కన్నడ టివి నటి హేమశ్రీ అనుమానాస్పద మృతి

అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. సుధీంద్ర పోలీసులుకు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైలోని తమిళ సీరియల్ షూటింగు ముగించుకొని హేమశ్రీ బెంగళూరుకు చేరుకున్నారు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు బయలుదేరారు.
ఆ సమయంలో సుధీంద్ర కారు నడుపుతున్నారు. కారు నగర శివారుల్లోకి రాగానే.. హేమశ్రీ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన భర్త సుధీంద్ర తన భార్య హేమశ్రీని వెంటనే దగ్గర్లోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











