195 కోట్ల రూపాయల రెమ్యునరేషన్.. నెట్‌ఫ్లిక్స్ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు కపిల్ శర్మకు ఎన్ని కోట్లంటే?
జాతీయ ఛానెల్స్‌లో పాపులర్ కామెడీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ఎంత రేటింగ్ ఉందో అందరికి తెలిసిందే. దేశంలోనే టాప్ రేటింగ్ ఉన్న రియాలిటీ షోలో ఒకటి. టాప్ టీఆర్సీ కలిగిన ఈ కామెడీ షోకు హోస్ట్‌గా కపిల్ శర్మ వ్యవహరిస్తున్నారు. షోతోపాటు ఆయన కూడా ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనేది వాస్తవం. చిన్న స్టాండప్ కమెడియన్‌గా ప్రారంభించి.. దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకొనే హోస్ట్‌లో ఒకరిగా నిలిచారు. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ అందుకొంటున్నాడనే విషయంలోకి వెళితే..
అమృత్‌సర్‌కు చెందిన కపిల్ శర్మ సినిమా ప్రపంచం, వినోద పరిశ్రమపై వ్యామోహంతో ముంబైలో అడుగుపెట్టారు. స్టాండప్ కమెడియన్‌గా చిన్నగా కెరీర్ ఆరంభించాడు. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షోలో 2007లో స్టాండప్ కమెడియన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు. ఆ తర్వాత కామెడీ సర్కస్, ఫ్యామిలీ టైమ్ విత్ కపిల్, కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే షోలతో పాపులర్ అయ్యాడు. డబ్బింగ్ ఆర్టిస్టుగా టెలివిజన్ హోస్ట్‌గా, నిర్మాతగా, సింగర్‌గా, బాలీవుడ్‌లో హీరోగా మారిపోయాడు.

కామెడీ నైట్స్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే కిస్ కిస్కో ప్యార్ కరూ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించడాు. ఆ తర్వాత ఫిరంగి సినిమా, అనంతరం జ్విగటో సినిమాల్లో నటించాడు. అయితే టెలివిజన్ హోస్టుగా భారీ సక్సెస్ అందుకొన్న ఆయన సినిమా రంగంలో మాత్రం తన మార్కును చూపించుకోలేకపోయాడు. ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు పోతున్నాడు.
తాజాగా ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. గత రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకొని ఇటీవల మూడో సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ సీజన్‌లో ఫస్ట్ గెస్టుగ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రావడం విశేషంగా మారింది. దాంతో మూడో సీజన్‌ను బంపర్ ఎపిసోడ్‌తో ఆరంభించాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది.
అయితే టాప్ కామెడీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కపిల్ శర్మ రెమ్యునరేషన్ జాతీయ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించినందుకు గాను మూడు సీజన్లకు కలిపి మొత్తంగా 195 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను సొంతం చేసుకొన్నాడనేది తాజా నేషనల్ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. అయితే ఆయన ప్రతీ ఎపిసోడ్‌కు సుమారుగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకొంటాడని తెలిసింది.
కపిల్ శర్మ కెరీర్ విషయానికి వస్తే.. 2006 నుంచి ఇప్పటి వరకు 20కి పైగా టెలివిజన్ షోలలో స్టాండప్ కమెడియన్‌గా, హోస్టుగా వ్యవహరించాడు. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మొత్తం 9 సినిమాల్లో నటించాడు. అందులో రెండు సినిమాలు హీరోగా నటించడం తెలిసిందే. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరూం 2, దాది కి షాదీ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోను గ్రాండ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాడు.


Click it and Unblock the Notifications











