twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నడ టివి నటి హేమశ్రీ అనుమానాస్పద మృతి

    By Srinivas
    |

     Kannada TV actor dies mysteriously
    బెంగళూరు: కర్నాటకకు చెందిన ప్రముఖ టివి నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో మరణించింది. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తీవ్ర అస్వస్థతగా ఉందంటూ ఆమె తన భర్త ముప్పయ్యేడేళ్ల సుధీంద్ర, ఆమెను కారులో బెంగళూరు నగర శివారులోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వచ్చారు.

    అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. సుధీంద్ర పోలీసులుకు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైలోని తమిళ సీరియల్ షూటింగు ముగించుకొని హేమశ్రీ బెంగళూరుకు చేరుకున్నారు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు బయలుదేరారు.

    ఆ సమయంలో సుధీంద్ర కారు నడుపుతున్నారు. కారు నగర శివారుల్లోకి రాగానే.. హేమశ్రీ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన భర్త సుధీంద్ర తన భార్య హేమశ్రీని వెంటనే దగ్గర్లోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.

    English summary
    
 Kannada film and TV serial actor Hemashri , 30, died under mysterious circumstances on Tuesday . The actor and her husband Surendra Babu, residents of Banashankari, were driving in a car to Anantapur in Andhra Pradesh when she allegedly developed complications.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X