twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara TRP: తెలుగులో మరోసారి కాంతార సంచలనం.. ఫస్ట్ టైమ్ టీఆర్పీ ఎంతంటే?

    |

    కన్నడ నుంచి పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో విడుదలైన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి తనే హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా విడుదలైన అన్ని ఫ్లాట్ ఫార్మ్ లలో కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ఇక ఇప్పుడు తెలుగులో టెలివిజన్ లో కూడా సాలీడ్ టీఆర్పీని సొంతం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

     కలెక్షన్స్ పెంచుకుంటూ..

    కలెక్షన్స్ పెంచుకుంటూ..

    కాంతార సినిమా మొదట్లో కన్నడ చిత్ర పరిశ్రమలోనే మంచి టాక్ అందుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళింది. ఇక తర్వాత ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఊహించని ఫలితాన్ని అందుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే.

    తెలుగులో ఊహించని ప్రాఫిట్స్

    తెలుగులో ఊహించని ప్రాఫిట్స్

    గీత ఆర్ట్స్ ద్వారా తెలుగులో కాంతార సినిమాను థియేట్రికల్ గా డబ్ చేసి విడుదల చేశారు. మొదట కొంత లిమిటెడ్ థియేటర్స్ లో విడుదల చేసి అనంతరం థియేటర్స్ సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. కేవలం రెండు కోట్లకు కొనుగోలు చేసిన ఆయన దాదాపు 26 కోట్లకు పైగా ప్రాఫిట్స్ అందుకోవడం విశేషం. డబ్బింగ్ సినిమాలలో అతి తక్కువ పెట్టుబడికి ఎక్కువ స్థాయిలో లాభాలను అందించిన సినిమాల్లో కాంతారా ఒకటిగా నిలిచింది.

    వరల్డ్ వైడ్ రికార్డ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ రికార్డ్ కలెక్షన్స్

    ప్రపంచవ్యాప్తంగా కూడా కాంతారా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా కర్ణాటకలోని 174 కోట్లను అందుకోగా తమిళనాడులో 9 కోట్లు, కేరళలో 13.40 కోట్లు, హిందీలో అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గ్రాస్ మొత్తం 400 కోట్లను దాటినట్లు సమాచారం.

    టెలివిజన్ లో కూడా రికార్డు

    టెలివిజన్ లో కూడా రికార్డు

    అయితే ఈ సినిమా ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. స్టార్ మా ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ప్రీమియర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మొదటిసారి స్టార్ మాలో టెలికాస్ట్ అయినా కాంతార సినిమా 12.6 టిఆర్పి రేటును అందుకోవడం విశేషం. డబ్బింగ్ సినిమాలలో తెలుగులో అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ అందుకున్న సినిమాల్లో కాంతార టాప్ లిస్టులో నిలిచింది.

    త్వరలో కాంతార సీక్వెల్

    త్వరలో కాంతార సీక్వెల్

    తెలుగులో అసలు ఈ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. అది కూడా కేవలం బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా టెలివిజన్ లో కూడా కాంతార సరికొత్త సంచలనం క్రియేట్ చేసింది. కథానాయకుడు దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార కథకు సీక్వెల్ రెడీ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక సీక్వెల్ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది సినీ ప్రముఖులు ముఖ్యమైన పాత్రల్లో నటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.

    English summary
    Kantara movie solid trp rating in telugu version star maa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X