఇంట్లో అడుగుపెడతా.. కళ్యాణ్‌తో అప్పు పెళ్లి జరిపిస్తా అని అంటుంది.

కనకం చెప్తుండగానే స్వప్న కనకానికి ఫోన్‌ చేస్తుంది. చెప్పమ్మా ఈసారి ఏం పని చేశావని అంటుంది కనకం. నేను ఏదో ఒకటి చేయాలని ఎదురుచూస్తున్నావా? అమ్మ అని స్వప్న అంటుంది. నువ్వు నా కూతురివి కదా ఆమాత్రం ఉంటుందిలే అమ్మ అని కనకం అంటుంది. అనగానే స్వప్న తనకు కడుపొచ్చిందని.. ఈసారి నిజమైన కడుపేనని చెప్తుంది స్వప్న. అయితే కనకం నమ్మదు. కావ్యను అడిగి తెలుసుకో..లేదంటే మా ఇంటికి వచ్చి అత్తయ్యను అడుగు అంటూ ఫోన్ కట్‌ చేస్తుంది స్వప్న.

కావ్య, రాజ్‌ కారులో వెళ్తుంటారు. ఇంతలో కనకం కావ్యకు ఫోన్‌ చేస్తుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన కావ్య లౌడ్‌ స్పీకర్‌ పెట్టి మాట్లాడుతుంది. ఏంటో ఆ దున్నపోతు కడుపుతో ఉందా? అని కనకం అంటుంది. దున్నపోతు కడుపుతో ఉండటమేంటమ్మా? అని కావ్య అంటుంది. దీనికి రాజ్ పగులపడి నవ్వుతుంటాడు. అదేనే నీ అక్క అని కనకం చెప్తుంది. చూశావా మీ అమ్మే నమ్మడం లేదు. ఇక రాహుల్‌ ఎలా నమ్ముతాడు మా అత్తేం నమ్ముతుంది నేనేం నమ్ముతాను అంటాడు రాజ్‌. కనకం కూడా నమ్మనని అది మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టుందని అంటుంది.ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో అరుణ్ తో రాహుల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్, కావ్య వస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X