Bigg Boss Voting : ఓటింగ్‌లో కన్నడ బ్యాచ్ హవా.. నబీల్‌ని తొక్కేశారుగా, డేంజర్ జోన్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 8వ సీజన్ 12వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దివారాల్లో ఈ మెగా గేమ్ షో ముగియనుంది. ఇప్పటికే విజేత ఎవరు కాబోతున్నారు? అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కుర్రకారు ఏ ఇద్దరు కలిసినా ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అంటూ చర్చించుకుంటున్నారు. అలాగే 12వ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
మంగళవారంతో నామినేషన్స్‌ను ముగించిన బిగ్‌బాస్.. బుధవారం నుంచి మెగా చీఫ్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాడు. టాస్క్‌ల్లో గెలిచి మెగా చీఫ్ కంటెండర్స్‌గా పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి నిలిచారు. గురువారం నాటి ఎపిసోడ్‌లో తన మెకానిక్ రాకీ ప్రమోషన్స్‌లో భాగంగా హౌస్‌లో అడుగుపెట్టి సందడి చేశారు. ఏకంగా ఆటో నడుపుకుంటూ లోపలికి వచ్చిన విశ్వక్ సేన్‌ను చూడగానే అంతా ఆయనను పలకరించారు. తన సినిమాకు సంబంధించిన విషయాలు చెప్పిన ఆయన .. హౌస్‌లో జరుగుతున్న ప్రేమాయాణాలపై ఓ పంచ్ విసిరాడు. ఇక వెళ్తూ వెళ్తూ తన టీ షర్ట్‌ని అవినాష్‌కి ఇచ్చిన విశ్వక్ సేన్.. హౌస్‌మెట్స్ ఇచ్చిన మరో టీషర్ట్‌ను వేసుకుని వెళ్లాడు.

అనంతరం మెగా చీఫ్ కంటెండర్‌షిప్‌లో భాగంగా పట్టు వదలని విక్రమార్కుడు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని ప్రకారం.. పోటీలో ఉన్న ఐదుగురు డ్రమ్స్‌పై నిల్చొని రోప్‌లను పట్టుకుని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువ సేపు ఎవరైతే రోప్స్‌పై నిలబడతారో వారే గెలిచినట్లు. దీనికి సంచాలక్‌గా గౌతమ్‌ని నియమించాడు బిగ్‌బాస్. గేమ్ మొదలయ్యాక డాక్టర్ బాబు తన దగ్గర ఉన్న డైస్ వేయగా.. అందులో ఏ కలర్ వస్తే ఆ కలర్ డ్రమ్‌పై నిలబడ్డ వాళ్ల డ్రమ్‌ను లేపేస్తాడు.
అయితే గౌతమ్ మనల్ని లేపేస్తాడని కన్నడ బ్యాచ్ అతనిని టార్గెట్ చేయాలని డిసైడ్ అవ్వగా.. డాక్టర్ బాబు తెలివిగా పోటీలో ఉన్న వాళ్ల పేర్లకు బదులుగా నెంబర్స్ ఇచ్చి డైస్ వేసి షాకిచ్చాడు. దీని ప్రకారం ఎవరి నెంబర్ వస్తే వాళ్ల డ్రమ్‌ని లేపేశాడు. తొలుత పృథ్వీ నెంబర్ రావడంతో అతని డ్రమ్‌ని తీసేశాడు గౌతమ్.. గాల్లో వేలాడుతున్న పృథ్వీకి యష్మి చోటిచ్చింది. తర్వాత రోహిణి, విష్ణుప్రియ, యష్మి, పృథ్వీలు ఔటయ్యారు. చివరికి ఈ గేమ్‌లో టేస్టీ తేజ గెలిచాడు. అలా మొత్తానికి మెగా చీఫ్ టాస్క్‌లో భాగంగా ఓ గేమ్ పూర్తయ్యింది.

ఇకపోతే.. మొత్తంగా 12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ. ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ప్రకారం.. ప్రేరణ 26 శాతం ఓటింగ్‌తో తన నెంబర్‌వన్ ప్లేస్‌ని నిలబెట్టుకున్నారు. తర్వాత నిఖిల్ ( 25 శాతం ), యష్మి గౌడ ( 18 శాతం ), నబిల్ ( 16 శాతం ) , పృథ్వీరాజ్ (13 శాతం)ఓటింగ్‌తో నిలిచారు. ప్రస్తుతానికి పృథ్వీ డేంజర్ జోన్‌లో నిలవగా.. ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి కొద్దిరోజులు సమయం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











