Brahmamudi December 8th: స్కెచ్ వేసి మరీ అనుకున్నది సాధించిన కనకం.. కల్యాణ్, అనామిక పెళ్లి క్యాన్సిల్?

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (డిసెంబర్ 8వ తేదీ) డైనింగ్‌ టేబుల్‌ దగ్గర తినకుండా ధాన్యలక్ష్మి కూర్చుంటుంది. అది చూసిన అపర్ణ ఏమైందని అడుగుతుంది. కళ్యాణ్‌ పెళ్లి విషయంలో పంతులు గారు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నారు అని కనకం అంటుంది. అవును.. కళ్యాణ్‌ ఇష్టపడ్డాడు కదా అని ఏమీ ఆలోచించకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నానని ధాన్యలక్ష్మి అంటుంది. కానీ ఇలాంటి దోషం ఉంటే ఇంటి పెద్దకు గండం అంటున్నారు... వాళ్ల కాపురం కూడా నిలబడదు అంటున్నారు. ఇన్ని అనర్థాలు చూసే బదులు ఈ పెళ్లి ఆపేయడమే మంచిదనిపిస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది.

అవును లెండి. పెళ్లంటే నూరేళ్ల పంటలా ఉండాలి కానీ నట్టింట్లో మంటలా ఉంటే ఎలా? అని కనకం అంటుంది. అలా కనకం అనగానే కళ్యాణ్‌ లేచి వెళ్లిపోతుంటే రాజ్‌, కావ్య ఆపుతారు. ఈ పంచాంగాల మీద నాకు నమ్మకం లేదని రాజ్‌ అంటాడు. పెద్దవాళ్ల కోసం మౌనంగా ఉన్నానని చెప్తాడు. ఇక అలాగైతే నాకు మీ అన్నయ్యకు ఏం చూడకుండానే పెళ్లి చేశారని కావ్య చెప్తుంది. అయినా మేమిద్దరం ఇప్పుడు సంతోషంగా లేమా? అని అడుగుతుంది.

Kanakam Plan Success in December 8th 2023 Episode number 274 in Brahmamudi Telugu Serial

ఇక కావ్య మాట్లాడుతుంటే అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. మీరు సంతోషంగా ఉన్నారా? అని రుద్రాణి డౌట్ గా అడుగుతుంది. హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారా... ఈ మిరాకిల్‌ ఎప్పుడు జరిగిందబ్బా.. అని వెటకారం చేస్తుంది. ఏంటండి ఏం మాట్లాడరు అసలే మీ అత్తకు అనుమానాలెక్కువ అని కావ్య అంటుంది. ఆవిడ నోటి నుంచి ఒక్క మంచి మాట కూడా రాదని తెలసు కదా అని రాజ్ తో అంటుంది.

నిజం చెప్పండి మీరు నామీద చూపించే ప్రేమ, ఆపేక్ష, అనురాగం, అభిమానం, ఆత్మీయత, ఆప్యాయత, అనుకూలత ఇవన్నీ నాలుగు గోడల మధ్యే చూపిస్తుంటే నలుగురికి అనుమానం వస్తుందని నేను చెప్తుంటే మీరు పట్టించుకోలేదని కావ్య అంటుంది. ఇక కావ్య మాటలకు రాజ్‌ షాకింగ్‌ గా చూస్తుండి పోతాడు. కొద్ది రోజుల క్రితం కావ్య తాను కూడా నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీకు త్వరలోనే చూపిస్తానని చెప్పిన మాటలు రాజ్‌ గుర్తు చేసుకుని బిత్తరపోతాడు.

మొన్న రాజ్ సర్ ప్రైజ్ అని చెప్పి హనీమూన్ ప్యాకెజ్ తీసుకున్నాడు అని కావ్య చెప్తుంది. ఇక అంతకలిసి కల్యాణ్ కు నచ్చచెప్తారు. అ తర్వాత బెడ్‌ రూంలో ఉన్న కావ్య దగ్గరకు కోపంగా వస్తాడు రాజ్‌. ఏమందని కావ్య అడుగుతుంది. నిన్ను హనిమూన్‌కు తీసుకెళ్తానని నేనెప్పుడు చెప్పాను అంటూ రాజ్ అడుగుతాడు. కళ్యాణ్‌ కోసం తాతయ్య సంతోషంగా ఉండాలని ఆ మాటలు చెప్పానని కావ్య నటించాను అని చెప్తుంది. ఇక రాజ్ కూల్ అవుతాడు.

మరోవైపు గదిలో రెడీ అవుతున్న స్వప్న దగ్గరకు జూస్ తీసుకొచ్చి ఇస్తుంది కనకం. స్వప్నను రూంలోంచి బయటకు రావొద్దని చెప్పి వెళ్తుంది కనకం. మొక్కలు తీసుకుని వచ్చిన అప్పును ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండమని రిక్వెస్ట్‌ చేస్తాడు కల్యాణ్. సరే అని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. లోపల హోమం జరుగుతుంటుంది.ఈ ఇంట్లో పెళ్లి అంటే చాలు ఒక అరిష్టం మొదలవుతుందని అపర్ణ మాట్లాడుతుంది. మనింట్లో జరిగే ఆఖరి పెళ్లి వీడిదే.. ఘనంగా జరిపించాలనుకుంటే ఈ జాతక దోషం ఒకటి అడ్డు పడిందని అపర్ణ అంటుంది.

ఈ హోమం పూర్తయితే ఆ దోషమేదో పోతుంది కదా అని సుభాష్ అంటాడు. ఎక్కడండి మళ్లీ ఏదో మొక్క నాటాలంటా.. అది పచ్చగా ఉండాలంట అని అపర్ణ అంటుంది. వాడిపోతే ఈ పెళ్లి జరగదు అంటున్నారు. వాడు అనామిక మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ గండం కూడా గట్టెక్కితే చాలు కళ్యాణ్‌ కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరగాలని అపర్ణ అంటుంది.

పంతులు హోమం జరిపించి... మొక్క నాటాలని బయటికి తీసుకెళ్లి కళ్యాణ్‌, అనామికలతో మొక్క నాటిస్తాడు. మొక్క నాటిన కళ్యాణ్‌ ఇక దోషం పోయినట్లేనా అని అడుగుతాడు. లేదని మొక్క రేపు ఉదయం వరకు పచ్చగా ఉంటేనే దోషం పోయినట్లు, మొక్క కానీ వాడిపోయిందంటే మీకు ఇక జన్మలో పెళ్లి చేయకూడదని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. నువ్వేం టెన్షన్‌ పడకు అనామిక అని కల్యాణ్ అంటాడు. మన ప్రేమ నిజమే అయితే ఆ దేవుడే మన పెళ్లి చేస్తాడని కల్యాణ్ అంటాడు.

కానీ ఈ కనకం ఆ పని జరగనివ్వదు కదా బాబు అని మనసులో అనుకుంటుంది. నాకు అదే టెన్షన్‌గా ఉంది నా కొడుకు కోరుకున్నది జరగాలి దేవుడా అని ధాన్యలక్ష్మి అంటుంది. భగవంతుడు అనుకున్నదే జరుగుతుంది వదిన గారు అని కనకం అంటుంది. ఆ నోటికి మంచి మాటలు రావా అని రుద్రాణి అంటుంది. మీతోనే ఉంటున్నాను కదా సావాస దోషం అంటుకున్నట్లుందని కనకం అంటుంది.ఇక అందరూ పదండి లోపలికి వెళ్దాం అంటూ వెళ్తారు. కనకం నిమ్మ మొక్కను పరిశీలనగా చూస్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో రాజ్, కావ్య.. కల్యాణ్ ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు నా మనసులో నీకు తప్పు వెరొకరికి స్థానం లేదని అనామిక కల్యాణ్ తో అంటుంది. నీతో పెళ్లి జరక్కపోతే నా చావును చూస్తావ్ అంటుంది. ఇక మరుసటి రోజు కనకం నిమ్మ మొక్కను తీసి వాడిపోయిన మొక్కను పెడుతుంది. ఇక తెల్లారి అది చూసిన అందరూ షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X