Naga Panchami 27th February: పంచమి చుట్టూ మంటలు.. కాపాడేందుకు ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డ మోక్ష!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా కరాళీ పంచమి అడ్డు తొలగించుకునేందుకు అనేక ఎత్తులు వేస్తోంది. తాజాగా తన బానిసలు అయిన దుష్ట శక్తులు.. కంత్రీ, తంత్రీల సాయం తీసుకుని మరీ పంచమికి చుక్కలు చూపిస్తోంది. ఆమెకు అడుగడుగునా సమస్యలు ఏర్పరుస్తూ.. తనలో తాను నవ్వుకుంటోంది. ముఖ్యంగా పంచమి, మోక్షలు బయట నుంచి వచ్చి కారు దిగే ప్రయత్నం చేశారు. మోక్ష బాగానే దిగి బయటకు వెళ్లగా.. కంత్రీ, తంత్రీలు నిప్పులు వదిలారు.
కారు డోర్ బయట మొత్తం నిప్పులు ఏర్పడగా... పంచమి కారు దిగిలేక నానా అవస్థలు పడింది. అదంతా గుర్తించిన మోక్ష అక్కడకు వచ్చి ఏం జరిగింది పంచమి కారు దిగు అనగా.. మంటలు మోక్ష బాబు నేను దిగలేనంటూ చెబుతుంది. భయంతో గజగజా వణికిపోగా... మోక్షనే తన చేతులతో ఎత్తుకుని తీసుకు వచ్చాడు. అయితే ఇంట్లోకి రాగానే వైదేహి చూసి ఫైర్ అవుతుంది. ఈ పిచ్చి పనులు ఏంటని అడుగుతుంది. కానీ పంచమి మాత్రం నన్ను దింపొద్దు మోక్ష బాబు.. ఆ రాక్షసులు ఇక్కడే ఉన్నారంటూ చెబుతుంది.

శబరి సహా అంతా చాలా భయపడిపోతుండగా.. తనను గదిలోకి తీసుకు వెళ్లబోతాడు మోక్ష.కానీ అంతలోనే కంత్రీ, తంత్రీలు మోక్ష కాళ్లకు సంకెళ్లు వేస్తారు. దీంతో మోక్ష పంచమిని ఎత్తేసి మరీ బొక్కబోర్లా పడతాడు. ఇదంతా చూసిన కుటుంబ సభ్యులు భయంతో మరింత వణికిపోతారు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగగా.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా పంచమి, మోక్షలు కార్లో వెళ్తుండగా.. కారు ఆపమని కరాళీ అంతు తేలుస్తానని పంచమి అంటుంది.
ఇదంతా విన్న మోక్ష అవసరం లేదని.. తను నా జోలికి రాకూడదు అంటే మనమిద్దరం కలవాలి అంతే.. ఆ దిశగానే నేను ప్రయత్నాలు చేస్తున్నానని చెబుతాడు. ఆ తర్వాత పంచమిని తీసుకుని శాస్త్రవేత్తల వద్దకు వెళ్తాడు. పంచమికి బ్లడ్ టెస్ట్ చేయించి తన శరీరంలోని విషం.. మోక్ష శరీరంలోని రక్తంతో కలిస్తే ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా.. విషానికి విరుగుడు తయారు చేయవచ్చా అని అడుగుతాడు. శాస్త్రవేత్తలు చేయొచ్చని చెప్పగానే.. ఆ దిశగా ఏర్పాట్లు చేయమని చెప్పి థాంక్స్ చెబుతాడు మోక్ష. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు.
అంతకు ముందే మోఘన మహాంకాళి అమ్మవారి విగ్రహం ఉన్న ఆశ్రమానికి వస్తుంది. అక్కడకు వచ్చి పూజకు పూనుకుంటుంది. ముఖ్యంగా కరాళీలా మారిపోయి తన శక్తులతో కంత్రీ, తంత్రీలను పిలుస్తుంది. పంచమిని ముప్పు తిప్పలు పెట్టేందుకు మిమ్మల్ని రప్పించానని అంటుంది. ఆమెపై పగ తీర్చుకోవాలని చెబుతుంది. ఆ తర్వాత నంబూద్రీ ఆత్మ జ్వాలలోకి ప్రవేశిస్తుంది. అక్కడే పాములా మారి పడుకున్న ఫణీంద్ర వద్దకు వెళ్తుంది. ఫణీంద్ర లే.. నువ్వేనని నాకు తెలుసు అంటూ చెప్పగానే ఫణీంద్ర మనిషి రూపంలోకి మారతాడు.

ఆ తర్వాత నీకు భూలోకం నచ్చినట్లుంది.. ఇక్కడే ఉండిపోయేలా ఉన్నావు కదా అంటూ నంబూద్రీ అడగ్గా.. అదేమీ లేదంటూ పంచమిని తీసుకుని నాగలోకం వెళ్తానంటే మోక్ష అడ్డు పడుతున్నాడని వివరిస్తాడు. అతడిని చంపి అయినా సరే పంచమిని నాగలోకం తీసుకెళ్తానని వివరిస్తాడు. కానీ నంబూద్రీ మాత్రం మోక్షను నువ్వు చంపేస్తే పంచమి నీతో రాదంటూ చెబుతాడు. దానికి ఫణీంద్ర.. పంచమిని ఎలా నాగలోకం తీసుకు వెళ్లాలో నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకొస్తాడు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











