ప్రమాదంలో బిగ్ బాస్ షో.. తీవ్రవివాదంలో కమల్ హాసన్, ఐశ్వర్య దత్తతో అలా!
తమిళ బిగ్ బాస్ షో ప్రమాదంలో పడింది. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బిగ్ బాస్ షోపై, కమల్ హాసన్ పై కేసులు నమోదయ్యాయి. ఈ గత శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో జరిగిన సంఘటనే దీనికి కారణం. ఆడియన్స్ కి వినోదాన్ని అందించే క్రమంలో బిగ్ బాస్ షో పాపులర్ అయింది. ఆడియన్స్ లో ఈ షోకు విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. అదేస్థాయిలో బిగ్ బాస్ షోని విమర్శించే వారు కూడా ఉన్నారు. తాజాగా చెలరేగిన వివాదం ఏస్థాయికి వెళుతుందో అని తమిళ బిగ్ బాస్ నిర్వాహకులు కంగారు పడుతున్నారు.

డిక్టేటర్ టాస్క్
గత వారం బిగ్ బాస్ హౌస్ లో డిక్టేటర్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో డిక్టేటర్ గా నటి ఐశ్వర్య దత్త ఎంపికైంది. ఈ టాస్క్ లో భాగంగా ఐశ్వర్య దత్త నియంతలా వ్యవహరిస్తూ మిగిలిన ఇంటి సభ్యులని కంట్రోల్ చేయాలి.

ముఖంపై చెత్త
ఒక సందర్భంగా హౌస్ మేట్ ఒకరు తన నిబంధన అతిక్రమించడాని అతడి ముఖాన ఐశ్వర్య చెత్త కొట్టింది. ఈ అంశం బిగ్ బాస్ షో పై విమర్శలు చెలరేగేలా చేసింది. ఈ వ్యవహారం వరకు కమల్ హాసన్ కు ఎలాంటి సంబంధం లేదు.

మరీ అతిగా
డిక్టేటర్ టాస్క్ లో ఐశ్వర్య ఎక్కువగా అతిచేసి మిగిలిన ఇంటి సభ్యులని హింసించిందనే చెడు అభిప్రాయం ఆడియన్స్ లో నెలకొంది. ఐశ్వర్యదత్త పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా మొదలైంది.

చర్చలో భాగంగా
వీకెండ్ లో హోస్ట్ గా కమల్ హాసన్ ఎంటర్ అయ్యారు. ఆ వారం హౌస్ లో జరిగిన అంశాల గురించి చర్చిస్తూ, ఐశ్వర్య నియంత వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. ఐశ్వర్యని కమల్ తప్పు బడుతూ ఆమెని మందలించాడు.

తీవ్రమైన వ్యాఖ్యలు
ఐశ్వర్యని మందలించే క్రమంలో కమల్ హాసన్ అనుకోకుండా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గురించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'నియంతలా రాష్ట్రాన్ని పాలించిన వారి గత ఏమైందో నీకు తెలియదా' అంటూ ఐశ్వర్యంతో కమల్ అన్న మాటలు మంటలు రేపుతున్నాయి.

బిగ్ బాస్ వేదికగా
ఈ వ్యాఖ్యలనే కమల్ హాసన్ బయట చేసి ఉంటే రాజకీయ విమర్శలుగా భావించే వారు. కానీ బిగ్ బాస్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్రవివాదం మొదలైంది. ప్రముఖ లాయర్ రమేష్ కమల్ హాసన్ పై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

అంతా డ్రామానే
లాయర్ రమేష్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రిని కమల్ హాసన్ ఓ రియాలిటీ షో వేదికగా అవమానించారని ఆరోపించారు. ఆ రియాలిటీ షోలో జరిగేది ఏదీ వాస్తవం కాదని, అంతా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని ఆరోపించాడు. హౌస్ మేట్స్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నిర్వాహకులే డిసైడ్ చేస్తారని తెలిపారు.


Click it and Unblock the Notifications











