స్టార్ కమెడియన్‌కు 5 కోట్ల రెమ్యునరేషనా? కామెడీ షోలో ఒక్క ఎపిసోడ్‌కు రికార్డు పారితోషికం ఎందుకంటే?
ఇండియన్ మోస్ట్ పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అద్భుతమైనటువంటి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోలో సినిమాలు చేస్తున్నారంటే ఆ సినిమాలో కమెడియన్ గా ఈయన ఉండాల్సిందే అంతలా పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి కపిల్ శర్మ రెమ్యూనరేషన్ కూడా హీరోలకు సమానంగా ఉంటుంది.
ఇలా కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్నటువంటి గ్రేట్ ఇండియన్ కపిల్ షో కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతూ ఉంటారు. అయితే వారందరిని వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ వారి నుంచి సమాధానాలు రాబడుతూ ఉంటారు.

ఒకప్పుడు ఇలాంటి టాక్ షోలు బుల్లితెరపై ప్రసారం అయ్యేవి. ప్రస్తుతం ఈ టాక్ షోలు ఓటీటీలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ షో కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి కపిల్ శర్మ రెమ్యూనరేషన్ గురించి తెలిసి నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ టాక్ షో కోసం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కపిల్ శర్మ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. ఒక్కో ఎపిసోడ్ కోసం ఈయన ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఏ స్టార్ హీరోకి కూడా సాధ్యం కానటువంటి రెమ్యూనరేషన్ ఈయన కేవలం ఒక ఎపిసోడ్ కి తీసుకుంటున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా ఈయన రెమ్యూనరేషన్ 5 కోట్లు మాత్రమే కాకుండా ఈ షోలో ఆడియన్స్ మధ్యలో కూర్చొని నవ్వుతూ కనిపించే అర్చన సింగ్ ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇలా ఈ షో ఒక్క ఎపిసోడ్ కోసమే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అంటేనే కపిల్ శర్మ క్రేజ్ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications











