Brahmamudi December 23rd: పెళ్లిలో ఊహించని మలుపు.. ఒక్క గూటికి చేరిన విలన్స్!
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో అప్పు కావాలనే కల్యాణ్ చుట్టూ తిరగుతుందని అనామిక తల్లిదండ్రులు భావిస్తారు. అప్పును నానా మాటలు అంటుంటే.. కనకం వచ్చి... మా అప్పును తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్తుంది. ఇంకెలా అర్థం చేసుకోమంటారని అనామిక పేరంట్స్ ఫైర్ అవుతారు. చీప్ ట్రిక్స్ వాడి ఈ ఇంటికి మీ కూతుళ్లను కోడలిగా చేశారని అంటారు. ఇప్పుడు అప్పును కూడా అలాగే చేయాలనుకుంటున్నారని అనామిక తండ్రి అంటాడు. దాంతో అనామిక తండ్రి పీక పట్టుకుని చంపేస్తా అని అప్పు అంటుంది.
వదిలేయమని కృష్ణమూర్తి, కనకం చెప్పినా వినదు అప్పు. మా అమ్మను అంటావ్రా.... అమ్మను అన్నాకా వాడు ఎవడైతే ఏంటీ... వీన్ని చంపి ఇక్కడే బొంద పెడతాను అంటూ అప్పు రెచ్చిపోతుంది. దాంతో అప్పును బలవంతంగా లాగి అప్పుపై చేయి చేసుకోబోతాడు కృష్ణమూర్తి. దాంతో అప్పు షాక్ అవుతుంది. చిన్నా పెద్ద తేడా లేదు అని అప్పుని మందలిస్తాడు కృష్ణమూర్తి. మా అప్పుకి ధైర్యం ఎక్కువే. కానీ ఒక అమ్మాయి జీవితాన్న నాశనం చేసే చెడుబుద్ధి లేదని కనకం వారికి చెప్పి వెళ్లిపోతుంది.

వాళ్లను అలా వదిలేశారని శైలజ.. అనామిక తండ్రితో అంటుంది. ఈ పెళ్లి జరగాలి కదా. అప్పులు ఉన్నావాడు ఆవేశపడకూడదని చెప్తాడు. మరోవైపు అరుణ్ కోసం వెతికిన కావ్య, స్వప్నకు దొరకడు. ఇదంతా నీవల్లే. నువ్ కావాలనే వాన్ని రెచ్చగొట్టేందుకు ఇలా చేశావని కావ్యపై మండిపడుతుంది స్వప్న. నేను అలా ఎందుకు చేస్తానే అని కావ్య అంటుంటే.. నేను మీకు సహాయం చేస్తాను అని పద్మావతి వస్తుంది. నీకు ఏ సహాయం కావాలని కావ్య అడుగుతుంది. మీ మాటలు విన్నాను. నీకు నేను సహాయం చేస్తానని కావ్య చెబుతుంది.
ఆ మురళి అసలు రంగు బయటపెట్టాలని పద్మావతి అంటుంది. ఇద్దరు కలిసి స్వప్నకు హెల్ప్ చేస్తామంటారు. మరోవైపు స్వప్న ఒక్కదానికే కనిపించి తప్పించుకుని వచ్చాని అబద్ధం చెబుతాడు అరుణ్. నేను చెప్పినప్పుడు వచ్చి స్వప్న కడుపులో బిడ్డకు తండ్రినని చెప్పాలని రుద్రాణి అంటుంది. అదంతా విన్న మురళి వచ్చి మీ ప్లాన్ సూపర్. మీకు నేను సహాయం చేస్తాను వారితో కలిసిపోతాడు. నేను చేసుకుందామనుకున్న పద్మావతిని ఆ విక్రమ్ చేసుకున్నాడు. ఈ పెళ్లి అయ్యేలోపు వాళ్లిద్దరిని విడగొట్టాలి అని మురళి అంటాడు. ఇలా అటువైపు పద్మావతి కావ్య ఒకటి అయితే.. విలన్స్ అయిన రుద్రాణి, రాహుల్, మురళి ఒక్కటయ్యారు.
అనంతరం తనకు అక్క ఉండటం అదృష్టం అని, తన వల్లే ఇలా ఉన్నానని విక్రమాదిత్య అందరికీ చెబుతాడు. తర్వాత వచ్చిన పద్మావతిపై ప్రేమ చూపించమని విక్రమ్ ను కావ్య అంటుంది. నన్ను ఇలా ఇరికించేందేంటి అని పద్దు మనసులో అనుకుంటుంది. కావ్యపై ఎంత ప్రేమ ఉందో చెప్పమని కావ్యను పద్మావతి అడుగుతుంది. టిట్ ఫర్ టాటా అని కావ్య అంటుంది. మరోవైపు మేకప్ గురించి కుచలకుమారి, ధాన్యలక్ష్మీ మాట్లాడుకుంటారు.
పెళ్లిలో మురళి ఓ అమ్మాయితో పులిహోర కలుపుతుంటే.. కావ్య చూసి.. అక్కడికి వెళ్తుంది. ఇక కావ్య రాగానే ఆమెను వెళ్లమని చెప్తాడు. ఇక కావ్య అరవిందను పిలిచి.. మురళి గురించి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. మురళి భయపడుతాడు. ఇక కావ్య చెప్పకుండా ...జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఇంతలో పద్మావతి మెహందీకి టైమ్ అవుతుందని చెబుతుంది. కావ్య పద్మావతిలాగే ఉంది. కాస్తా జాగ్రత్తగా ఉండాలని మురళి అనుకుంటాడు. మురళికి చుక్కలు చూపించినట్లున్నావ్ కదా అని పద్దు అంటుంది.
మరోవైపు అప్పుపై చేయి చేసుకోబోయానని కృష్ణమూర్తి బాధపడుతాడు. పెళ్లి అయ్యాక అప్పును దూరంగా ఎక్కడైనా తీసుకెళ్దామని అనుకుంటారు. కల్యాణ్ ఆనందం కోసం అని చెబితే ఒప్పుకుంటుంది. వాళ్లు కూడా పెళ్లి జరగాలనే గొడవ చేయాలేదని కనకం అంటుంది. మరోవైపు కల్యాణ్‌కు అప్పు ప్రేమ విషయం చెప్పాలని బయలుదేరుతాడు బంతి. ఆ తర్వాత పద్దుతో విక్కీ నా స్థాయికి తగ్గట్లు ఉండు అంటాడు. నాకు ఇలాగే ఉండటం తెలుసు అని పద్మవతి అంటుంది. కావాలంటే నువ్వే రెడీ చేయ్ అంటే.. విక్కీ పద్దును రెడీ చేస్తాడు.
వీళ్లలాగే కావ్య చీర మార్చుకుంటాను అంటే రాజ్ ఓకే అంటాడు. మాట మీద ఉంటారా అని కావ్య అంటే రాజ్ అవును అంటాడు. మీరు నన్ను చూడకండి. చీర కట్టుకుంటాను అని కావ్య అంటే కట్టుకో అంటాడు. అయితే కావ్య బ్యాక్ చూసి రాజ్ టెంప్ట్ అవుతాడు. ఏంటీ గుండెల్లో గంటలు మోగుతున్నాయని కంగారు పడతాడు రాజ్. అదే విషయం కావ్య అంటుంది. తట్టుకోలేక బయటకు వెళ్తానని రాజ్ అంటాడు. మాట మీద నిలబడతానని అన్నారని కావ్య అంటే.. నేను ఎంతో వీకో ఇప్పుడే తెలిసిందని.. కావ్యను వదిలించుకుని బయటకు వస్తాడు రాజ్. అక్కడ విక్రమాదిత్య ఉంటాడు. ఇద్దరి గురించి మాట్లాడుకుంటారు.
అనంతరం కావ్య, పద్దు అందంగా రెడీ అయి వస్తారు. వాళ్లను ఇద్దరూ ఫిదా అయిపోతారు. మరోవైపు బాధపడుతున్న అప్పును కనకం ఓదార్చుతుంది. మెహందీకి రమ్మంటే రాదు. నేను అమ్మాయినని కల్యాణ్ ఎప్పుడూ చూడలేదు. మీరు గుర్తు చేస్తేనే తెలుస్తుంది. కానీ వెంటనే జరిగింది గుర్తుకు వచ్చి ఏడుపు వస్తుందని అప్పు అంటే కనకం హగ్ చేసుకుని ఓదార్చుతుంది. అనుకుంటే సరిపోద్దా, నుదుటి మీద గీతలు ఉండాలే. అమ్మాయిగా కనిపిస్తే నవ్విండు. నేను రాను. మీరు వెళ్లండి అని అప్పు అంటుంది. తను ఉన్న బాధలో ఇక్కడే ఉంటే మంచిది అని కృష్ణమూర్తి అంటాడు. దాంతో ఇద్దరు మాత్రమే వెళ్లిపోతారు. మరోవైపు సుభాష్, ఆర్య, కుచలకుమారి మందు సిట్టింగ్ వేసుకుంటారు. ప్రకాశంను మందు తెచ్చావా అని అడిగితే మెడలో వేసుకుని తిరుగుతామా అని ప్రకాశం అంటాడు.


Click it and Unblock the Notifications











