Brahmamudi December 27th: పెళ్లిలో ఊహించని షాకిచ్చిన అప్పు... అందరి ముందు కళ్యాణ్‌ను హగ్ చేసుకుందిగా!
ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో ఫుల్లుగా తాగి పడుకున్న రాజ్, కావ్య.. తర్వాతి రోజు ఉదయం లేవగానే కావ్య తన గుండెలపై పడుకోవడం చూసి రాజ్ కంగారు పడతాడు. ఏమైంది, నువ్వు నా గుండెలపై ఎందుకు పడుకున్నావని నిలదీస్తాడు. రాత్రి మీలోని రొమాంటిక్ ఫెల్లో బయటకు వచ్చాడని కావ్య సిగ్గుపడుతుంది. రాత్రి జరగాల్సిందే జరిగింది అంటూ.. రాజ్‌ను ఆటపట్టిస్తుంది. చేయాల్సింది అంతా చేసి ఏం తెలియని చంటి పిల్లాడిలా యాక్ట్ చేస్తున్నవ్ అంటూ కావ్య అంటుంది.
అసలు ఏం జరిగిందో చెప్పమని కావ్యను అడుగుతాడు రాజ్. మూడు నెలలు ఆగితే తాను నెల తప్పుతానని.. అప్పుడు ఏం జరిగిందనేదానిపై క్లారిటీ వస్తుందని కావ్య చెప్పి వెళ్లిపోతుంది. కావ్య వెళ్లిపోగానే కర్మ అంటూ తలపట్టుకొని అక్కడే కూలబడిపోతాడు. అరుణ్‌ను కావ్య, స్వప్న కలిసి ఓ రూమ్‌లో బంధించగా... ఆకలితో అతడు బాధపడుతున్నాడని తెలిసి ఇడ్లీ తీసుకొస్తుంది కనకం. శత్రువునైనా నా ప్రాణం గురించి కూడా మీరు పట్టించుకున్నారంటే గ్రేట్ ఆంటీ అంటాడు అరుణ్.

సింపతితో అరుణ్‌ను బోల్తా కొట్టించి అతడి ద్వారా నిజాలు మొత్తం బయటపెట్టించాలని కనకం అనుకుంటుంది. కానీ ఇలాంటి డ్రామాలకు తాను కరిగిపోయి నిజాలు చెప్పనని అరుణ్ అంటాడు. ఫ్రెండ్‌షిప్ పేరుతో స్వప్న తనను బకారాను చేసిందని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న...అరుణ్ మాటలతో ఫైర్ అయి... చెంపలు వాయిస్తుంది. కనకం అడ్డుకుని నీపై పడిన నిందలు తొలగిపోవాలంటే అరుణ్ బతికి ఉండాలని చెప్తుంది. పెళ్లి తర్వాత అరుణ్‌ను దుగ్గిరాల ఫ్యామిలీకి అప్పగిద్దామని చెప్తుంది.
మరోవైపు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి మట్టిగాజులు తెప్పిస్తుంది ఇందిరాదేవి. మట్టి గాజులు వేసుకోవడానికి అందరూ నిరాకరిస్తారు. మట్టి గాజులు బంధాలను గుర్తుకుతెస్తాయని ఇందిరాదేవి వాటి ఔన్నత్యం వివరిస్తుంది. గాజుల సంప్రదాయం నా పెళ్లిలో ఎందుకు చేయలేదని స్వప్న అంటుంది. కళ్యాణ్, అనామిక పెళ్లిలా నీది పద్దతిగా జరగలేదని కోడలిపై సెటైర్స్ వేస్తుంది రుద్రాణి. కళ్యాణ్‌ను రెండు కోట్లు అడగమని ఆమె తల్లిదండ్రులు చెబుతారు.
కానీ అతడిని డబ్బు అడగటానికి అనామిక సంశయిస్తుంది. డబ్బు కోసమే తనను ప్రేమించానని అతడు ఎక్కడ అపార్థం చేసుకుంటాడోనని టెన్షన్ పడుతుంది. కానీ తల్లిదండ్రులు ఆమెను బలవంతపెట్టి డబ్బులు అడగమని కళ్యాణ్ రూమ్‌కు పంపిస్తారు. కళ్యాణ్‌ను అనామిక డబ్బు అడగబోతుండగా ప్రకాషం వచ్చి డిస్ట్రబ్ చేస్తాడు. కళ్యాణ్‌ను రూమ్ నుంచి బయటకు తీసుకెళతాడు. డబ్బు ఇచ్చిన మార్వాడీ కూతురి పెళ్లి ఎక్కడ ఆపేస్తాడోనని అనామిక తండ్రి టెన్షన్ పడుతుంటాడు. మంచి టైమ్ చూసుకొని తానే కళ్యాణ్‌ను ఆ డబ్బు అడుగుతానని తండ్రికి సర్ధిచెబుతుంది అనామిక.

డబ్బుల కోసం మార్వాడీ రిసార్ట్‌కు వస్తాడు. అతడిని అనామిక తండ్రి సుబ్రహ్మణ్యం గదికి కనకం తీసుకొస్తుంది. మీకో సర్‌ప్రైజ్ అంటూ మార్వాడీని చూపిస్తుంది. అతడిని చూసి అనామిక తల్లిదండ్రులు షాకవుతారు. డబ్బులు ఇచ్చే వరకు పెళ్లి వేడుకలో మీతో పాటే ఉంటానని మార్వాడీ అంటారు. తప్పించుకోవడానికి మరోదారి లేక మార్వీడీ ప్రపోజల్‌కు ఒప్పుకుంటారు అనామిక తల్లిదండ్రులు.
అనామిక చేతులకు గాజులు తొడిగి ఆమెను ఆశీర్వదించే బాధ్యతను అన్నగా రాహుల్‌కు అప్పగిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఈ వేడుక చూసి కనకం ఎమోషనల్ అవుతుంది.
తనకు అన్నదమ్ములు ఉంటే బాగుండునని అనిపిస్తుందని అంటుంది. మేము ఉన్నానని సుభాష్ అంటాడు. సుభాష్, ప్రకాషం కలిసి ఆమె చేతికి గాజులు తొడుగుతారు. ఆ సీన్ చూసి అపర్ణ సహించలేకపోతుంది. ఇవి నాకు బంగారు గాజులతో సమానం అంటూ కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి రుద్రాణి సెటైర్ వేస్తుంది. సొంతం చెల్లెని పక్కనపెట్టి పరాయి వాళ్లకు గాజులు తొడుగుతున్నారంటూ ఫైర్ అవుతుంది. సుభాష్ సారీ చెబుతాడు. అయినా రుద్రాణి పట్టించుకోదు. ఇక్కడితో సిరియల్ ముగుస్తుంది.
ఇక తదుపరి ఎపిసోడ్ లో పెళ్లి వేడుకలో జంటలందరూ డ్యాన్సులతో ఇరగదీస్తారు. కళ్యాణ్, అనామిక డ్యాన్స్ చేస్తుంటే అప్పు ఆపుతుంది. కళ్యాణ్‌ను కౌగిలించుకుంటుంది. అది చూసి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అనామిక కూడా షాకవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.


Click it and Unblock the Notifications











