Vikram movie కలెక్షన్ల సునామీ.. ఐదేళ్ల బాహుబలి 2 రికార్డు బ్రేక్.. 300 కోట్ల వసూళ్లతో మహాజోరు!
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా విడుదలైన అన్ని చోట్ల సరికొత్త రికార్డులను నమోదు చేస్తన్నది. ఈ చిత్రం రెండో వారంలో కూడా స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ కలెక్షన్లను రాబడుతున్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం సంచలన విజయం సాధించిన బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

300 కోట్ల క్లబ్‌లోకి
విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య నటించిన విక్రమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది.

చిరంజీవి ప్రశంసలు.. విందు
విక్రమ్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. అద్బుతమైన విజయాన్ని అందుకొన్న నా స్నేహితుడు కమల్ హాసన్‌కు శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ జరుపుకొన్న తర్వాత కమల్ హాసన్‌ను తన నివాసానికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారారు.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల గ్రాస్, తమిళనాడులో 122.60 కోట్లు, కర్ణాటకలో 17.30 కోట్లు, కేరళలో 30.15 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 6.65 కోట్లు, ఓవర్సీస్లో 96 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దీంతో ఈ చిత్రం 148 కోట్ల షేర్, 300 కోట్ల గ్రాస్ వసూళ్లను గత 10 రోజుల్లో నమోదు చేసింది.

తమిళనాడులో బాహుబలి రికార్డు
అయితే తమిళనాడులో విక్రమ్ చిత్రం చరిత్ర సృష్టించబోతున్నది. గతంలో బాహుబలి 2 సినిమా పేరిట ఉన్న అత్యధిక వసూళ్ల రికార్డును తిరగరాసేందుకు సిద్దమైంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 చిత్రం 155 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ రికార్డును అధిగమించేందుకు విక్రమ్ సినిమా పరుగులు పెడుతున్నది. బుధవారం నాటికి ఈ సినిమా బాహుబలిని అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

కేజీఎఫ్2 చిత్రాన్ని బ్రేక్ చేసి..
తమిళనాడు సినిమా చరిత్రలో విక్రమ్ అనేక మైలురాళ్లను అధిగమించింది. గత 10 రోజులుగా ఈ చిత్రం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం 2022లో అజిత్ నటించిన వాలిమై, ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్‌లో వచ్చిన కేజీఎఫ్ 2 చిత్రాల తర్వాత అధిక వసూళ్లు సాధించిన చిత్రంగా విక్రమ్ మరో ఘనతను సాధించింది.


Click it and Unblock the Notifications











