Brahmamudi November 17th: రాజ్, కావ్యలపై రుద్రాణికి డౌట్... ప్రియుడితో అడ్డంగా బుక్ అయిన స్వప్న

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (నవంబర్ 17వ తేదీ) కళ్యాణ్ ను అప్పు ప్రేమిస్తుందనే విషయం కనకంకు తెలిసిపోతుంది. అప్పును కొడుతుంది. ఇంతలో మూర్తి వచ్చి ఎందుకు కొడుతున్నావ్ అని అడుగుతాడు. అదేం లేదు అని సర్ది చెప్తుంది. మరోవైపు కావ్య... అందరికి డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తూ ఉంటుంది. స్వప్న తినడానికి వస్తుంది. ఇందిరాదేవిని చూసి... వెళ్లిపోతుంది. ఇక రుద్రాణి రా స్వప్న అంటూ ఇరికిస్తుంది. ఇక స్వప్న వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటుంది. ఇక ఇందిరాదేవి స్వప్నను తీక్షణంగా చూస్తుంది.

నా కోడలను ఏమైనా అడగాలా అంటూ రుద్రాణి అడుగుతుంది. అదేం లేదని చెప్తుంది. ఇక స్వప్న అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక రాజ్.. తన నటన ఏంటో చూపిస్తా అంటూ కళావతికి అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఇక ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. నాకు టిఫిన్ పెట్టవా అంటూ కళావతిని అడుగుతాడు. ఇక కావ్య రాజ్ కు టిఫిన్ పెడుతుంది. మరోవైపు రుద్రాణికి రాజ్, కావ్యల ఓవర్ యాక్టింగ్ మీద డౌట్ వస్తుంది.

Kanakam Consoles Appu in November 17th 2023 Episode number 256 in Brahmamudi Telugu Serial

మీరు అన్యొన్యగా ఉన్నట్లు కనిపించడం లేదు... కోపాన్ని కవర్ చేస్తూ... ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారు అనిపిస్తుంది అని రుద్రాణి అంటుంది. ఇందిరాదేవి.. భార్య భర్తలు అంటే కోపాలు, తపాలు ఉంటాయి అని అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మి కాపురం గురించి తనకేం తెలుస్తుంది అత్తయ్య అని అంటుంది. దానికి రుద్రాణి అలిగివెళ్లిపోతుంది. మరోవైపు రాజ్... టిఫిన్ తినేసి చేతులు కడుక్కోడానికి వెళ్తాడు. అక్కడ కావ్య.. నాప్ కిన్ కి బదులు చీరకొంగు ఇస్తుంది.

అది నాప్కిన్ అనుకుని చీరకొంగుతో చేతులు తుడుచుకుంటాడు. ఇక కావ్య ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇది నా చీరకొంగు అండి..అంటూ.. ఇక సుభాష్.. చిన్నప్పుడు రాజ్ వాళ్ల అమ్మ చీరకొంగుకు అలాగే తుడిచేవాడు.. ఇప్పుడు నీకు తుడుస్తు్న్నాడు అని చెప్తాడు. అంటే అత్తయ్య గారి స్థానం నాకు ఇచ్చేశారా అండి అని కావ్య రాజ్ ను ఇరికిస్తుంది. అపర్ణ కోపంతో చూస్తూ ఉంటుంది. నన్ను భలే ఇరికించావే అని కావ్యతో రాజ్ అంటాడు. అట్లుంటది మరి నాతో అంటుంది కావ్య.

మరోవైపు స్వప్న.. ఆ అరుణ్ కు కాల్స్ చేస్తూనే ఉంటుంది. అతను లిఫ్ట్ చేయడు. రాహుల్ కి కాల్ చేసి... స్వప్న గురించి చెప్తాడు. నేను చెప్పే వరకు లిఫ్ట్ చేయకు అని రాహుల్ అంటాడు. ఇక ఇందిరాదేవి రావడం చూసి..యాక్టింగ్ మొదలుపెట్టు అని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. ఇక రాహుల్ ఓ ఫోటో పట్టుకుని చూస్తూ ఉంటాడు. బాధపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. చివరకు ఆ ఫోటోను నలిపి కిందపడేసి పోతాడు. అందులో ఏం ఉందో అని ఇందిరాదేవి వెళ్లి చూస్తుంది.

అందులో స్వప్న, అరుణ్ కలిసి ఉంటారు. అది చూసి షాక్ అవుతుంది. రాహుల్ కు కూడా ముందే తెలుసా అని అనుకుంటుంది ఇందిరాదేవి. వెంటనే రాజ్ కు చెప్పి అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంటుంది ఇందిరాదేవి. మరోవైపు కనకం అప్పును కొట్టినది గుర్తు తెచ్చుకుని బాధ పడుతుంది. అప్పు దగ్గరకు వెళ్లి ఓదార్చుతుంది. అప్పు కూడా మనసులోని మాటను బయటపెడుతుంది. తెలియకుండానే కళ్యాణ్ ను ప్రేమించేశాను అని చెప్తుంది.

గదిలో కావ్య ఏదో బుక్ చదువుతూ కూర్చుంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. రాజ్ ను రెచ్చగోట్టేలా కావ్య రొమాంటిక్ గా బుక్ లో స్టోరీ చదివినట్లు చేస్తుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో స్వప్నకు అరుణ్ కాల్ చేస్తాడు. మీ ఇంటి దగ్గరే ఉన్నాడు విషయం చెప్పి వెళ్తాను కిందకి రా అంటాడు. స్వప్న వెళ్తుంది. ఇక రాజ్, కావ్య వారిని చూస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X