Naga Panchami 19th January: బెడిసికొట్టిన కరాళీ ప్లాన్.. చంద్రకాంత మొక్కతో పరార్.. ప్రాణాపాయ స్థితిలో మోక్ష!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టులు చోటు చేసుకుంటుండగా.. తాజాగా మరో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా పంచమియే నాగలోకం వెళ్తుందని అంతా అనుకోగా.. అలా జరగలేదు. పంచమి రూపంలోకి మారిన కరాళీ ఫణీంద్ర నుంచి మంత్రం చెప్పించుకుని నాగలోకం వెళ్లింది. అక్కడి నుంచి ఇక నాగమణి కొట్టేస్తుందని అనుకోగా.. అలా జరగలేదు. ఇలా ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ లు ఇస్తూ సీరియల్ ను మరింత రక్తి కట్టిస్తున్నారు.
మరోవైపు పాముగా మారిన పంచమి మోక్షను కాటేయగా.. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదని భావించిన నాగ సాధువు ఆ విషయం చెబుతాడు. అల్లుడికి పాము కరిచిన విషయం తెలుసుకున్న పంచమి తల్లి.. అక్కడకు వెళ్తుంది. ఏడుస్తూనే... ఈ విషయాన్ని మోక్ష తల్లిదండ్రులకు చెబుతానని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన వెంటనే వైదేహి ఫోన్ లేపుతుంది. అయితే మోక్ష ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. పాము కరిచిందని పంచమి తల్లి చెబుతుంది. దీంతో వెంటనే వైదేహి పాము కరిచిందా అంటూ కళ్లు తురిగి పడిపోతుంది. మరోవైపు శబరి కూడా పడిపోతుంది.

ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా కరాళీని చూపిస్తారు. పంచమి రూపంలోకి మారి నాగలోకం వెళ్లిన ఆమె నాగమణిని తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఐదు తలల పాము బుసలు కొట్టడంతో భయంతో వెనక్కి వచ్చేస్తుంది. ఇలా చాలా సార్లు ప్రయత్నించి.. ఇక లాభం లేదనుకుని బయటకు వచ్చేస్తుంది. అలా నాగలోకంలో తిరుగుతుండగా.. నీటి కొలను కనిపిస్తుంది. వెంటనే అందులోకి వెళ్లి చంద్రకాంత మొక్కను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. విపరీతంగా మెరుస్తూ కనిపించగా..అదే చంద్రకాంత మొక్క అని భావించి మొక్కను భూమిలోంచి పెకిలిస్తుంది.
ఆ మొక్కను చేతిలోకి తీసుకోగానే.. నిప్పు కణికలు ఆమెపై పడుతూ ఉంటాయి. వెంటనే దాన్ని కింద పెట్టేసి ఓ మంత్రం చదువుతుంది. మళ్లీ ఆ మొక్కను చేతుల్లోకి తీసుకోగా.. ఎలాంటి నిప్పు కణికలు రావు. అలా బయటకు వచ్చేసిన ఆమెకు ఓ పాము కనిపిస్తుంది. దీంతో భయపడిపన ఆమె చూసేలోపే నాగకన్యగా మారిపోతుంది. యువరాణీ మీరెప్పుడు వచ్చారంటూ అడుగుతుంది. మీ రాక నాగదేవతకు తెలియదా అంటూ అడుగుతుంది. పదండి నాగదేవత వద్దకు వెళ్దామని అనగానే.. వద్దు నువ్వెళ్లిపో అంటుంది. అప్పుడే పంచమి రూపంలో ఉన్న కరాళీ చేతుల్లో ఉన్న నాగచంద్రకాంత మొక్కను చూసి ఇదేంటి.. మీకు ఇదెందుకు అని అడుగుతుంది.
దీంతో తీవ్రంగా భయపడిపోయిన కరాళీ మరోసారి మంత్రం చదివి నాగలోకం నుంచి పారిపోతుంది. మరోవైపు మోక్షను కాపాడుకోవడానికి పంచమి, నాగ సాధువు, ఫణీంద్రలు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఫణీంద్ర విషయం లాగేసి.. అనేక పసర్లు పూస్తూనే ఉన్నారు. అయితే మోక్షను పాము కరిచిందన్న విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలని.. నాగ సాధువు వివరిస్తాడు. ఫణీంద్ర తన రూపాన్ని సాధారణ మనిషిలాగా మార్చుకుంటానని.. వెళ్లి వస్తాడు. ఆలోపు పంచమి తన తల్లికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. ఇక ఆ తర్వాత మోక్ష తల్లిదండ్రులకు చెబుతారు.


Click it and Unblock the Notifications











