Brahmamudi December 4th: అరుణ్‌ ఇంటికెళ్లి చితకొట్టిన కావ్య, రాజ్‌... స్వప్నను ఇంటికి తీసుకెళ్తానన్న కనకం

ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో (నవంబర్ 4వ తేదీ) స్వప్న కోసం స్వీట్లు తయారు చేసుకుని కనకం బయలుదేరుతుంటే మూర్తి వచ్చి వద్దంటాడు. తన అవసరం అనుకుంటే కన్నతల్లి అని కూడా చూడకుండా నిన్ను ఇబ్బందులు పెడుతుంది అని చెప్తాడు. అయినా సరే కనకం వెళ్లడానికే బయలుదేరుతుంది. అప్పును కూడా తనతో రమ్మంటే అప్పు రానని చెప్పి బయటికి వెళ్లిపోతుంది. అప్పును జాగ్రత్తగా చూసుకోమని తన అక్కకు చెప్పి బయలుదేరుతుంది. కావ్య, రాజ్‌ కారులో వచ్చి ఒక ఇంటి ముందు ఆగి దిగుతారు.

ఇదే ఆ అరుణ్‌ గాడు ఉంటున్న ఇంటి అడ్రస్‌ అని రాజ్ కు చెప్తుంది కావ్య. ఇప్పుడేంటి నేను తలుపులు బద్దలకొట్టి వాణ్ని కొట్టి, తన్ని, ఈడ్చుకుంటూ బయటకు తీసుకురావాలా? అని రాజ్ వెటకారంగా అంటాడు. అంతలేదు. ఒక్కటి ఇస్తే వాడే నిజాలన్నీ కక్కుతాడని కావ్య అంటుంది. మరోవైపు ఇంటిలోపల అరుణ్‌ వాళ్ల ప్రెండ్‌తో కూర్చుని... కొద్ది రోజులు నేను బయట తిరగకూడదు. నా ఫోన్‌ కూడా పనిచేయదు. ఇదే ఇంట్లో హౌస్‌ అరెస్ట్‌ అవుతాను. నాకు కావాల్సిన ఫుడ్‌ మొత్తం నువ్వే బయట నుంచి తీసుకురావాలి. ఈ ఇంటి మీద నిఘా ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని అరుణ్ చెప్తాడు.

Kanakam is Unhappy in December 4th 2023 Episode number 270 in Brahmamudi Telugu Serial

ఇక అరుణ్ ఇంటికి వచ్చిన రాజ్‌ డోర్‌ తన్నగానే అరుణ్‌ ఫ్రెండ్‌ అదే టైంలో డోర్‌ తెరుస్తుంటాడు. దీంతో అరుణ్‌ ఫ్రెండ్‌ కిందపడిపోతాడు. రాజ్‌, కావ్య వాణ్ని లేపి అరుణ్‌ గురించి ఎంక్వైరీ చేస్తారు. మెడికల్‌ క్యాంపుకు వెళ్లాడని చెప్తాడు. దీంతో కావ్య కోపంగా వాణ్ని కొట్టబోతుంటే రాజ్‌ అపి తీసుకెళ్తాడు. రాహుల్‌.. అరుణ్‌కు ఫోన్‌ చేసి కొద్ది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా వెళ్లిపో అని చెప్పి నవ్వుతూ ఫోన్‌ కట్‌ చేస్తాడు.

నేను ఇంతలా టెన్షన్‌ పడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి రాహుల్‌ అని రుద్రాణి అంటుంది. ఆ కావ్య, రాజ్‌ ఇద్దరూ మళ్లీ అరుణ్‌ ఇంటికి వెళ్లారట.. అని రుద్రాణికి రాహుల్ చెప్తాడు. ఈ కావ్యను ఎంత అడ్డుకున్నా అక్కకోసం ఎంత దూరం అయినా వెళ్తుంది. అసలు నాకు తెలియక అడుగుతాను. ఆ స్వప్న వల్లే కదా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది. పైగా కడుపు లేదన్న విషయంలో అందరి ముందు ఇరికించేసింది కూడా. అయినా ఇంకా అక్క కోసం కష్టపడాలి.. అక్కను కాపాడాలి అంటుందేంటి ఈ పిచ్చిది కాకపోతే.. అని రుద్రాణి అంటుంది.

మరోవైపు కనకం అటో దిగుతుండగా చూసి..మన కలను నిజం చేయడానికి ఆ కనకమే దిగివచ్చింది. అనుకుంటూ లోపలికి వెళ్తారు. హాల్లో కూర్చున్న రుద్రాణి పక్కన స్వప్న వచ్చి కూర్చుంటుంది. పాపం చేసిన వాళ్ల పక్కన నేను కూర్చోలేను.. అని రుద్రాణి అంటుంది. నేను కూర్చుంటాను. అయినా నెల రోజులైతే డీఎన్‌ఏ టెస్టులో నిజం తెలిసిపోతుంది. అప్పటి వరకు మీకు ఉబ్బా ఆగలేకపోతుందా అని స్వప్న అంటుంది.

ఆలోపే నీకు చాన్స్‌ దొరక్క పోదా నిన్ను బయటికి గెంటేయకపోనా? అని రుద్రాణి అంటుంది. నన్ను గెంటివేయాలంటే మీ జేజమ్మ దిగిరావాలని అని స్వప్న అంటుండగానే కనకం, స్వప్నా అంటూ పిలిస్తూ ఎంట్రీ ఇస్తుంది. జేజమ్మ కాదు మీ అమ్మ కనకం చాలు శునకం లాగా నిన్ను తరిమేయడానికి అని రుద్రాణి అంటుంది. అమ్మా అప్పుడు కడుపు లేదని కొట్టావని స్వప్న అంటుంది. ఇప్పుడు నిన్ను చూడటానికి వచ్చా కదమ్మా.. అని కనకం చెప్తుంది.

వచ్చి మంచి పని చేశారు కనకం. మీ అమ్మాయిని పుట్టింటికి తీసుకెళ్లడానికేగా వచ్చావని రుద్రాణి అంటుంది. అనగానే అందరూ షాక్ అవుతారు. అప్పుడే పుట్టింటికేంటి అని కనకం ప్రశ్నించగా మీ అమ్మాయి కడుపుతో ఉంది. కానీ నా కొడుకు తండ్రి కావటం లేదు. అని జరిగిందంతా చెబుతుంది రుద్రాణి. దీంతో ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తిడతారు. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించే వరకు ఎందుకు తొందరపడుతున్నావని తిడతారు. స్వప్న పరిస్థితి చూసి కనకం బాధపడుతుంది.

అరుణ్‌ చేసిన బ్లాక్‌ మెయిల్‌ గురించి కావ్య నిజం చెప్తుంది. దీంతో కనకం ఏడుస్తూ... స్వప్నకు కోపం ఎక్కువే కానీ ఇలాంటిది కాదని స్వప్న తప్పు చేసిందంటే నేను నమ్మనని చెబుతుంది కనకం. ఇన్ని నిందలు భరిస్తూ స్వప్నను ఇక్కడ ఉంచడం కన్నా మా ఇంటికి తీసుకెళ్తానని కనకం అనడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X