బిగ్ బాస్ 2 కి మరింత ఊపు.. ఎంట్రీ ఇవ్వబోతున్న లోక నాయకుడు.. నానితో కలసి!
Recommended Video

తెలుగు బిగ్ బాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోకు మరింత ఊపు వచ్చేలా అరుదైన సంఘటన చేటు చేసుకోబోతోంది. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో సినిమా ప్రచారాలు చోటు చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కాబోతున్న సినిమాల నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసినదే. విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించనుండడం విశేషం.

కమల్‌తో నాని
తాజాగా నేచురల్ స్టార్ నాని, కమల్ హాసన్ కలసిన ఫోటో వైరల్ గా మారింది. కమల్ హాసన్ తెలుగు బిగ్ బాస్ లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. బిగ్ బాస్ హౌస్ లో కమల్ హాసన్ సందడి ఎలా ఉంటుందనేని మాత్రం సస్పెన్స్.

విశ్వరూపం 2
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం ఆగష్టు 10 న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా కమల్ హాసన్ బిగ్ బాస్ 2 లో పాల్గొననున్నారు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో విశ్వరూపం 2 రాబోతోంది.

తమిళ బిగ్ బాస్
తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తెలుగు నాని హోస్ట్. వీరిద్దరూ కలసి సందడి చేస్తే ఎలా ఉంటుందో త్వరలోనే చూడబోతున్నాం. విశ్వరూపం మొదటి భాగం మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా విశ్వరూపం 2 ఉంటుంది.

దుమ్మురేపిన ట్రైలర్స్
భారీ యాక్షన్ అంశాలతో విశ్వరూపం 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది పూజ కుమార్, ఆండ్రియా ఈ చిత్రంలో నటించారు. కమల్ హాసన్ స్వీయదర్శకత్వంలో ఏ చిత్రం రూపు దిద్దుకుంది. విశ్వరూపం ట్రైలర్స్ కు విశేషమైన స్పందన లభించింది.


Click it and Unblock the Notifications