Naga Panchami 17th February: పంచమి, ఫణీంద్రలకు అక్రమ సంబంధం.. యువరాణిపై గరుడ దాడి!

Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సీరియల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను అద్భుతంగా మలుస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో పంచమి కరాళీకి వార్నింగ్ ఇచ్చేందుకు నంబూద్రీ ఆశ్రమానికి వెళ్తుంది. అక్కడ చాలా సేపు కరాళీ గురించి వెతుకుతుంది. కానీ ఆమె జాడ మాత్రం దొరకదు. దీంతో పంచమి.. మరింత కోపంగా కరాళీ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అంటూ అరుస్తుంది.

దమ్ముంటే నా ముందకు రా అంటూ పంచమి చెబుతుంది. కానీ అక్కడ లేని కరాళీ తన చేతిలో అంజరం వేసుకుని చూస్తుంది. పంచమి అలా మాట్లాడుతుండడం విని తన మంత్ర శక్తితో గరుడను పంచమిపైకి వదులుతుంది. అలా గరుడ పంచమి వద్దకు వస్తుంది. అప్పటికే చాలా సేపు పిలిచినా కరాళీ కనిపించకపోయే సరికి పంచమి ఇంటికి వెళ్లిపోవాలని వస్తుంది. అయితే అంతలోనే గరుడ అక్కడకు వచ్చి పంచమిపై దాడి చేస్తుంది. పంచమి తప్పించుకునే ప్రయత్నం చేసినా గరుడ మీద మీదకు వస్తూనే ఉంటుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ అయిపోయింది.

Karali Attack on Panchami on Naga Panchami February 17th Episode

ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. అప్పుడే మెలుకువ వచ్చిన మోక్ష పంచమి వద్దకు వస్తాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను చూసి మీరంతా ఇక్కడకు ఎందుకు వచ్చారని అడుగుతాడు. ఏదో చప్పుడు అయితే వచ్చామని మీనాక్షి చెప్పగా.. అంతా వెళ్లిపోతారు. ఇక ఫణీంద్ర కూడా బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత పంచమి.. ఫణీంద్రే మిమ్మల్ని కాపాడాడు అని చెబుతుంది. నాతో జీవితం ఇలా చాలా ప్రమాదకరంగా ఉంటుందని.. ముద్దు పెట్టుకుంటేనే ప్రాణాల మీదకు వచ్చిందని వివరిస్తుంది. ఇక జాగ్రత్తగా ఉంటానని మోక్ష అంటాడు.

జీవితాంతం అలా ఉండడం కష్టం మోక్ష బాబు అని పంచమి అనగా.. ఎప్పుడో వచ్చే ప్రమాదం గురించి నేను భయపడను అంటాడు. పంచమి మాత్రం.. మిమ్మల్ని కాపాడేందుకు ఫణీంద్రను తీసుకు వచ్చేందుకు వెళ్తే.. అంతే తప్పుగా అనుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత మేఘన తన అన్నయ్య ఆత్మను ఆవాహనం చేసుకుంటుంది. తనను మహాంకాళి మోసం చేసిందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాను మోక్షను బలి ఇచ్చిన శక్తులు ఇవ్వనని తెగేసి చెప్పిందని వివరిస్తుంది. అదంతా విన్న నంబూద్రీ మోక్షను పెళ్లి చేసుకుని హాయిగా ఉండమని చెబుతాడు.

Karali Attack on Panchami on Naga Panchami February 17th Episode

కానీ కరాళీ మాత్రం మహాంకాళిని వదలను.. మళ్లీ ఆవాహనం చేసుకుని శక్తులు పొందాతానని అంటుంది. అలాగే నాగమణిని పొందే వరకు తాను వెనకడుగు వేయనని వివరిస్తుంది. అయితే మేఘన మాటలు వినిపించడంతో అటుగా వెళ్తున్న పంచమి.. మోక్ష గదిలోకి వెళ్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావని అడగ్గా... అదేం లేదంటూ మేఘన సర్ది చెబుతుంది. ఆ తర్వాత చిత్ర, జ్వాలలు పంచమి పాము అంటూ రచ్చ రచ్చ చేస్తారు. పంచమి స్నేహితుడు పాము అయినప్పుడు పంచమి కూడా పామే అని వివరిస్తాడు.

పంచమికి, ఫణీంద్రకు అక్రమ సంబంధం అంటకట్టగా.. మోక్ష జ్వాల పీక పట్టుకుంటాడు. జ్వాల భర్త వచ్చి వదిలిస్తాడు. ఇలా చేయడం తప్పని చెప్పగా.. నీ భార్య మాట్లాడే మాటలు మరీ దారుణంగా ఉన్నాయని వివరిస్తాడు. మరోసారి తన భార్యను ఎవరైనా పాము అంటే ఊరుకోనని... ఆమె పాముగా ఉన్నప్పుడు చూస్తే వెంటనే పిలిచి చెప్పాలని అన్నాడు. ఇలాగే పాము, మనిషిగా మారుతున్న వ్యక్తిని కూడా అలాగే చూపించాలంటూ చెబుతాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X