Brahmamudi December 26th: ప్రేమను బయటపెట్టిన విక్రమ్, కావ్య.. అరుణ్ పని ఔట్.. నెక్ట్స మురళిపై టార్గెట్!

స్టార్ మాలో ప్రసారం అయ్యే 'బ్రహ్మముడి' సీరియల్, 'నువ్వు నేను ప్రేమ సీరియల్‌'ల మెగా ఎపిసోడ్ నడుస్తోంది. కల్యాణ్, అనామిక పెళ్లి సందర్భంగా ఇరు సీరియల్‌ ల నటులు కలిసి సందడి సందడి చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణ్, అనామిక హల్దీ ఫంక్షన్, మెహందీ పంక్షన్‌లు ముగిశాయి. తాజా ఎపిసోడ్ లో కీలక పరిణామాలు జరిగాయి. ఆ వివరాల్లోకి వెళితే...

అనామిక, కల్యాణ్ పెళ్లి వేడుక‌లో అరుణ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో రుద్రాణి, రాహుల్ ఏమైందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. కావ్య‌కు దొరికిపోయాడ‌ని భ‌య‌ప‌డ‌తారు. అరుణ్‌ కు రాహుల్‌ ఫోన్ చేస్తాడు. ఎవరు ఫోన్ చేశారో చూసే లోపే ఫోన్ స్విఛాఫ్ అవుతుంది. ప‌ద్మావ‌తి చేసిన సాయానికి ఆమె ప్ర‌తిసాయం చేయాల‌ని స్వ‌ప్న‌, కావ్య ఫిక్స‌వుతారు. ఇదే పెళ్లి వేడుక‌లో ముర‌ళి నిజ స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టి విక్ర‌మాదిత్య‌, ప‌ద్మావ‌తిల‌ను ఒక్క‌టి చేయాల‌నుకుంటారు.

Kanakam Consoles Appu in December 26th 2023 Episode number 288 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

మరోవైపు అప్పుతో క‌ళ్యాణ్ క్లోజ్‌గా ఉండ‌టం అనామిక భరించలేకపోతుంది. క‌ళ్యాణ్‌ పై అలిగుతుంది. అనామిక‌ను చాలా సేపు బ‌తిమిలాడుతాడు క‌ళ్యాణ్. చివ‌ర‌కు అప్పు చేతికి వేసిన మెహందీని ఎందుకు పొగిడావ‌ని క‌ళ్యాణ్‌ ను నిల‌దీస్తుంది అప్పు. అనామికకు క‌ళ్యాణ్ సారీ చెబుతాడు. మరోవైపు విక్ర‌మ్‌ ను తీసుకొని రిసార్ట్‌లో ఉన్న బార్‌ కు వ‌స్తాడు రాజ్‌. ప‌ద్మావ‌తితో నీ పెళ్లి ఎప్పుడు, ఎలా జ‌రిగిందో చెప్ప‌మ‌ని అడుగుతాడు. అదొక ట్రాజెడీ అంటూ రాజ్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా ఉండిపోతాడు విక్ర‌మాదిత్య‌.

పెళ్లి గురించి కాకుండా మ‌రో టాపిక్ మాట్లాడుకుందామ‌ని అంటాడు విక్రమ్. వారు తాగాల్సిన గ్లాస్‌లు మారిపోవ‌డంతో మాక్‌టెయిల్ బ‌దులూ మందు తాగుతారు. మ‌త్తులో మునిగిపోతారు. రాజ్‌, విక్ర‌మ్ క‌నిపించ‌క‌పోవ‌డంతో కావ్య‌, ప‌ద్మావ‌తి వారి కోసం వెతుకుంటారు. తాగిన మ‌త్తులో ప‌ద్మావ‌తిని ప్రాణంగా ప్రేమించిన‌ట్లు మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెడ‌తాడు విక్ర‌మ్. త‌న‌ది మంచి మ‌న‌సు అని చెబుతాడు. ప‌ద్మావ‌తిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాన‌ని అంటాడు. కానీ ప‌ద్మావ‌తి త‌న‌ను మోసం చేసింద‌ని రాజ్‌కు చెబుతూ విక్ర‌మ్ ఎమోష‌న‌ల్ అవుతాడు.

Kanakam Consoles Appu in December 26th 2023 Episode number 288 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

మ‌రోవైపు చేయ‌ని త‌ప్పుకు భ‌ర్త ముందు తాను అప‌రాధిగా మారిన‌ట్లు కావ్య‌తో అంటుంది ప‌ద్మావ‌తి. ఆ త‌ర్వాత త‌న పెళ్లి గురించి విక్ర‌మ్‌కు చెబుతాడు రాజ్‌. కావ్య‌కు త‌న‌పై ఉన్న‌ది ప్రేమో, కాదో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్నాన‌ని అంటాడు. కావ్య మంచిద‌ని చెబుతాడు. ఎవ‌రి మ‌న‌సును క‌ష్ట‌పెట్ట‌ద‌ని చెప్పుకువస్తాడు. మ‌రోవైపు రాజ్‌ను తాను చాలా ప్రేమిస్తున్న‌ట్లు ప‌ద్మావ‌తితో చెబుతుంది కావ్య‌. త‌న ప్రేమ‌ను న‌ట‌న అని రాజ్ భ్ర‌మ‌ప‌డుతున్నాడ‌ని బాధ ప‌డుతుంది.

ఇక అరుణ్ మిస్స‌వ‌డంతో రాహుల్‌, రుద్రాణి టెన్ష‌న్ ప‌డ‌తారు. అరుణ్ రిసార్ట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేద‌ని, లోప‌లే ఎక్క‌డు ఉన్నాడ‌ని తెలియ‌డంతో వారి భ‌యం మ‌రింత పెరుగుతుంది.రిసార్ట్‌లో ఎంత వెతికినా అత‌డి జాడ వారికి క‌నిపించ‌దు. రాజ్‌, విక్ర‌మ్ తెచ్చిన కాక్‌టెయిల్‌ను పొర‌పాటుగా ప‌ద్మావ‌తి, కావ్య తాగుతారు. వారు కూడా మ‌త్తులో తూలిపోతారు.

Kanakam Consoles Appu in December 26th 2023 Episode number 288 in Brahmamudi Telugu Serial Nuvvu Nenu Prema Serail

తాగిన మ‌త్తులో నీ మ‌న‌సు నా ద‌గ్గ‌ర భ‌ద్రంగా ఉంద‌ని, ఆ మ‌న‌సును ఎవ‌రైన ట‌చ్ చేయాల‌ని చూస్తే చంపేస్తాన‌ని కావ్య అంటుంది. మీరంటే నాకు చాలా ఇష్ట‌మ‌ని అంటుంది. తాగిన మ‌త్తులో రాజ్ ప‌ట్ల త‌న మ‌న‌సులో ఉన్న ఇష్టం మొత్తం చెప్పేస్తుంది కావ్య‌. విక్ర‌మ్ కూడా ప‌ద్మావ‌తి అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో చెబుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X