బిగ్ బాస్ 8 షోకి హోస్ట్ గా చెయ్యలేను.. సీనియర్ హీరో ఎమోషనల్ ప్రెస్ నోట్ వైరల్

ఒక్క భారతీయ బుల్లితెర మీద మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న షోస్ లో అతి పెద్ద రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ మాత్రమే అని చెప్పాలి. వెస్ట్రన్ లో ఈ ఇంట్రెస్టింగ్ రియాలిటీ షో పుట్టగా ఇండియాలోకి కూడా వచ్చింది. కాగా ఇండియాలో బుల్లితెర అంతా ఒక రకమైన ట్రెండ్ లో వెళుతున్న క్రమంలో బిగ్ బాస్ వచ్చి మొత్తం చేంజ్ చేసేసింది.

ఇలా పాన్ ఇండియా భాషల్లో ఇండియాలో అయితే సక్సెస్ ఫుల్ గా ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ ఒక్క బుల్లి తెరపై మాత్రమే కాకుండా ఓటిటిలో కూడా రన్ అవుతూ సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. కాగా అన్ని భాషల్లో ఉన్నప్పటికీ సౌత్ ఆడియెన్స్ ఇచ్చే రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. కాగా తెలుగు వెర్షన్ అయితే రికార్డుల మోత మోగించింది.

Kamal haasan quits his host post for bigg boss Tamil season 8 writes emotional letter

అయితే ఇలాంటి రియాలిటీ షోస్ ని అద్భుతంగా నడిపించాలి అంటే దానికి సారధిగా సరైన హోస్ట్ ఉండాల్సిందే. అలా పలువురు స్టార్ హీరోల చేత ఛానెల్స్ వారు ఈ భాద్యతలు అప్పగిస్తే వారు తమ పాత్రలు వ్యాఖ్యాతలుగా అదరగొడుతున్నారు. అయితే తెలుగులో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గత 5 సీజన్లను హోస్ట్ గా చేయగా ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి కూడా తానె అన్నట్టుగా టాక్ వచ్చింది.

కాగా సౌత్ నుంచే మరో సీనియర్ హీరో అయితే ఇక బిగ్ బాస్ 8 కి తాను హోస్ట్ చేయలేను అని తేల్చి చెప్పేసారు. కాగా ఆ హీరోనే మన సుప్రీం యాస్కిన్ ఉలగనయగన్ కమల్ హాసన్. తాజాగా తాను ఒక ఎమోషనల్ ప్రెస్ నోట్ ని ఇచ్చి షాకిచ్చారు. గత ఏడేళ్లు విజయ టీవీతో బిగ్ బాస్ హోస్ట్ గా నేను కొనసాగాను కానీ ఈసారి సీజన్ 8 మాత్రం చేయలేకపోతున్నాను అని తేల్చేసారు.

Kamal haasan quits his host post for bigg boss Tamil season 8 writes emotional letter

అయితే దీనికి కారణం కూడా తాను వెల్లడించారు. ప్రస్తుతం తాను చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి అందుకే బ్యాలన్స్ చేయలేక ప్రస్తుతానికి బిగ్ బాస్ కి బ్రేక్ ఇస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఇక్క బ్రేక్ ఇస్తున్నా అని చెప్పారు కానీ ఎక్కడా పూర్తిగా వదిలేసినట్టు కమల్ చెప్పలేదు. కాగా తనతో ఇన్నేళ్ల పాటు ప్రయాణం చేసిన మొత్తం నటీనటులు, సిబ్బంది, కంటెస్టెంట్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కమల్ తెలిపారు.

ఈ బిగ్ డెసిషన్ మాత్రం ప్రస్తుతానికి కోలీవుడ్ ఆడియెన్స్ కి షాకింగ్ అని చెప్పాలి. మరి ఈసారి సీజన్ 8 ని ఎవరు హోస్ట్ చేస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇక మరోపక్క కమల్ నటించిన భారతీయుడు 2 రీసెంట్ గానే థియేటర్స్ లోకి వచ్చి ఇప్పుడు ఓటిటిలో కూడా రావడానికి సిద్ధం అవుతుంది. అలాగే ప్రస్తుతం మణిరత్నంతో ఓ సినిమా, అన్బు అఱివుతో ఓ సినిమా వచ్చే ఏడాది భారతీయుడు 3, అలాగే కల్కి 2 లతో రాబోతున్నారు.

More from Filmibeat

Read more about: kamal haasan akkineni nagarjuna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X