Brahmamudi September 28th:కిడ్నాపర్ దగ్గరకు పంతులుగా కనకం..ఇక స్వప్న సేఫ్..బయటపడనున్న రాహుల్, రుద్రాణి స్కెచ్!
బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ ను కొట్టి స్వప్నను ఎత్తుకెళ్తారు. ఇక రాహుల్ ఆసుపత్రిలో ఉండగా కావ్యతో పాటు కుటుంబ సభ్యులు వస్తారు. ఇక రాహుల్ ను కావ్య.. ప్రశ్నలతో చమటలు పట్టిస్తుంది. మరోవైపు కిడ్నాపర్ కనకం కంట పడుతాడు. మరి కనకం ఆ కిడ్నాపర్ భారీ నుంచి స్వప్నను కనిపెడుతుందా.. స్వప్న బయటపడుతుందా అని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావ్య వేసిన ప్రశ్నలకు రాహుల్ యాక్టింగ్ మొదలు పెడుతాడు. ఇక పేషంట్ కంగారు పెట్టొద్దు అంటూ డాక్టర్స్ చెబుతారు. మరోవైపు కిడ్నాపర్.. స్వప్నను పెళ్లి చేసుకుందామని.. పూల దండలకోసం షాప్ కు వెళ్తాడు. అక్కడ కనకం కనిపిస్తుంది. పూల దంటలు సెలెక్ట్ చేయమని చెప్తాడు. కనకానికి, కిడ్నాపర్ మైఖేల్ కు కాస్త వాగ్వాదం జరుగుతుంది. చివరకు స్వప్న ఫోటోను కనకంకు చూపిస్తాడు. అది చూసి కనకం షాక్ అవుతుంది. తర్వాత మైఖేల్ తన గ్యాంగ్‍తో వెళ్లిపోతాడు.

ఇక ఆసుపత్రిలో కావ్య, రాజ్, సుభాష్‍తో పోలీసులు మాట్లాడుతుంటారు. రాహుల్ చెప్పినదాన్ని బట్టి చూస్తే వాళ్లు పక్కాగా ప్లాన్ చేసినట్లున్నారు. ఎవరిమీద అయినా అనుమానం ఉందా. ఎందుకంటే.. మొన్న విగ్రహాల దొంగతనం జరిగింది. ఇవాళ ఇది. ఇలా వెనువెంటనే జరగడం సాధారణ విషయం కాదు అని పోలీస్ సతీష్ అంటాడు.
విగ్రహాలను డబ్బు కోసం చేయలేదు. కావాలనే చేసినట్లు ఉన్నారు అని పోలీస్ అంటే.. వీళ్లు అటు ఇటు తిరిగి రాహుల్ దగ్గరికే వచ్చేటట్లు ఉన్నారు అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. కిడ్నాప్ జరిగిన ప్లేసులో క్లూస్ ఏమైనా దొరకచ్చు అని రాజ్ అంటే.. మా టీమ్ అదే పనిలో ఉంది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడ ఓ చోట తప్పు చేస్తాడు అని పోలీస్ అని వెళ్లిపోతాడు. స్వప్నకు ఏమైనా జరిగిందేమో అని రుద్రాణి అంటుంది. దీంతో కావ్య ఏడుస్తూ పక్కకు వెళ్లిపోతుంది.
ఏడుస్తున్న కావ్యను రాజ్ ఓదార్చుతాడు. ఇంతలో కావ్యకు కనకం కాల్ చేస్తుంది. ముందు అమ్మకు నిజం చెప్పలేను అని కావ్య అంటే.. రాజ్ చెప్పమని చెబుతాడు. కావ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. అసలు స్వప్న వాళ్లు ఎక్కడున్నారే అని కనకం అడుగుతుంది. దీంతో కావ్య ఏడుస్తుంది. దానికి రాజ్ ఫోన్ తీసుకుని స్వప్న కిడ్నాప్ అయినట్లు చెబుతాడు. దీంతో కనకం షాక్ అవుతుంది. కాల్ కట్ చేసి.. అంటే వాడు చెప్పింది నిజమే అన్నమాట అని చెప్పిన అడ్రస్ గుర్తు చేసుకుంటుంది కనకం.
పూజారి అడ్రస్ దగ్గర ఆగిన మైఖేల్ గ్యాంగ్ పూజారి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటారు. ఇంతలో అక్కడ పూజారి గెటప్‍లో కనకం దర్శనం ఇస్తుంది. తర్వాతి ఎపిసోడ్‍లో కావ్యకు ఓ ఫోన్ నుంచి లొకేషన్ వస్తుంది. అంతేకాకుండా వీడియో కాల్ చేసి మైఖేల్, స్వప్నలను చూపిస్తుంది కనకం. దీంతో షాక్ అవుతారు రాజ్ అండ్ కావ్య. చూస్తుంటే స్వప్నను ఇదివరకు లాగానే కావ్య, రాజ్ కాపాడతారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











