కమల్ హాసన్‌కు అంత సీన్ లేదట.. బిగ్ బాస్ పెద్ద బోరట.. పెదవి విరిచిన ప్రేక్షకులు

తమిళ బిగ్‌బాస్ వెర్షన్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తున్నది. ఆదివారం ప్రసారమైన తొలి ఎపిసోడ్‌లో కమల్ ప్రజంటేషన్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.

By Rajababu

తమిళ బిగ్‌బాస్ వెర్షన్ ఎన్నో రోజులుగా ఎదురు చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైనట్టు తెలుస్తున్నది. ఆదివారం ప్రసారమైన తొలి ఎపిసోడ్‌లో కమల్ ప్రజంటేషన్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. కమల్ బిగ్ బాస్ కార్యక్రమానికి సరిపోడనే వాదనను నెటిజన్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నారు. తొలి ఎపిసోడ్ ఆకట్టుకోలేదనే వ్యాఖ్యలను పలువురు పోస్ట్ చేయడం గమనార్హం. అయితే మున్ముందు ఎపిసోడ్స్ ఏమైనా కొంత రిలీఫ్ ఇస్తాయేమో వేచి చూడాల్సిందే అనే భావన వ్యక్తం చేస్తున్నారు.

పేలవంగా కమల్

పేలవంగా కమల్

బిగ్‌బాస్ తమిళ వెర్షన్ ద్వారా కమల్ టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించారు. అయితే తొలి ఎపిసోడ్‌లో కమల్ నటన, సెన్సాఫ్ హ్యుమర్ పేలవంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది.

యంగ్ హీరో అయితే బాగుండేది..

యంగ్ హీరో అయితే బాగుండేది..

బిగ్‌బాస్ తమిళ వెర్షన్‌కు కమల్ ఎంపిక చేసినప్పుడే కొందరు సరికాదు అనే వాదన వినిపించారు. యంగ్ హీరో అయితే ప్రొగ్రాంకు యాప్ట్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమల్ ఆ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో అనే అంశంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలి ఎపిసోడ్ పేలవంగా, నాసిరకంగా ఉండటంపై అనేక విమర్శలు చెలరేగుతున్నాయి.

ఆకట్టుకోలేకపోయిన కమల్

ఆకట్టుకోలేకపోయిన కమల్

తనకు ఉన్న మాస్ ఇమేజ్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేస్తారని బిగ్ బాస్ నిర్వాహకులు ఆశించారు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ఎంపికైన తర్వాత కమల్ మాట్లడుతూ.. ఈ పొగ్రాంకు మంచి రీచ్ ఉంది. చాలా మంది వీక్షకులకు ఈ ప్రోగ్రాంను చూస్తారు. అందుకే వారికి చేరువ కావాలని కోరుకొంటున్నాను. నేను డబ్బు కోసమే ఈ షోను ఒప్పుకొన్నాను. డబ్బులు కూడా నాకు ముఖ్యమే. నేనేదీ ఉచితంగా చేయను అని కమల్ అన్నారు. అయితే వ్యాఖ్యాతగా కమల్ వీక్షకులు ఆకట్టుకోలేదనే వాదన తొలి ఎపిసోడ్ తర్వాత వినిపించడం గమనార్హం.

వంద రోజులపాటు ..

వంద రోజులపాటు ..

ఈ కార్యక్రమంలో నమిత, శక్తి వాసు, గణేశ్ వెంకట్రామన్, గంజా కరుపు, ఆరవ్, హారతి, ఓవియా, స్నేహన్, రాజియా విల్సన్, భరణి, గాయత్రి రఘురామన్, వ్యాపురి అనుయా శ్రీ అనే నటులు పాల్గొన్నారు. జల్లుకట్టు సందర్భంగా సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిన మీడియాలో నిలిచిన జూలీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం ఓ ఇంటిలో దాదాపు 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా కమల్ ప్రతీవారం దర్శనిమిస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X