రోడ్డు ప్రమాదంలో టీవీ యాక్టర్ మృతి
బెంగుళూరు: రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి చెందిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. బసవన్న గుడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిపురం ఎక్స్‌టెన్సన్ బహుదుర్ హయవదన రావు రోడ్ వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటనలో అశోక్ కుమార్(55) అనే టీవీ నటుడు మృతి చెందాడు.
అశోక్ కుమార్ కన్నడలో ప్రసారం అవుతున్న 'మహాపర్వ', 'పల్లవి అనుపల్లవి' సీరియల్స్‌తో పాటు పలు సీరియళ్లలో నటిస్తున్నాడు. పోలీసుల కథనం ప్రకారం...అశోక్ కుమార్ ఓ సీరియల్ షూటింగులో పాల్గొనేందుకు శనివారం ఉదయం బైకుపై వచ్చి దాన్ని తన స్నేహితుడి ఇంట్లో పార్కు చేసి అక్కడి నుంచి కార్లో వెళ్లియారు. తిరిగి ఆదివారం ఉదయం వచ్చి బైక్ తీసుకుని ఇంటికి బయల్దేరాడు.

బహదుర్ హయవదన రావు రోడ్డు పక్కన తవ్వకాలు చేపట్టి ఏవో పనులు చేస్తున్నారు. అది గమనించని అశోక్ కుమార్....బైక్‌తో పాటు అందులో పడిపోయి మరణించాడు. తలకు బలమైన గాయం కావడంతో అశోక్ కుమార్ అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది.
రోడ్డు పక్కన తవ్వకాలు చేపట్టింది బిబిఎంపి అనే సంస్థ అని తెలుస్తోంది. అనుమతులు తీసుకునే ఈ పనులు చేపట్టినప్పటికీ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే అశోక్ కుమార్ మరణించాడని అతని బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. అశోక్ కుమార్ మరణంపై సంతాపం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











