రూ.50 లక్షలు గెలుచుకున్న కమల్ హాసన్
చెన్నై: ఓ టీవీ కార్యక్రమంలో కమల్ హాసన్... రూ.50 లక్షల బహుమతిని గెలుచుకున్నారు. ఆ గెలుచుకున్న మొత్తం మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు విశ్వనటుడు కమల్ హాసన్ అందించారు. ఎవియం స్టూడియోలో దీనికి సంభందించిన ఎపిసోడ్ షూటింగ్ జరిగింది.
వివరాల్లోకి వెళితే... విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యాతగా 'నీంగలుం వెల్లలామ్ ఒరికోడి' పేరిట ఓ ప్రైవేటు ఛానెల్‌లో కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమంలో అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన వారు రూ.కోటి గెల్చుకునే అవకాశం ఉండటం ఇందులోని ప్రధానాంశం. నటి గౌతమితో కలిసి కమల్‌హాసన్ ఇటీవల ఈ షోలో పాల్గొన్నారు. వారు పలు ప్రశ్నలకు జవాబులు చెప్పి రూ.50 లక్షలు గెలుచుకున్నారు. తర్వాత ఆ మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సంక్షమానికి కృషి చేస్తున్న 'పెట్రాల్‌దాన్ పిల్లయా' స్వచ్ఛంద సంస్థకు ఇవ్వాలని ప్రకాష్‌రాజ్‌కు తిరిగి అందజేశారు.
ప్రస్తుతం కమల్ 'విశ్వరూపం' సీక్వెల్ లో బిజీగా ఉన్నారు. 'విశ్వరూపం' లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.


Click it and Unblock the Notifications











