Naga Panchami: కరాళీ మాయలో ఫణీంద్ర.. అలా చేస్తే పంచమి కచ్చితంగా నాగలోకానికి వెళ్తందట!

Naga Panchami December 20th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోరుజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ట్విస్టులతో సీరియల్ ను రక్తి కట్టిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాణాలు కాపాడుకున్న మోక్షను చంపేందుకు, పంచమిని నాగలోకానికి తీసుకెళ్లేందుకు ప్లాన్ ల మీద ప్లాన్ లు వేస్తూనే ఉన్నారు. అయితే రూపం మార్చుకున్న కరాళీ.. నాగ కన్యను అని చెబుతూ ఫణీంద్రను నమ్మించింది. తన ఆశ్రమానికి తీసుకెళ్లి మరీ అనేక విషయాలు చెబుతుంది. ముఖ్యంగా మోక్షను కాటేసిన తర్వాత బతికిస్తానని హామీ ఇచ్చి నాగలోకానికి తీసుకెళ్లమంటూ వివరిస్తుంది. అందుకు యువరాజు ఫణీంద్ర కూడా ఆలోచనలో పడ్డాడు.

మరోవైపు నాగమణితో పాములు కాటేసినప్పిటికీ భర్త మోక్షను బతికించుకోవచ్చు అని తెలుసుకున్న పంచమి.. అదే విషయాన్ని మోక్షకు చెబుతుంది. ఏంటి.. నిజంగామే నాగమణితో మనిషి ప్రాణాలు కాపాడచ్చా అంటూ మోక్ష అడుగుతాడు. నాగమణికి చాలా శక్తులు ఉన్నాయని తెలుసు కానీ ప్రాణాలు కూడా కాపాడవచ్చని మాత్రం ఈరోజే తెలుసకన్నాను అంటూ భర్త మోక్షతో చెబుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగంది అనేది మాత్రం రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

Karali Offers to Help Phanindra Take Panchami to Naga Lokam on December 20th Episode Number 231 in Naga Panchami Telugu Serial

ఇక నిన్నటి ఎపిసోడ్ లో చిత్ర, జ్వాలలు మోహిని బ్యాగు సర్దేందుకు వెళ్లి అక్కడ పూజలు చేసిన వాటిని చూసి భయపడిపోతారు. ఆమె కూడా మంత్రగత్తె అని తెలుసుకుని షాకవుతారు. ఆపై డోర్ వేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత పంచమి గుడికి వెళ్లడం.. దర్శనం చేసుకోవడం కనిపిస్తుంది. అక్కడికే కరాళీతో పాటు ఫణీంద్ర కూడా వస్తాడు. మహా మృత్యుంజయ యాగం చేయించి చాలా తప్పు చేశావు అంటూ ఫణీంద్ర పంచమిపై ఫైర్ అవుతాడు. నా భర్తను నేనే క్షమించినప్పుడు మీకేంటి బాధ ఎందుకు అలా చంపాలి అనుకుంటున్నారు అంటూ పంచమి యువరాజును అడుగుతుంది. చనిపోయింది మీ తల్లే అయినా నాగలోకపు యువరాణి... ఆమె పగ మా పగ ఒక్కటే అంటూ అంటాడు.

ఇష్టరూప నాగ జాతి ఒక్కసారి పగ బట్టిందంటే ప్రాణాలు తీసే వరకు ఆగదు అంటూ మరోసారి వివరిస్తాడు. అయినా ఇక నువ్వు నాగ లోకానికి రావాల్సిన అవసరం లేదని.. ముక్కోటి ఎకాదశి రోజా నేనే ప్రాణాలు తీస్తానని అంటాడు. నువ్వు కాపాడే అవకాశం కూడా లేదని చెప్పగా.. ఏం చేస్తే నా భర్తను వదిలేస్తారంటూ అడుగుతుంది. ఏం చేసినా అతడిని కాపాడలేవు.. ఒక్క నాగమణి మాత్రమే ఇష్టరూప జాతి నాగు కాసేటిన తర్వాత కాపాడవచ్చని అంటాడు. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లిపోతారు. ఇదంతా విన్న కరాళీ... పాముగా మారి వెళ్తున్న ఫణీంద్రను అడ్డుకుంటుంది.

Karali Offers to Help Phanindra Take Panchami to Naga Lokam on December 20th Episode Number 231 in Naga Panchami Telugu Serial

తన మంత్రశక్తితో బంధించి... ఆ తర్వాత అతడిని కాపాడుతుంది. తాను నాగ కన్యను అని.. అయితే నాగరాణితో వచ్చి నాగ దేవత కోపానికి బలై ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెబుతుంది. మాయ మాటలు చెప్పి నమ్మించి ఫణీంద్రను తన ఆశ్రమానికి తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత మోక్ష తల్లి అతడిని పిలుస్తూ కనిపిస్తుంది. మహా మృత్యుంజయ యాగంతో నీ గండాలన్నీ తొలగిపోయాయి అనగానే.. అలా అని నీకెవరు చెప్పారమ్మా అంటూ మోక్ష అడుగుతాడు. అప్పడే పంచమి రాగా.. మీరిద్దరూ ఈరోజు నుంచి హాయిగా కాపురం చేసుకోవచ్చని అంటుంది.

నెల రోజుల తిరిగే సరికి నాకు శుభవార్త చెప్పాలంటూ చెప్పుకొస్తుంది. ఇదంతా విన్న చిత్ర, జ్వాలలు గొడవ చేస్తారు. మోక్షతో పంచమి కలిస్తే.. ప్రాణాలు పోతాయంటూ వివరిస్తుంది. మీరు ఎందుకు కలవట్లేదో నిజం చెప్పేయండి మోక్ష.. అది నిజం అయితే మోక్షకు వేరే పెళ్లి చేసేస్తుందంటూ కామెంట్లు చేస్తారు. ఆ తర్వాత శబరి పైర్ అవుతుంది. పెళ్లంటే బొమ్మాలట కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలా ఈరోజుటితో సీరియల్ అయిపోతింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X