Naga Panchami: కరాళీకి కలిసొచ్చిన మోక్ష బ్రహ్మచర్యం.. తప్పించుకొని పంచమితో ఒక్కటవుతాడా!

నాగ పంచమి సీరియల్ అద్భుతంగా సాగుతూ సినిమాల్లో ఉన్నన్ని ట్విస్టులు ఇస్తూ.. సీరియల్ ను చాలా రసవత్తరంగా మారుస్తున్నారు. రోజుకో ట్విస్ట్ ఇస్తూ.. బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ముఖ్యంగా పంచమియే పాము అని.. ఆమె వల్లే తన ప్రాణాలు పోతాయి తెలుసుకున్న మోక్ష చావు గురించి ఏమాత్రం భయపడడం లేదు. కేవలం ఆమె సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తూ.. పిల్లలు పుడితే ఆమె పాములా మారదని.. అందుకోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువరాజు ఫణీంద్ర... ఇంటికి సోది చెప్పేవాడిలా వచ్చి కుటుంబ సభ్యులందరినీ భయపెట్టడం నిన్నటి ఎపిసోడ్ లో చూశాం.

అతడు చెప్పిన మాటలు వింటూనే కుటుంబ సభ్యులు అంతా చాలా భయపడడంతో ఈరోజుటి ఎపిసోడ్ ప్రారంభం అయింది. ముఖ్యంగా చిత్ర, జ్వాలలు అతడు చెప్పింది నిజమని.. పంచమిని ఇంట్లోంచి పంపించేయడమే మంచిందంటూ చెప్పుకొచ్చారు. ముందునుంచి తాము పంచమి పాము అంటుంటే ఎవరూ వినట్లేదని అన్నారు. జ్వాలకు పిల్లలు లేరని, చిత్రకు ఓ కూతురు ఉందని నిజం చెప్పిన అతను మోక్ష గురించి కూడా నిజమే చెప్పాడని వాదించారు. కుటుంబ సభ్యులు కూడా అది నిజమే అని అనుకుంటుండగా.. మోక్ష మాత్రం అందుకు అంగీకరించలేదు. ఎవరో ఏదో చెబితే తన జీవితంలో సుఖం లేకుండా చేసుకోవడం సరికాదని అన్నాడు.

Karali Implores Mahakali For Get Special Powers on November 23rd Episode Number 208 in Naga Panchami Telugu Serial

పంచమిని వదిలే ప్రసక్తే లేదని.. కుటుంబ సభ్యులు అంతా అలాగే ఉంటే తాను ఇంట్లోంచి వెళ్లిపోతానని వివరించాడు. ముఖ్యంగా తన వల్ల ఇంట్లో వాళ్లందరికీ ప్రాణగండం ఉందంటే తనను ఇంట్లో నుంచి వెళ్లగొడతారా అంటూ ప్రశ్నించాడు. తాను బతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలనుకుంటున్నానని.. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలని సూచించాడు. ఇలా అంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోతారు. శబరి, మోక్ష తల్లి మాత్రం భయపడుతూనే ఉంటారు.

మరోవైపు కరాళీ మహాకాళిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తూ కనిపిస్తుంది. ఈక్రమంలోనే మహాకాళిని పిలుస్తుంది. అప్పుడే అమ్మవారి విగ్రహం రాగా... చిన్నగా ఉన్న అది పెద్దగా అవుతుంది. తన శక్తులు తిరిగి వచ్చేలా చేయమని కరాళీ వేడుకుంటుంది. కానీ అది కుదరదని మహాకాళి చెబుతుంది. ఈక్రమంలోనే కరాళీ మరోసారి వేడుకోగా.. తాను శక్తులు ఇవ్వలేను కానీ.. పెళ్లి అయి బ్రహ్మచారిగా ఉన్న మోక్షను తన వశం చేసుకుంటే చాలా శక్తులు వస్తాయని చెబుతుంది. పెళ్లయ్యాక కూడా బ్రహ్మచారిగా ఉంటే కొన్ని శక్తులు ఏర్పడతాయని.. అతడి నుంచి నువ్వు ఆ శక్తులు పొందవచ్చని చెబుతుంది. వాటి వల్ల పంచమిని ఎదురుకోవచ్చే తప్ప నాగమణిని సంపాధించలేవని వివరిస్తుంది.

Karali Implores Mahakali For Get Special Powers on November 23rd Episode Number 208 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా డల్ గా కూర్చొని కనిపిస్తారు. అప్పుడే హాల్లోకి వచ్చిన మోక్ష వారిని చూసి చాలా ఫైర్ అవుతాడు. తాను చనిపోతాడని అలా ఉంటున్నారని.. కానీ బతికినన్ని రోజులు తనను సంతోషంగా ఉంచలేకపోతున్నారని చాలా బాధ పడతాడు. ఈక్రమంలోనే పంచమిని చాలా గట్టిగా పిలుస్తాడు. దీంతో పంచమితో పాటు ఇంట్లో వాళ్లంతా వచ్చేస్తారు. పంచమి రాగానే బట్టలు సర్దుకో మనం ఇంట్లోంచి వెళ్లిపోదాం అంటూ అరుస్తాడు. మనం ఇక్కడ ఉంటే వీరెవరికీ నచ్చట్లేదని.. ఇలా బాధగా ఉంటూ మనల్ని బాధ పెడతారని అంటాడు.

బతికినంత కాలం సంతోషంగా ఉండాలనుకుంటున్నానని మోక్ష అనగా... జ్వాలా వస్తుంది. సరే మోక్ష నీకోసం ఈరోజుటి నుంచి మేమంతా చాలా సంతోషంగా ఉంటామని చెబుతుంది. ఈక్రమంలోనే వారి పెళ్లి రోజు సందర్భంగా... ఒక బౌల్ లో చీటీలు రాసి పెడతానని... ఎవరు తీసిన చీటీలో ఉన్నది వాళ్లు చేయాలని చెబుతుంది. ఇలా పాటలు రాసి పెట్టిన బౌల్ లోంచి మోక్ష తండ్రి ఓ చీటీ తీస్తాడు. ఓ పాటకు డ్యాన్స్ చేస్తాడు. కానీ మోక్ష మాత్రం కోపంగానే ఉంటాడు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది. అయితే రేపటి ఎపిసోడ్ లో మాత్రం.. జ్వాల పంచమికి నాగిని డ్యాన్స్ వేయాలని చీటీలో అదే ఉందని చెబుతుంది. దీంతో పంచమి నాగిని డ్యాన్స్ వేస్తుంది. చాలా కోపంగా కనిపిస్తూ.. ఆమె అలా చేసే సరికి అంతా ఆశ్చర్యపోతారు. సుబ్బు మాత్రం నవ్వుతూ కనిపిస్తాడు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X