Brahmamudi : మెహందీ ఫంక్షన్లో బిగ్ ట్విస్ట్... అరుణ్ గాడిని పట్టేసుకున్న కావ్య, స్వప్న, పద్దు

ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ లో మందు సిట్టింగ్ వేసేందుకు సుభాష్, నారాయణ, ఆర్య ప్లాన్ వేసుకుంటారు. ప్రకాషం మందు తెవడానికి వెళ్తాడు. కాసేపటికి వచ్చేసా అని ప్రకాశం ఎంటర్ అవుతాడు. మందు బాటిల్స్ ఎక్కడరా అని అడిగితే.. తీసుకొచ్చా, కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయా అని ప్రకాశం అంటాడు. దాంతో అంతా డిసప్పాయింట్ అవుతారు. మరోవైపు మెహందీ కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అపర్ణ అనుకుంటుంది. సుభాష్‌కు కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తుంది.

ఇక అందరూ మెహందీ ఫంక్షన్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వీళ్లను చూసి ఈ మగవాళ్లంతా ఏదో ప్లాన్ చేసినట్లున్నారు అని అపర్ణ అంటుంది. ఏమైందని ధాన్యలక్ష్మీ అంటుంది. ఒకటి ఎక్కడా పెట్టానో మర్చిపోయాను అని ప్రకాశం అంటే బుర్రనా అని ధాన్యలక్ష్మీ అంటుంది. తర్వాత అంతా వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా అని నారాయణ అంటాడు.

Kanakam Consoles Appu in December 24th 2023 Episode number 287 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

ఇంతలో ఎవరో మా పేరు తీశారని కల్యాణ్, అనామిక వస్తారు. దాంతో భార్యలకు భర్తలు మెహందీ పెట్టాలని ధాన్యలక్ష్మీ, అపర్ణ చెబుతారు. దాంతో రాజ్, విక్రమాదిత్య తప్పించుకుని వెళ్తారు. రాజ్‌ను పద్దు, విక్కీని కావ్య పిలిచేందుకు వెళ్దామని ప్లాన్ వేసుకుంటారు. మొహమాటంతో అయినా వస్తారని అనుకుంటారు. అనామికకు మెహందీ పెడతాడు కల్యాణ్. ఇంతలో అప్పు ఎక్కడా అని గుర్తు చేసుకుంటాడు కల్యాణ్. అప్పు గదిలో పడుకుందని కనకం చెబుతుంది.

మొదటి నుంచి తను ఉండాలి అని అప్పుకు కాల్ చేస్తాడు కల్యాణ్. తలనొప్పిగా ఉంది. రాలేను అని అప్పు చెప్తుంది. నువ్ రాకుంటే మెహందీ ఫంక్షన ఆగిపోతుంది అని కల్యాణ్ అంటాడు. తను తోడి పెళ్లుకొడుకు కదా. మెహందికి ఉండాలిగా అనామిక అని కల్యాణ్ అంటాడు. అదంతా చూసి కుచలకుమారి, నారాయణ అదోలా చూస్తారు. రాజ్‌ను పిలవడానికి పద్మావతి వెళ్తుంది.

రాజ్ ఫోన్ వచ్చినట్లు యాక్ట్ చేస్తాడు. ఎట్టకేలకు పద్మావతి.. రాజ్ ను మెహందీ ఫంక్షన్ కు తీసుకువస్తుంది. మరోవైపు విక్కీని కూడా కావ్య మాయ చేసి పట్టుకువస్తుంది. సుభాష్, ఆర్య, ప్రకాష్, నారాయణ తమ భార్యలకు పేపర్‌తో మెహందీ వేసి తప్పించుకుంటారు. రాజ్, విక్రమాదిత్య వస్తారు. మీకు మీ భార్యలపై ఎంత ప్రేమ ఉందో తెలిసేలా మెహందీ వేయమని చెబుతుంది ఇందిరాదేవి. ఇంతలో అప్పు వస్తుంది. అది చూసి అనామికతోపాటు ఆమె తల్లిదండ్రులు కోపంగా చూస్తారు. అసలే అప్పు అంటే పడట్లేదు. కల్యాణ్ పదే పదే పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో అని కంగారుగా ఉందని కనకం అంటుంది.

Kanakam Consoles Appu in December 24th 2023 Episode number 287 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail
మరోవైపు ఇప్పుడే అరుణ్‌ను పిలిచి గొడవ చేయమని చెప్పండని మురళి అంటాడు. దాంతో అరుణ్‌కు కాల్ చేసి కేవలం నేను చెప్పింది మాత్రమే చేయు. సొంత తెలివి వాడకు అని రాహుల్ చెప్తాడు. దానికి సరే అంటాడు అరుణ్. ఇలా పట్టుకున్న చేతిని విడకండి సారు.. మీతో ఇలా ఎన్ని జన్మలు అయినా ఉండిపోతాను అని పద్దు అంటుంది. మీరు నాకు చూపించే కోపంలో ప్రేమ ఉందని అర్థమైంది. అది తొందర్లోనే బయటకు తీస్తాను అని కావ్య అంటుంది. ఇక ఇంతలో దూరంగా ఉన్న అప్పుని పిలిచి మెహందీ పెడతానంటాడు కల్యాణ్. అప్పు, కనకం వద్దని చెబుతారు.

నా ప్రతీ సంతోషంలో అప్పు ఉంది. మెహందీలో లేకుంటే ఎలా అని కల్యాణ్ అంటాడు. ఇందిరాదేవి పర్లేదని చెప్పడంతో అప్పు వెళ్తుంది. అప్పుకు కల్యాణ్ మెహందీ పెడతాడు. దాంతో అనామిక బాధపడుతుంది. అప్పు ఇబ్బందిపడుతుంది. అనామిక తల్లిదండ్రులు కోప్పడతారు. పద్దు అనుమానంగా చూస్తుంది. ఇదంతా నాటకీయంగా బాగా చూపిస్తారు. తన భర్తకు కాల్ చేయమని రుద్రాణికి చెబుతుంది ధాన్యలక్ష్మీ. కానీ, ఫోన్ కలవదు.

రాహుల్‌ను చేయమంటుంది. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుందని రాహుల్ చెబుతాడు. మెహందీ వేసుకోవాలి బ్రో బాగుంటుంది. అనామిక చూసి స్టన్ అవ్వాలని కల్యాణ్ అంటాడు. ఇంతోలో అరుణ్ రావడం చూసి షాక్ అవుతుంది స్వప్న. పద్దుకు, కావ్యకు చెబుతుంది. వాళ్లు కూడా షాక్ అయి ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటారు. ఇంతలో అరుణఅ కనిపించడు. అలా కనిపించకపోయేసరికి కావ్య, స్వప్న, పద్దు షాక్ అవుతారు.

మెహందీ అయిపోయిందని చెబుతారు. బాగుందని అంతా అనుకుంటారు. ఇప్పుడే వస్తామని అరుణ్‌ను వెతికేందుకు వెళ్తారు కావ్య, స్వప్న, పద్దు. నీకంటే అప్పు మెహందే బాగా వచ్చిందని కల్యాణ్ అంటాడు. దాంతో కోపంతో అనామిక వెళ్లిపోతుంది. అలా చేస్తావంటే, నేను నీ ఫ్రెండ్‌ను. కానీ అనామిక నీకు కాబోయే భార్య. తనదే బాగుందని చెప్పాలి కదా అని అప్పు అంటుంది. నేను చూసుకుంటా అని చెప్తాడు కల్యాణ్.

ఇక మరోవైపు అరుణ్‌ను ఓ తాగుబోతు పక్కకు తీసుకొచ్చి కొడతాడు. అగ్గిపెట్టే అడిగితే లేదంటవా అని కొడతాడు. ఇంతలో కావ్య, పద్దు, స్వప్న వస్తారు. దాంతో షాక్ అవుతాడు అరుణ్. అరుణ్‌ను పట్టుకునేందుకు పద్దు, కావ్య, స్వప్న ట్రై చేస్తారు. కానీ, వాళ్లను వదిలించుకుని పారిపోయేందుకు అరుణ్ ట్రై చేస్తాడు. ఇంతలో అరుణ్ తలపై కర్రతో గట్టిగా కొడుతుంది కనకం. కనకం ఇచ్చిన సూపర్ ట్విస్ట్ చూసి అంతా షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X