బిగ్‌బాస్ సీజన్ 3 ప్రోమో రిలీజ్.. హోస్ట్‌పై అనుమానాలకు తెర.. సెలబ్రిటీల జాబితా ఇదే..

Recommended Video

Bigg Boss Tamil 3 Getting Ready For Broadcast,Promo Released || Filmibeat Telugu

దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షోలకు రంగం సిద్ధమవుతున్నది. తెలుగు, తమిళ భాషల్లో రియాలిటీ షోల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా తమిళ బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. పలు అనుమానాలకు చెల్లు చీటి రాసింది. హోస్ట్ ఎవరు అనే సందేహానికి తెర దించింది. కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ రియాలిటీ షో ప్రారంభం కాబోతున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మూడో సీజన్‌లో పాల్గొనే సెలబ్రిటీల జాబితా వైరల్‌ అవుతున్నది. ఆ జాబితాలో ఎవరెవరూ ఉన్నారంటే..

 వరుసగా మూడోసారి హోస్ట్‌గా

వరుసగా మూడోసారి హోస్ట్‌గా

తమిళ బిగ్‌బాస్ సీజన్ 3కి కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తారా? లేదా అనే సందేహంగా ఉండేది. కానీ తాజా ప్రోమో చూసిన తర్వాత అన్ని అనుమానాలు తొలగిపోయాయి. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే కమల్ హాసన్ బిగ్‌బాస్ హోస్ట్‌‌గా షూటింగులకు హాజరవుతారని సమాచారం. ఈ మేరకు కమల్ తన వ్యక్తిగత పనులను పూర్తి చేసుకొనే పనిలో ఉన్నట్టు సమాచారం.

 సెలబ్రిటీల జాబితా ఇదేనంటూ

సెలబ్రిటీల జాబితా ఇదేనంటూ

కాగా, తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొనే వారిలో ప్రియా ఆనంద్, ప్రేమ్ జీ, వీజే సింధూ, రాధారవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చాందినీ తమిళరాసన్, సుధా చంద్రన్, లైలా మెహదీన్, సాక్షి అగర్వాల్ లాంటి వాళ్లు ఇప్పటికే ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే త్వరలోనే సెలబ్రిటీల జాబితాను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించనున్నారు.

మొదటి, రెండో సీజన్‌లో

బిగ్‌బాస్ తమిళ తొలి సీజన్‌లో మొత్తం 19 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉన్నాయి. ఇక రెండో సీజన్ 17 మంది పాల్గొనగా, అందులో ఇక్క వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా సెలబ్రిటీ ఇంట్లోకి ప్రవేశించారు. తొలి సీజన్ విజేతగా ఆరవ్, రెండో సీజన్ రిత్విక విజేతలుగా నిలిచారు. ఈ షోను స్టార్ విజయ్ ప్రసారం చేయనున్నది.

దేవర్ మగన్ సీక్వెల్‌కు కమల్ శ్రీకారం

దేవర్ మగన్ సీక్వెల్‌కు కమల్ శ్రీకారం

ఇదిలా ఉండగా, ఎన్నికల ఫలితాల తర్వాత తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన క్షత్రియ పుత్రుడు సినిమాకు సీక్వెల్‌గా సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో కమల్ ఉన్నట్టు సమాచారం. క్షత్రియ పుత్రుడు సినిమా తమిళ భాషలో దేవర్ మగన్ పేరుతో 1992లో రిలీజైంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, శివాజీ గణేషన్, రేవతి, గౌతమి, నాజర్ తదితరులు నటించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందించిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X