అందరూ చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు: మాస్క్ పెట్టుకుని మరీ ఇచ్చేశాడు.. కుర్రాడి దెబ్బకు అంతా షాక్!

మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అంతలా కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోందీ నామం. హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించినా దక్కని గుర్తింపు.. బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె సొంతం అయింది. దీనికి కారణం ఏమిటో అందరికీ తెలిసిందే. షో తర్వాత కూడా ఆమె తరచూ ఏదో ఒక పని చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. అయితే, ఈ సారి మాత్రం వేరొకరు చేసిన దానికి ఆమె హైలైట్ అవుతోంది. అదేనండీ స్టేజ్ పైనే మోనాల్‌కు ఒక వ్యక్తి ముద్దు పెట్టేశాడు. అది కూడా అందరూ చేస్తుండగానే. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఒకేసారి రెండు ట్రాకులు.. ఆమెపై విమర్శలు

ఒకేసారి రెండు ట్రాకులు.. ఆమెపై విమర్శలు


హీరోయిన్ స్థాయిలో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది మోనాల్ గజ్జర్. ఆరంభంలోనే యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇలా చాలా రోజుల పాటు అతడి వెంట తిరిగింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉంది. దీంతో ఇద్దరితో ఒకేసారి ట్రాక్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగడంతో ఆమెపై విమర్శలొచ్చాయి.

కిస్సులు, హగ్గులు.. అస్సలు తగ్గని మోనాల్

కిస్సులు, హగ్గులు.. అస్సలు తగ్గని మోనాల్

క్రమంగా షో జరుగుతున్న కొద్దీ మోనాల్.. అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయింది. దీంతో ప్రేక్షకులతో పాటు హౌస్‌లో ఉన్న వాళ్లంతా వీళ్ల ట్రాక్ గురించి మాట్లాడేవారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఈ జంట హౌస్‌లో మరింత హల్‌చల్ చేసింది. ఇందులో భాగంగానే తరచూ ముద్దులు, హగ్గులు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో ఈ జంట రచ్చ రచ్చ చేసి హైలైట్ అయింది.

అలా లాభపడిన బ్యూటీ.. ఇప్పటికే రెండింట్లో

అలా లాభపడిన బ్యూటీ.. ఇప్పటికే రెండింట్లో

సాధారణ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టిన మోనాల్ గజ్జర్.. ఊహించని విధంగా పద్నాలుగు వారాలు షోలో కొనసాగింది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ. 50 లక్షలు పైగానే తీసుకుందని తెలిసింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఓంకార్ నిర్వహించే 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

అతడితో కలుస్తున్నట్లు ప్రకటించిన మోనాల్

అతడితో కలుస్తున్నట్లు ప్రకటించిన మోనాల్

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అందులో మాత్రం ఆమెనే.. ఫోకస్ చేస్తున్నారు

అందులో మాత్రం ఆమెనే.. ఫోకస్ చేస్తున్నారు


మోనాల్ గజ్జర్ ప్రస్తుతం 'డ్యాన్స్+' షోలోనే చేస్తోంది. ఇందులో ఆమె జడ్జ్‌గా వ్యవహరించే తీరు ఆకట్టుకుంటోంది. అలాగే, ఆమె డ్రెస్సింగ్ కూడా మెప్పించే విధంగా ఉంది. మొదట్లో అందాలను కనిపించేలా అలంకరించుకున్న ఈ భామ... ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా కనిపిస్తోంది. దీంతో ఆమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు షో నిర్వహకులు. తద్వారా తరచూ హైలైట్ అవుతోంది.

అప్పుడు ఆ కుర్రాడిని తీసుకొచ్చి.. కూర్చోబెట్టి

అప్పుడు ఆ కుర్రాడిని తీసుకొచ్చి.. కూర్చోబెట్టి


'డ్యాన్స్+' షోలో అదరగొడుతోన్న కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో మోనాల్ గజ్జర్.. అతడిని తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు. ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ.. 'మేడమ్ కోసం ఏదైనా చేస్తా. అడిగితే పట్టు బట్టలు వేసుకుని వస్తా' అంటూ ఓంకార్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.

Recommended Video

Pushpa Movie ప్యాన్ ఇండియా స్థాయి తగ్గేదేలే | Introducing Pushpa Raj

అందరూ చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు

వచ్చే వారం ప్రసారం కానున్న 'డ్యాన్స్+' షోలో కన్నా మాస్టర్ పట్టుబట్టలతో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ఏకంగా మోనాల్ గజ్జర్‌ను స్టేజ్ పైకి తీసుకెళ్లాడు. అందరూ చూస్తుండగానే.. ఆమెకు గులాబీ పువ్వు ఇచ్చిన ఆ కుర్రాడు.. మోనాళ్లపై కూర్చుని ఆమె చేతిపై ముద్దాడాడు. ఆ సమయంలో మాస్క్ కూడా పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X