twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యానికి అలా బానిసగా మారాను.. నా తల్లి బాధ చూడ లేక.. కపిల్ శర్మ

    |

    టెలివిజన్ రంగంలో క్రేజీ హోస్ట్ కపిల్ శర్మ మద్యానికి బానిస అయ్యారనే విషయం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన కపిల్ శర్మ కామెడీ నైట్స్ ఆడిపోవడం ఆయన మానసికంగా కుంగిపోయాడని చెప్తుంటారు. తాజాగా డ్రగ్ ఫ్రీ ఇండియా అనే కార్యక్రమంలో కపిల్ పాల్గొని తాను వ్యసనం నుంచి ఎలా బయటపడ్డారో వెల్లడించారు.

    కపిల్ శర్మ కామెడీ షో నిలిచిపోవడంతో

    కపిల్ శర్మ కామెడీ షో నిలిచిపోవడంతో

    అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షోకు రాకపోవడంతో 2017 సెప్టెంబర్‌లో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దాదాపు ఏడాదిపాటు కపిల్ షో ఆగిపోయింది. చేతిలో పనిలేదు. దాంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురై మద్యానికి అలవాటు పడ్డాడు. ఆ సంఘటనలను ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నాడు.

    మద్యానికి బానిసయ్యా

    మద్యానికి బానిసయ్యా

    కొన్ని కారణాల వల్ల ఓ దశలో మద్యానికి బానిసయ్యాను. బాటిల్స్ కొద్ది మద్యం సేవించాను. నన్ను చూసి నా కుటుంబం తీవ్ర వేదనకు గురైంది. నా తల్లి భోరుమని విలపించేది. మద్యం మానేయమని ఏడ్చేది. ఆమె బాధను చూసే నేను మద్యం సేవించడం మానేశాను అని కపిల్ శర్మ చెప్పారు.

    ఆరోగ్యం చెడిపోయిందని

    ఆరోగ్యం చెడిపోయిందని

    మద్యం విపరీతంగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోయింది. దాంతో మద్యం అలవాటును తప్పించుకొనేందుకు రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లాను. అక్కడ కొన్నేళ్లు ట్రీట్‌మెంట్ పొందిన తర్వాత మళ్లీ ఆరోగ్యవంతుడిని అయ్యాను అని కపిల్ శర్మ వెల్లడించాడు.

    చంఢీగడ్‌లో డ్రగ్ ఫ్రీ ఇండియా కార్యక్రమం

    చంఢీగడ్‌లో డ్రగ్ ఫ్రీ ఇండియా కార్యక్రమం

    చంఢీగడ్‌లో నిర్వహించిన డ్రగ్ ఫ్రీ ఇండియా కార్యక్రమానికి సంజయ్ దత్‌తోపాటు కపిల్ శర్మ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సందర్బంగా కపిల్ శర్మ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. థాంక్యూ చంఢీగఢ్.. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేశారు అని ట్వీట్ చేశారు.

    English summary
    Television star Kapil Sharma has opened up about his struggle with alcoholism and what helped him ditch the habit. Kapil was at the Drug Free India event in Chandigarh on February 18
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X