Bigg Boss కంటెస్టెంట్‌కు షాకింగ్‌గా రెడ్ కార్డు.. బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్!
బిగ్‌బాస్ రియాలిటీలో జోరు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో బిగ్‌బాస్ షోలు ఊపందుకొన్నాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సంచలన విషయాలతో ఈ షో కొనసాగుతున్నది. ఇక కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షోలో ఈ వారం ముగింపు సెన్సేషనల్‌గా, షాకింగ్‌గా మారబోతున్నది. అయితే ఇంటి నుంచి ఇద్దరు కంటెస్టెంట్లను బయటకు పంపించే విధంగా డబుల్ ఎలిమినేషన్‌కు తెర లేపే ప్రయత్నాలు కనిపించాయి. ఆ వివారాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తమిళం షో దాదాపు 18 కంటెస్టెంట్లతో మొదలైంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో ఇళ్లు కళకళలాడుతున్నది. ఇంటిలో టాస్కుల్లో భారీ గొడవలు, ఒకరిపై మరొకరు శారీరకంగా దాడులు చేసుకోవడం షాకింగ్‌గా మారింది. అయితే ఇద్దరు కంటెస్టెంట్లు నిబంధనల ఉల్లంఘించడంతో వారిద్దరిపై చర్యలు తీసుకొనేందుకు బిగ్‌బాస్ రెడీ అవుతున్నారు.

బిగ్‌బాస్ ఇంటిలో జరిగిన టాస్క్ సందర్భంగా విజయ్ వర్మ, ప్రదీప్ మధ్య భారీ గొడవ చోటుసుకొన్నది. ప్రదీప్‌పై విజయ్ వర్మ దాడి చేయడాన్ని బిగ్‌బాస్ తీవ్రంగా పరిగణించారు. తాజాగా వీకెండ్ షోలో విజయ్ వర్మకు రెడ్ కార్డు చూపించి బయటకు పంపించేందుకు రంగం సిద్దమైందనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
తాజా ప్రమో ప్రకారం.. హోస్ట్ కమల్ హాసన్‌కు ప్రదీప్‌పై ఇంటి సభ్యులు భారీగా ఫిర్యాదు చేయడం కనిపించింది. ప్రదీప్ దుర్బాషలాడుతూ ఎటాక్ చేశాడు. ప్రదీప్ ప్రవర్తన తీరు వల్ల కంటెస్టెంట్లు అభద్రతాభావం ఏర్పడుతున్నది. ఇతరులంటే ద్వేషంతో దాడులకు పాల్పడుతున్నాడు అని ఫిర్యాదు చేయడం కనిపించింది.

కంటెస్టెంట్ల ఫిర్యాదు తర్వాత ప్రదీప్‌ను ఇంటి నుంచి బయటకు పంపించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. అలాగే ఈ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యే జాబితాలో అన్నా భారతీ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఈ వారం ఇంటి నుంచి డబుల్ ఎలిమినేషన్‌తో ఇద్దరిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











