Brahmamudi December 5th: దుగ్గిరాల ఇంట్లోకి కనకం ఎంట్రీ... కల్యాణ్ పెళ్లి ఆపేందుకు స్కెచ్

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (డిసెంబర్5వ తేదీ) స్వప్నకు ఇంత అవమానం జరిగాక ఇక ఈ ఇంట్లో ఉండనివ్వనని కనకం డ్రామా మొదలుపెడుతుంది. స్వప్నను పుట్టింటికి తీసుకెళ్తానని చెప్తుంది. స్వప్నను అన్ని సర్దుకుని రమ్మని చెప్తుంది. నిజంగానే ఇంటికి తీసుకెళ్లేదే అయితే మాటలు ఎందుకు చెప్తుందని రుద్రాణికి డౌట్ వస్తుంది. ఎక్కడో తేడా కొడుతుందని రుద్రాణి మనసులో అనుకుంటుంది. స్వప్న.. తన తల్లి కనకం మాటలకు కన్ఫూజ్ అవుతుంది. పుట్టింటికి వస్తే... ఇటు అత్తింటికి అటు పుట్టింటికి అవమానం అని ఆలోచిస్తున్నావు కదా అని స్వప్నతో కనకం అంటుంది.

ఈ అవమానం కన్నా ఆత్మాభిమానమే ముఖ్యం... దయచేసి పుట్టింటికి రా తల్లి అని కనకం అంటుంది. అమ్మా ఏంటమ్మా ఇది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థం అవుతుందా? అని కావ్య అంటుంది అమ్మా.. అక్క కాపురం నిలబడాలని కోరుకోవాలి కానీ ఇలా నువ్వే దాని కాపురాన్ని కూల్చేసి తీసుకెళ్లిపోతాను అంటే ఎలా? అని కావ్య చెప్తుంది. లేదు లేదు.. మీ అమ్మ చాలా క్లారిటీగానే మాట్లాడుతుందని రుద్రాణి అంటుంది.

Kanakam plan to Stop Kalyan Marriage in December 5th 2023 Episode number 271 in Brahmamudi Telugu Serial

పాకెట్‌ పాలలో రెండు పాకెట్ల నీళ్లు కలిపినట్లు మీ ఇంట్లో ఆత్మాభిమానం, మమకారం రెండూ కలిసిపోతాయని వెటకారం చేస్తుంది. ఇక్కడి కన్నా మీ అక్క అక్కడ సుఖంగా ఉంటుందని మాట్లాడుతుంది. మట్టి పిసుక్కోవడం.. బొమ్మలకు రంగులు వేసుకోవడం మీకు బ్రష్‌తో పెట్టిన విద్య కదా అని చులకన చేస్తుంది.

రుద్రాణి మాటాలకు ఇందిరాడేవి ఫైర్ అవుతుంది. ఆ డీఎన్‌ఏ టెస్ట్‌ అయ్యే వరకు స్వప్న ఇక్కడే ఉంటుందని ఇందులో ఎలాంటి మార్పు లేదని చెప్తుంది. అలాగయితే నా కూతురును వదిలి నేను ఉండలేనని ముందే ఉత్త మనిషి కాదని చెప్తుంది కనకం. ధాన్యలక్ష్మీ కూతురు కడుపుతో ఉన్నప్పుడు తల్లి అవసరం ఎంతో ఉంటుందని కనకం ఇక్కడే ఉండాలని చెప్తుంది. దీంతో ఇందిరాదేవి కూడా సరే అని చెప్తుంది.

ఇక కనకం సరే అని చెప్తుంది. అప్పు చేత తన బట్టలు పంపించమని అన్నపూర్ణకు కాల్ చేసి కనకం చెప్తుంది. అప్పును ఎందుకని పంపించాలని వాళ్ల అక్క అడుగుతే కళ్యాణ్‌ పెళ్లి ఆగిపోవడం అది కళ్లతో చూడాలని చెప్తుంది కనకం సరే అని ఫోన్‌ పెట్టేస్తుంది అన్నపూర్ణ. మరోవైపు బెడ్ రూంలో ఆలోచిస్తూ కూర్చున్న అప్పు దగ్గరకు అన్నపూర్ణ వస్తుంది. మీ అమ్మ ఫోన్‌ చేసిందే.. మీ అక్కను చూసుకోవడానికి మీ అమ్మను అక్కడే ఉండమని అడిగారట అని అన్నపూర్ణ చెప్తుంది.

Kanakam plan to Stop Kalyan Marriage in December 5th 2023 Episode number 271 in Brahmamudi Telugu Serial

నిన్ను బట్టలు తీసుకుని రమ్మంది. అన్ని సర్ధిపెడతాను రేపే తీసుకుని వెళ్లు అని అన్నపూర్ణ చెప్తుంది. అప్పు అక్కడికి తాను వెళ్లనని చెప్తుంది. నాకదంతా తెలియదు. నువ్వు వెళ్లాల్సిందే అంటూ అన్నపూర్ణ వెళ్లిపోతుంది. స్వప్న బెడ్‌రూంలో కూర్చుని కనకం తీసుకొచ్చిన స్వీట్స్‌ తింటూ ఉత్తి చేతులతో వచ్చి ఉంటే నిన్ను తిట్టేదాన్ని అమ్మ అంటుంది.

ఇకపై ఏమైనా చేసేటప్పుడు నాకు చెప్పి చేయి అని స్వప్నతో కావ్య అంటుంది. నీకెందుకు చెప్పాలని స్వప్న కోపంగా కావ్యను అడుగుతుంది. ఇద్దరూ గొడవపడుతుంటే కనకం సర్ధిచెప్పి స్వప్నను బయటకు పంపిస్తుంది. కళ్యాణ్‌ పెళ్లికి ముహూర్తం పెట్టే పంతులు వివరాలు కావ్యను అడుగుతుంది కనకం. పంతులు వివరాలు కావ్య చెప్పడంతో అక్కడి నుంచి నరుక్కువద్దాం అని మనసులో అనుకుంటుంది కనకం.

పంతులు గారి ఇంటి ముందు దీనంగా నిలబడి ఉంటుంది కనకం. కనకాన్ని చూసిన పంతులు ఆశ్యర్యంగా ఎవరని అడుగుతాడు. దశమ స్థానంలోకి కుజుడు ప్రవేశించినట్లు మీరు నా ఇంట్లోకి ప్రవేశించారు. ఎవరమ్మా మీరు? మీరొక పెళ్లి.. అని కనకం చెప్తుంది. ముహూర్తం పెట్టాలా.. అని పంతులు అడుగుతాడు. అవును కానీ ఆ పెళ్లి జరగడానికి కాదు.. చెడగొట్టడానికి.. అని చెప్తుంది కనకం. కనకం చెప్పగానే పంతులు షాక్‌ అవుతారు.

తాను అలా చేయనని చెప్తాడు. కనకం సినిమా డైలాగులు చెప్పి తన కూతురు జీవితాన్ని నిలబెట్టమని కోరుకుంటుంది. దీంతో పంతులు ఒప్పుకుని ఇంతకీ ఎవరి పెళ్లి అని అడుగుతాడు. దుగ్గిరాల సీతారామయ్య మనవడి పెళ్లి అనగానే పంతులు సీరియస్‌గా కనకాన్ని తిడతాడు. దీంతో కనకం మీరు సాయం చేయకపోతే నేను సూసైడ్‌ చేసుకుంటానని బెదిరిస్తుంది. ఆ ఇద్దరి జాతకాలు కలవలేదని పెళ్లి చెడగొట్టమంటుంది.

Kanakam plan to Stop Kalyan Marriage in December 5th 2023 Episode number 271 in Brahmamudi Telugu Serial

పంతులు ఒప్పుకోకపోతే విషం తీసి తాను తాగి చనిపోతానని కనకం బెదిరింపు నాటకం మొదలుపెడుతుంది. దీంతో పంతులు పెళ్లి చెడగొడతానని ఒప్పుకోవడంతో కనకం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య బోర్డు మీద ఏవో డాట్స్‌ గీస్తుంటుంది. రాజ్‌ వచ్చి ఏం చేస్తున్నావు అన్నట్లు సైగ చేస్తాడు. చుక్కలు లెక్క పెడుతున్నానండి అని కావ్య అంటుంది. ఎందుకు లెక్కపెట్టడం నన్ను అడిగితే నేను చెప్పేవాణ్ణి కదా అని రాజ్ అంటాడు.

మీకు చుక్కల లెక్కలు కూడా తెలుసా? అని కావ్య అంటుంది. తెలుసు.. పదిహేను కోట్ల పదిహేను లక్షల పదిహేను వేల పదిహేను వందల పదిహేను అని రాజ్ చెప్తాడు. ఎందుకండి కోస్తారు.. నేను నమ్మనని కావ్య అంటుంది. కావాలంటే రాత్రికి పైకి వెళ్లి లెక్కపెట్టుకో అదే లెక్క వస్తుంది. ఇంతకీ నువ్వేం చుక్కలు గీస్తున్నావని రాజ్ అడుగుతాడు. అరుణ్‌ ను పట్టుకోవడానికి తాను ప్లాన్‌ గీస్తున్నట్లు కావ్య చెప్తుంది. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి ఎపిసోడ్ లో పరమేశ్వర శాస్త్రీ కల్యాణ్, అనామిక జాతకాలు చూస్తారు. ఏమైంది పంతులు గారు అని ఇందిరాదేవి అడుగుతుంది. అమ్మాయి జాతకంలో మాంగళ్య దోషం ఉంది. ఈ పెళ్లి జరిగితే ఈ ఇంట్లో పెద్దవాళ్లకు మంచిది కాదు.. చిక్కులు చికాకులు రావొచ్చని చెప్తాడు. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X