ప్రియురాలిని పెళ్లాడిన స్టార్ కమెడియన్ (ఫోటోస్)
టెలివిజన్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ఎట్టకేలకు తన ప్రియురాలిని పెళ్లాడారు. గత కొంతకాలంగా గిన్ని ఛాత్రత్ అనే అమ్మాయితో కపిల్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. డిసెంబర్ 12న పంజాబీ సాంప్రదాయంలో జంలంధర్‌లో వీరి వివాహం జరిగింది.
తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ కపిల్ శర్మ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి దిగిన ఫోటో అభిమానులతో పంచుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ప్రైవేట్ సెర్మనీగా ఈ వేడుక జరిగింది.
కపిల్ శర్మ
పెళ్లి వేడుక ముగిసిన అనంతరం కపిల్ ఈ పిక్ పోస్ట్ చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వేలాది మంది అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు.

రెండు వెడ్డింగ్ రిసెప్షన్స్
పెళ్లి అనంతరం రెండు వెడ్డింగ్ రిసెప్షన్స్ జరుగబోతున్నట్లు తెలుస్తోంది. అమృత్‌సర్‌లో డిసెంబర్ 14న జరిగే వేడుకకు ఫ్యామిలీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ హాజరు కాబోతున్నారు. సినీ, టీవీ రంగాలకు చెందిన ప్రముఖులకు డిసెంబర్ 24న ముంబైలో విందు ఏర్పాటు చేయనున్నారు.

వివాదాలు
కొన్ని వివాదాల కారణంగా కపిల్ శర్మ టీవీ కామెడీ షో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. డిప్రెషన్ కారణంగా కొంతకాలం పాటు అమెరికాలో గడిపిన అతడు ఇపుడు అంతా సెట్టవ్వడంతో ప్రియురాలి పెళ్లాడి కొత్త జీవితం మొదలు పెట్టాడు.

రీ ఎంట్రీ
పెళ్లి తర్వాత మళ్లీ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన సత్తా చాటేందుకు కపిల్ శర్మ సిద్ధమవుతున్నాడు. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించేందు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది వచ్చిన ‘ఫిరంగి' అనే చిత్రంలో కపిల్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











