Naga Panchami 16th January: ఫణీంద్రకు గట్టి షాకిచ్చిన కరాళీ.. పంచమి మోక్షను కాపాడగలదా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. గత మూడు రోజుల నుంచి ఈ సీరియల్ లో విపరీతమైన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా పంచమి పాముగా మారి మోక్షను కాటు వేసింది. అయితే నాగలోకం వెళ్లేందుకు ఫణీంద్రను మంత్రం చెప్పాలని అడిగింది. అప్పుడే చెప్పాను కదా.. మళ్లీ ఇప్పుడు చెప్పడం ఏంటని ఫణీంద్ర అడిగాడు. దీంతో పంచమితో పాటు నాగ సాధువు, ఫణీంద్రలు కూడా షాక్ అయ్యారు. అయితే తన దగ్గర నుంచి మంత్రం తెలుసుకున్నది ఎవరా అని ఆలోచనలో పడ్డాడు. మరోవైపు మోక్ష నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఈసారి భర్తను పంచమి కాపాడుకోగలదా లేదా అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా పంచమి, మోక్షలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. నాకు మా వాళ్లతో మాట్లాడాలని ఉందంటూ పంచమితో చెప్పగానే... పంచమి అయితే ఫోన్ చేయండి మోక్ష బాబు అంటుంది. అలా వెంటనే ఫోన్ తీసుకుని వెంటనే ఫోన్ చేస్తాడు. అది గమనించిన మోక్ష తండ్రి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. కుటుంబ సభ్యులు అంతా హాల్లోని ఉండగా.. అంతా దగ్గరకు వచ్చి మోక్షను చూస్తారు. వెంటనే ఇంటికి వచ్చెయ్ మోక్ష నిన్ను చూడాలనిపిస్తోందని అంటారు. నాకు కూడా రావాలనే ఉందని.. నేను వచ్చినా మీరు నాతో ఏం మాట్లాడలేరని.. అప్పుడు నాకు ఏ కష్టాలు ఉండవని అంటాడు. ఆ తర్వాత ఫోన్ శబరికి ఇవ్వమని చెబుతాడు.

Karali Gains The Spell From The Phanindra to Enter Nagalokam on Naga Panchami January 16th Episode

వెంటనే శబరి మాట్లాడుతూ.. మనవడా నువ్వు మా కళ్ల ముందే ఉండాలని.. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని వెంటనే వచ్చేయమని అంటుంది. కనిపిస్తే గుర్తుంటానా లేకపోతే మర్చిపోతావా అంటూ మోక్ష అడగ్గా... వెంటనే అతడి అత్త ఫోన్ తీసుకుని ఇంటికి తొందరగా వచ్చేయమని చెబుతుంది. నీమీద, పంచమి మీద అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారని అంటుంది. మీరు వస్తే కానీ మా అనుమానాలు తీరవని వివరిస్తుంది. ఆ తర్వాత మోక్ష తన వదినలు అయిన జ్వాల, చిత్రలతో కూడా మాట్లాడతాడు. ఎళా ఉన్నారని అడిగిన తర్వాత మీ అనుమానాలతో మా అన్నయ్యల తల తినకంటూ సూచిస్తాడు. ఇలా అందరతో మాట్లాడిన వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు.

ఇక ఓ దగ్గగ ఫణీంద్ర ఒంటరిగా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంచాడు. అది గమనించిన కరాళీ.. పంచమి రూపంలోకి మారి అతడి వద్దకు వస్తుంది. ఆమెను చూసి పంచమియే అనుకున్న ఫణీంద్ర.. నాగ సాధువు ఏమైనా మూళికలు తీసుకు వచ్చారా యువరాణి అని అడుగుతాడు. ఏవో కొన్ని తెచ్చాడని పైకి చెబుతూనే.. లోలోపల ఫణీంద్ర నన్ను గుర్తు పట్టలే అనుకుంటూ మురిసిపోతుంది. ఏదో మంత్రం చెబుతానన్నారుగా దానితో నేరుగా నాగలోకం వెళ్లవచ్చా అని అడుగుతుంది. ఎందుకు యువరాణి అనుమానం కచ్చితంగా వెళ్లొచ్చని ఫణీంద్ర అంటాడు.

అయితే ఆ మంత్రం ఏదో ఇప్పుడే చెప్పేయండని అని అనగానే.. ఫణీంద్ర నాపై నమ్మకం లేదా.. కాటేసిన తర్వాత చెబుతానో లేదోనని భయమా అని అడుగుతాడు. అలా ఏం కాదు కానీ చెప్పమని అంటుంది. సరే అనుకున్న ఫణీంద్ర చెవిలో చెబుతాను.. ఆ మంత్రం మనసులో అనుకోండి కానీ బయటకు అనవద్దని వివరిస్తాడు. అలా ఆమె చెవిలో మంత్రం చెబుతాడు. ఇది ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చని అంటాడు. అలా మంత్రం తెలుసుకున్న కరాళీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత పంచమి, నాగ సాధువు, మోక్షలను చూపిస్తారు.

Karali Gains The Spell From The Phanindra to Enter Nagalokam on Naga Panchami January 16th Episode

నాగ సాధువు వచ్చి కొన్న మూళికలు తీసుకు వచ్చానని అంటాడు. అప్పుడే అక్కడకు ఫణీంద్ర వస్తాడు. కాటేయడానికి ముందు ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా లేదా అని అడగ్గా.. అస్సలే నిద్ర పోవద్దు.. బాధతో గట్టిగా అరుస్తూ శరీరాన్ని అటూ ఇటూ కదిలిస్తే విషయం త్వరగా తలకు ఎక్కుతుందని చెబుతాడు. అలా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నొప్పిని తగ్గించే మూళికలు రాయాలని అంటాడు. అంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో పంచమి కాటేయడం చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X