Brahmamudi November 6th: కూతురి చెంపలు పగులగొట్టిన కనకం... రాజ్‌కు విడాకులు ఇప్పించాలని నిర్ణయం
ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో (Brahmamudi November 6th Episode) స్వప్న చేసిన పనికి కనకం... కూతురి చెంపలు పగులగొడుతుంది. అంత తప్పు ఏం చేశాను అంటూ స్వప్నఅడుగుతుంది. కావ్య మీద ఎందుకు నిందలు వేశావ్ అని అడుగుతుంది. కొట్టడం కాదు.. చంపేయాలి అంటూ పొట్టుపొట్టు కొడుతుంది. నీ చిన్న కూతురు నువ్వు అనుకున్నంత గొప్పది కాదు.. అని అంటుంది స్వప్న. తప్పు చేసిందే కాకుండా నోరు లేస్తుందేంటి అంటూ కనకం.. చీపూరు పట్టుకువచ్చి మరీ కొడుతుంది. ఇక స్వప్న అరుస్తుంది. నువ్వు నీతిమంతురాలు అన్నట్లు నన్ను కొడుతున్నావ్ ఏంటి.. అంతగా వస్తే.. నిన్ను నువ్వు కొట్టుకో.. అంటుంది స్వప్న.
ఇప్పటి వరకు నింద కావ్య మీద వేశావ్... ఇప్పుడు నా మీద వేస్తున్నావా అంటూ స్వప్న అంటుంది. అవును నీ వల్ల ఇదంతా జరిగింది.. చిన్నప్పటి నుంచి నన్ను డబ్బున్న వాళ్లలాగా పెంచావ్.. డబ్బున్న వారితో స్నేహం చేయమన్నావ్.. అసలు ఆ రోజు అంత పెద్ద నాటకం ఆడకపోతే.. నేను ఈరోజు ఇంత నాటకం ఆడకపోదును కదా.. అంటుంది స్వప్న. ఇప్పుడు కూడా నీ చిన్న కూతురు కోసం వచ్చావ్... నా గురించి కాదు.. అంటూ స్వప్న అంటుంది.

తల్లి ప్రేమ ఇద్దరి మీద సమానంగా ఉండాలి కానీ నీ ప్రేమ సవతి ప్రేమలా ఉంది అంటుంది స్వప్న. ఇక కనకం మళ్లీ స్వప్న చెంప పగులగొడుతుంది. సవతి ప్రేమ నీ మీద కాదు... కావ్య మీద చూపించాను. తను కష్టపడుతుంటే.. దాని సొమ్మంత నీకు పెట్టాను చూడు... అది సవతి ప్రేమ. కావ్య జీవితం నాశనం చేస్తున్నావ్ అంటూ బోరున విలపిస్తుంది. దీంతో స్వప్న అవును నా దారికి ఎవరు అడ్డు వచ్చినా చేస్తాను అని ఖరాఖండిగా చెప్తుంది. అఖరికి నువ్వు వచ్చినా సరే... అంటుంది.
నీకు దండం పెడుతా.. కావ్య జోలికి రాకు అంటుంది కనకం. ఈ మాటలు కావ్యకు చెప్పు.. నా జోలికి రావొద్దని.. స్వప్న అంటుంది. ఇక కనకం స్వప్నను ఇంటికి తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ స్వప్న నా జీవితంలోకి రావొద్దు.. నీ క్యారెక్టర్ అయిపోయిందంటూ గదిలొంచి గెంటేస్తుంది. ఇక కనకం ఏడుస్తూ వెళ్లిపోతుండగా... కావ్య చూస్తుంది.
అమ్మ నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావ్.. చూడలేదు అంటుంది కావ్య. నా జీవితంలో ఏదైనా తప్పు చేశాను అంటే.. నీ విషయంలోనే.. వీలైతే క్షమించు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక మూర్తి.. నాకు చెప్పకుండా ఆ ఇంటికి ఎందుకు వెళ్లావ్ అని అడుగుతాడు. కనకం.. కావ్య కోసం వెళ్లాను అంటుంది. స్వప్న ఆ ఇంట్లో ఉండొద్దని అనుకున్నాను అంటుంది. నేను ఏదో ఆవేశంలో అంటే... నువ్వు ఎందుకు సీరియస్ గా తీసుకున్నావ్ అంటాడు మూర్తి. అమ్మ చేసిన దాంట్లో తప్పేం ఉందని అప్పు కూడా సమర్థిస్తుంది.
ఇక కనకం... స్వప్న చేసిన రాద్ధాంతం గురించి చెప్తుంది. ఇక అప్పు కూడా సీరియస్ అవుతుంది. దాన్ని లాక్కురావాల్సిందని అంటుంది. ఇప్పుడే వెళ్లి దాన్ని ఈడ్చుకువస్తాను అంటుంది అప్పు. ఇక అప్పును ఆపుతారు కనకం,మూర్తి. నువ్వు వెళ్లడం వల్ల మరో సమస్య అవుతుంది కానీ... స్వప్నలో ఏ మార్పు రాదు అంటుంది కనకం. కూతురు కష్టపడుతున్నా చూస్తూ మౌనంగా ఉండాలి తప్పు.. ఎందుకు అని ప్రశ్నించకూడదు అంటూ కనకం బోరున ఏడుస్తుంది.
కావ్య.. కనకానికి ఫోన్ చేస్తుంది. ఎందుకు వచ్చావ్ ఎందుకు వెళ్లిపోయావ్ ఏంటి అంటుంది. నేను స్వప్నతో మాట్లాడాలని వచ్చాను కావ్య అంటుంది కనకం. మరి నీ మాట స్వప్న విందా అంటుంది కావ్య. నా గురించి నేను చూసుకుంటాను అమ్మా... ఇంకోసారి ఇలాంటి పనులు చేసి నువ్వు బాధపడకు అని చెప్తుంది కావ్య. ఇక ఇంట్లో అందరూ నీతో ఎలా ఉంటున్నారు అని అడుగుతుంది కనకం. ఇక అనడానికి ఏముంది.. తాతాయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారో.. అంటుంది కావ్య.
ఇక మరోవైపు ఇందిరాదేవి.. అపర్ణతో మాట్లాడుతుంది. నీ బాధ నాకు అర్థం అవుతుంది.. నేను చెప్పింది కూడా ఆలోచించు అంటుంది. దానికి అపర్ణ ఇక ఆలోచించడానికి ఏమి లేదు అంటుంది. స్వప్న చేసిన పనికి కావ్యపై పగ తీర్చుకుంటున్నట్లు ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. కావ్యకు పెద్దలంటే గౌరవం... ఎంత పనుందా.. ఎవరు ఎంత విసిగించినా కావ్య ఎప్పుడు నొరువిప్పలేదు.. అంటారు. మనం జాలి చూపించి ఇంటి కోడళ్లుగా చేసుకుంటే.. మనకే వెన్నుపోటు పొడుస్తారు అంటుంది అపర్ణ. మావయ్య గారితో మాట్లాడి ఏదో ఒకటి తేల్చండి అంటుంది.
ఇక గదిలో రాజ్.. కావ్యతో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుని బాధపడుతుంటాడు. ఇక కోపంతో ఊగిపోతూ... కావ్య పెళ్లి ఫోటోను కాల్చుతాడు. అది చూసి కావ్య కూడా బాధపడుతుంది. ఇంతలో రాజ్ చేయి కాలుతుంది. ఏమైంది అని కంగారు పడుతుంది కావ్య. అబద్ధం చెప్పాను అని నువ్వే ఒప్పుకున్నావ్ అంటాడు రాజ్. ఇక కావ్య నేను అబద్ధం చెప్పలేదు.. నిజం దాచాను అంటుంది. మీరు చాలా దూరం వెళ్లిపోతున్నారు... అంటుంది కావ్య. రేపు ఉదయం తాతాయ్య నిర్ణయం తీసుకుంటే నీ పీడ విరగడ అవుతుంది అని రాజ్ అంటాడు. రేపటితో ఈ బంధానికి తెర పడాలని కోరుకుంటున్నా అని చెప్పి వెళ్లిపోతాడు.
ఇక కావ్య ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో మనం బురదలో పడ్డామని అపర్ణ అంటుంది. ఆ మట్టి వాసన దుగ్గిరాల ఇంటికి అంటక ముందే కడిగేసుకోవడం మంచిది అంటుంది అపర్ణ. ఇందులో స్వప్న పాత్ర ఎంత ఉందో.. కావ్య హస్తం కూడా అంతే ఉంది. ఇంత దాకా వచ్చాకా స్వప్నను కూడా పంపిచేద్దాం.. రాజ్ కు విడాకలు ఇప్పిద్దాం అంటుంది అపర్ణ. అది విన్న రాజ్, కావ్యతో పాటు ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











