Brahmamudi December 9th: అనామిక పేరెంట్స్ కన్నింగ్ ప్లాన్... మొక్కను బతికించిందెవరు?

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో (డిసెంబర్ 9వ తేదీ) ఒక్కగానొక్క కొడుకు పెళ్లి ఇలా అయిపోయిందని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. ఇక్కడ అందరికీ ఒక్కగానొక్క కొడుకులే ఉన్నారని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఆ మొక్క చనిపోయి ఉంటే పెళ్లి ఆపేస్తారా అని అడుగుతుంది. అలా ఎందుకు జరుగుతుంది. మొక్క బతికే ఉంటుంది అనుకోవచ్చు కదా అని అపర్ణ చెప్తుంది.

ఇక అక్కడే యాపిల్ కట్ చేస్తున్న కనకం... ఆ మొక్క చనిపోతుందని మనసులో అనుకుంటుంది. ఈ కనకం మొక్కను హత్య చేయబోతుందని అనుకుంటుంది. ఇక రుద్రాణి మాట్లాడుతూ... నువ్వే కదా నా పెళ్లికి ముహుర్తాలు, లగ్నం బాగున్నాయని చేశావ్.. నా పెళ్లి పేటాకులు అయిందని గుర్తు చేస్తుంది. నువ్ ఆవేశపడకుండా ఉంటే బాగుండేదని అపర్ణ అంటుంది. అప్పుడు ఈ లగ్నాలు ఏం చేస్తున్నాయని అడుగుతుంది రుద్రాణి.

Kanakam Plan Success in December 9th 2023 Episode number 274 in Brahmamudi Telugu Serial

ఇక స్వప్న,రాహుల్ జాతకాలు చూడలేదు అందుకే అలా ఉంటున్నారేమో అని రుద్రాణి అంటుంది. రాజ్, స్వప్న కూడా ఏం బాగున్నారు. ఎప్పుడూ ఏదో ఒక రభస అని అపర్ణ అంటుంది. ఇక ఈ విషయం ఆపండని ఇందీరాదేవి అంటుంది. తెల్లారితే తెలిసిపోతుందని చెప్తుంది. మరోవైపు ఈ పెళ్లి జరిగితే.. కల్యాణ్‌ను అడ్డు పెట్టుకుని అప్పు అంతా తీర్చొచ్చు అనుకున్నామని అనామిక పేరెంట్స్ మాట్లాడుకుంటారు. కానీ ఇలా జరిగిందని బాధపడుతారు.

ఇప్పుడు మనం కాదు చేయాల్సింది... అనామికనే చేస్తుందని అనామిక తండ్రి కూతురు దగ్గరికీ వెళ్తాడు. నువ్ చాలానే ప్రేమిస్తున్నావ్. కానీ, నీలా కల్యాణ్ ప్రేమించట్లేదేమో బేబీ అని రెచ్చగొట్టి పోతాడు. అనామిక.. కల్యాణ్‌కు కాల్ చేసి.. మొక్క బతికి ఉంటే మన పెళ్లి జరుగుతుంది. లేదంటే అని అడుగుతుంది. దానికి కల్యాణ్ సైలెంట్‌గా ఉంటాడు. నీ మౌనమే సమాధానం చెబుతుందని అనామిక అంటుంది.

Kanakam Plan Success in December 9th 2023 Episode number 274 in Brahmamudi Telugu Serial

నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది... నేను నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను. ఈ పెళ్లి జరగకుంటే నువ్ నా చావును చూస్తావ్ అని కల్యాణ్ని అనామిక బెదిరిస్తుంది. దాంతో షాక్ అవుతాడు కల్యాణ్. మరోవైపు కావ్య, రాజ్ కూడా కల్యాణ్ పెళ్లి గురించి మట్లాడుకుంటారు. ఏదో ఒకటి చేయండి అని కావ్య అడుగుతుంది. నువ్ ఏదో ఒకటి చేస్తావ్. అది ఇంట్లో గొడవ జరిగేలా చేస్తుందని రాజ్ అంటాడు. ప్రేమించిన వాళ్ల బాధ మీకు పట్టదు అని కోపంగా వెళ్లిపోతుంది కావ్య.

మరోవైపు కనకం అందరూ పడుకున్నకా బయటకు వచ్చి... పచ్చగ ఉన్న మొక్కను తీసి వాడిపోయిన మొక్కను పెడుతుంది. ఇంతలో మొక్క దగ్గరికి కల్యాణ్ వస్తాడు. డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ రావడంతో కనకం దాచుకుని... కల్యాణ్ డోర్ తీసి చూసి సరికి కనకం పక్కకు వెళ్లి దాక్కుంటుంది. కల్యాణ్ వచ్చి మొక్క వాడిపోవడం చూసి షాక్ అవుతాడు. పెళ్లి జరగదా అనుకుని అప్పు తెచ్చిన ఇంకో మొక్కను నాటాలని అనుకుంటాడు. కానీ పంతులు చెప్పిన మాటలు తల్చుకుని ఆగిపోతాడు.

Kanakam Plan Success in December 9th 2023 Episode number 274 in Brahmamudi Telugu Serial

నా ప్రేమ కోసం ఇంట్లో వాళ్ల ఆరోగ్యాన్ని పనంగా పెట్టలేనని కల్యాణ్ అనుకుని వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం లేచిన కనకం వచ్చి మొక్క దగ్గరకు వస్తుంది. ఇంతలోపే అక్కడ అంతా ఉంటారు. మొక్క వాడిపోయిందని షాక్ అయినట్లు ఉన్నారు. నేనే ఓదార్చాలని అనుకుంటుంది. కానీ వచ్చి చూసేసరికి మొక్క బతికే ఉంటుంది. అది చూసి షాక్ అయిన కనకం నా అప్పు పరిస్థితి ఏంటీ అని అనుకుంటుంది.

మొక్క బతికి ఉండటంతో అంతా కల్యాణ్‌కు కంగ్రాట్స్ చెబుతారు. తర్వాత అనామికకు కాల్ చేసి మొక్క బతికే ఉందని కల్యాణ్ చెబుతాడు. దాంతో అనామిక సంబరపడిపోతుంది. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోతుంది. అనామిక పెళ్లి జరుగుతుంది. కానీ, మీరు అన్నట్లుగా అనామిక మాట విని కల్యాణ్ మన సమస్యలు తీరుస్తాడా అని అనామి తల్లి అడుగుతుంది. కచ్చితంగా చేస్తాడు. పెళ్లి అయ్యాక.. ఏదో ఒకటి చేసి కల్యాణ్‌ను మన ఇంటికి తీసుకొస్తాం... అప్పుడు కల్యాణ్‌కు వచ్చే వాటాతో మన అప్పు తీరుస్తాం అని కన్నింగ్ ప్లాన్ వేస్తారు.

మరోవైపు కావ్య దగ్గరికి వచ్చిన కల్యాణ్ ఈ దేవతకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా జరగడానికి మీరే కదా కారణం కదా అని అడుగుతాడు. ఆ మొక్క నాటింది మీరే అని నాకు తెలుసు వదినా అని కల్యాణ్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో తాంబులాలు ఇచ్చుకుంటారు. లగ్నపత్రికకు పసుపు పెట్టి హారతి ఇవ్వమని ఇందిరా దేవి అంటుంది. దాంతో కావ్య అలాగే చేస్తుంది. కానీ, లగ్నపత్రికకు నిప్పు అంటుకుని కాలిపోతుంది. లగ్న పత్రికకు నిప్పు అంటుకునే పసుపులో ఏదో కలుపుతుంది రుద్రాణి. నిప్పు అంటుకోవడంతో రుద్రాణి, రాహుల్ సక్సెస్ అన్నట్లుగా సంతోషపడతారు. అనామిక తల్లి కావ్యపై సిరియస్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X