Kangana Ranaut's Lock Upp బట్టలు విప్పి సీక్రెట్ చెప్పేస్తారు.. బిగ్‌బాస్‌ను మించిన కంగన రనౌత్ రియాలిటీ షో

బుల్లితెర మీద బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షోలకు మంచి స్పందన, రేటింగ్ నమోదు అవుతుండటంతో దేశవాళీ రియాలిటీ షోలకు గిరాకీ పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. బిగ్‌బాస్ తరహా షోలను డిజైన్ చేస్తూ మరింత ఘాటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ హోస్ట్‌గా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ రూపొందించిన లాక్ అప్ షో గురించి హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చర్చనీయాంశమైంది. తాజా లాకప్ షో గురించిన వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 27న కంగన రనౌత్ షో

ఫిబ్రవరి 27న కంగన రనౌత్ షో

కంగన రనౌత్, ఏక్తా కపూర్ కాంబినేషన్‌లో రియాలిటీ షో వస్తుందనే వార్తలతో అంచనాలు భారీగా పెరిగాయి. లాకప్ అని షోకు పేరు పెట్టి అనౌన్స్ చేయగానే మీడియాలోను, సోషల్ మీడియాలోను మంచి రెస్పాన్స్ లభించింది. ఈ షోను ఫిబ్రవరి 27న ఆల్ట్ బాలాజీ యాప్‌లోను, ఎంఎక్స్ ప్లేయర్‌లోను 24 గంటలపాటు స్ట్రీమింగ్ చేయనున్నారు.

జైలు సెట్‌లో లాకప్‌లో కంటెస్టెంట్లు

జైలు సెట్‌లో లాకప్‌లో కంటెస్టెంట్లు

ఇక లాకప్ రియాలిటీ షో కాన్సెప్ట్ విషయానికి వస్తే.. జైలు తరహా సెట్‌లో లాకప్స్ నిర్మించారు. ప్రతీ లాకప్‌లో ఒక్కొక్కరిని బంధిస్తారు. లాకప్‌‌లో వారు చేపే ఫెర్ఫార్మెన్స్ హైలెట్‌గా చూపించబోతున్నారు. అయితే ఈ ట్రైలర్‌లో ఇచ్చిన బిల్డప్‌తో షోలో రచ్చ మూమూలుగా ఉండదనే విషయం చెప్పకనే చెప్పారు. ఈ ట్రైలర్‌లో కంగన రనౌత్ చెప్పిన విషయాలు టెలివిజన్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించబోతుందనే అభిప్రాయం కలుగుతున్నది.

గేమ్ నుంచి అవుట్ కాకుండా ఉండాలంటే..

గేమ్ నుంచి అవుట్ కాకుండా ఉండాలంటే..

లాకప్ జైలు గురించి కంగన రనౌత్ ట్రైలర్‌లో వివరిస్తూ.. ఎలాంటి కలలైనా కనడానికి అవకాశం ఉన్న ప్రదేశమిది. చెడ్డ కలలు కనడానికి సమయం తక్కువ. ఇక్కడ ఉండే కంటెస్టెంట్ల విలాసవంతమైన అవసరాల గురించి ఏ మాత్ర ఆలోచించం. కానీ వాళ్లకు ఏం అవసరం ఏముటుందనే విషయాన్ని పట్టించుకొంటాం. కంటెస్టెంట్ల చేతులకు హ్యాండ్ కఫ్స్ వేసి పెడుతాం. వాళ్లను రక్తాన్నీ పిల్చేస్తాం. ఇందులో ఉండే కంటెస్టెంట్లలో కొందరు తమకు నచ్చినట్టుగా జీవించే అవకాశం ఉంది. అందుకోసం అందరి ముందు బట్టలు విప్పేస్తారు. ఈ గేమ్ నుంచి అవుట్ కాకుండా ఉండాలంటే.. తమ జీవితాల్లోని సీక్రెట్స్‌ను చెప్పాల్సి ఉంటుంది. అది కూడా అందరి ముందు చెప్పాల్సి ఉంటుంది. ఇండియాలోనే మోస్ట్ కాంట్రవర్సియల్ కంటెస్టెంట్ల జీవితం 24 గంటలపాటు మీ ముందు ఉంచుతాం. అత్యాచారాలకు అడ్డంగా ఉండే ఈ జైలుపై నజర్ వేయాల్సిందే అంటూ కంగన రనౌత్ గేమ్ షో గురించి స్పష్టం చేసింది.

దేశంలోని అత్యంత వివాదాస్పద వ్యక్తులతో

దేశంలోని అత్యంత వివాదాస్పద వ్యక్తులతో

లాకప్ గేమ్ షోలో అత్యంత వివాదాస్పదమైన సెలబ్రిటీలను ఎంపిక చేసినట్టు సమాచారం. తొలి కంటెస్టెంట్‌గా ఇటీవల తన భర్త కరణ్ మెహతాపై గృహ హింస కేసు పెట్టిన టెలివిజన్ నటి నిషా రావత్ ఈ గేమ్ షోలోకి ప్రవేశించనున్నారు. ఇంకా ఈ గేమ్ షోలో శ్వేతా తివారీ పాల్గొంటున్నట్టు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

లాకప్‌లోకి వచ్చే కంటెస్టెంట్లు వీరే..

ఇంకా లాకప్ గేమ్ షోలో వివాదాస్పద కమెడియన్ మునవర్ ఫరూఖీ, పూనమ్ పాండే రాబోతున్నట్టు రెండు, మూడు టీజర్లలో హింట్ ఇచ్చారు. పూనమ్ పాండేను పరోక్షంగా పరిచయం చేస్తూ మూడో కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేశాం. ఈ కంటెస్టెంట్‌ను పరిచయం చేయాలంటే.. డేరింగ్‌గా ఉండాలి. ఇంటర్నెట్‌లో ఎక్కువ హడావిడి చేస్తుంది అంటూ చెప్పారు. ఇంకా ఈ షోలో ప్రియాంక్ శర్మ, వికాస్ గుప్తా, షెహనాజ్ గిల్, అనుష్క సేన్, చేతన్ భగత్ లాంటి వాళ్లు గేమ్ షోలోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X