Naga Panchami: పంచమి చేతికి ఇంటి పెత్తనం, గొడవలు పెట్టేందుకు కరాళీ ప్లాన్.. మరోవైపు కోపంగా యువరాజు!

Naga Panchami November 14th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతుంది. అదిరిపోయే టీఆర్పీతో దుమ్మురేపుతున్న ఈ సీరియల్ అదిరిపోయే ట్విస్టులతో సాగుతోంది. ఎవరూ ఊహించని రీతిలో సాగుతున్న ఈ సీరియల్ లో తాజాగా అదిరిపోయే ట్విస్టు చోటు చేసుకుంది. ముందుగా మోక్ష పంచమిని దగ్గరకు తీసుకోవడం చూపించారు. నా ప్రాణం ఉన్నంత వరకూ నీతోనే ఉండాలంటూ మోక్ష చెప్పుకొస్తాడు. అలాగే సుబ్బు చెప్పిన మాటల వల్లే తనకు ధైర్యం వచ్చిందని.. ప్రాణంగా ప్రేమించే పంచమని దగ్గరకు తీసుకోగల్గుతున్నానని మనసులో అనుకుంటాడు. ఇందుకు సుబ్బుకు మనసులోనే థాంక్స్ చెప్పుకుంటాడు.

మేఘాల్లా కమ్ముకున్న చీకటి అంతా వర్షం రూపంలో కరిగిపోయి తొలగిపోయిందని మోక్ష పంచమికి చెప్తాడు. ఆమె కూడా తన ప్రమను మోక్షకు వివరిస్తుంది. ఇది కాగానే కరాళీని చూపిస్తారు. ఏదో ఒక పూజ చేసిన నంబూద్రీ శిష్యులను పిలుస్తుంది. జైజై నాయకీ, జై కరాళీ అంటూ నానా హంగామా చేస్తారు. ఈక్రమంలోనే కరాళీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలా తన గురించి మాట్లాడాకుండా.. తనకు మిగిలిన ఈ ఇద్దరిని తాను చేయాలనుకున్న పనుల కోసం వాడుకోవాలని అనుకుంటుంది. అదే విషయాన్ని వారికి చెబుతుంది. అయినప్పటికీ వాళ్లు గొడవ చేస్తారు. దీంతో ఫైర్ అయిన కరాళీ ఓ శక్తిని రప్పించగా క్షమించమని అడుగుతారు. తీవ్రంగా భయపడిపోతూనే మేమేం చేయాలో చెప్పండి అని అంటారు.

Karali Plans to Create Problems in Moksha House on November 14th Episode Number 200th in Naga Panchami Telugu Serial

ఈక్రమంలోనే ఎలాగైనా సరే వెళ్లి మోక్ష ఇంట్లో సమస్యలు సృష్టించాలని.. అలాగే అవి పంచమి వల్లే జరిగాయని వారందరూ నమ్మేలా చేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. సరే అని చెప్పిన ఆ ఇద్దరు భటులు ఇంటికి వెళ్తారు. ఇదిలా ఉండగా పంచమి దేవుడికి పూజ చేస్తూ కనిపిస్తుంది. ఇంట్లోని పూజ గదిలో పూజ చేసి, హారతి ఇస్తుంది. అప్పుడే అక్కడకు మోక్ష కూడా వస్తాడు. ఏం కోరుకున్నావు పంచమి అనగా తన పసుపు కుంకుమలు బాగుండాలని కోరుకున్నట్లు చెబుతుంది. మరి నేనేం కోరుకోవాలి అని మోక్ష అడగ్గా... మీ భార్యను పసుపు కుంకుమలతో చూడాలని కోరుకొమ్మని అంటుంది. ఇంతలోనే మోక్ష తల్లి పంచమిని పిలుస్తుంది.

పంచమిని భయపడుతూనే ఆమె వద్దకు వెళ్తుంది. ఇంతలోనే కుటుంబ సభ్యులు అంతా అక్కడకు వస్తారు. మోక్ష.. ఏంటమ్మా పంచమిని పిలిచావు చెప్పు అంటాడు. ఆమె మౌనంగా ఉండగా మోక్ష తండ్రి చెప్పు అంటాడు. ఇలా పంచమిని దగ్గరకు పిలిచిన మోక్ష తల్లి.. నా కొడుకును నువ్వే కాపాడాలని అంటుంది. వాడి ప్రాణాలకు ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనిన అంటుంది. ఇదంతా విన్న చిత్ర, జ్వాలలు ఇదంతా తుస్సు బాంబులు.. ఇదేంటత్తయ్యా ఇలా చేశారంటూ కామెంట్లు చేస్తుంది.

ఈక్రమంలోనే మోక్ష తండ్రి మాట్లాడుతూ.. ఆగండి ముందు కాకరవత్తులు కాల్చిన మీ అత్తయ్య చివర్లో పెద్ద బాంబ్ పేలుస్తుందని అంటాడు. దీనికి జ్వాల అదేం లేదు మళ్లీ తుస్సుమనిపిస్తారు అనగా.. మోక్ష తల్లి తన వద్ద ఉన్న ఇంటి తాళాల గుత్తి తీసి పంచమి చేతిలో పెడుతుంది. ఇక నుంచి ఇంటి బాధ్యత నీదేనని అంటుంది. మరోవైపు చిత్ర, జ్వాలలు మాకివ్వకుండా ఆమెకి ఎలా ఇస్తారంటూ గొడవ పడతారు. ఈక్రమంలోనే పంచమి కూడా తాను పల్లెటూరిదాన్ని అని, పెద్దగా చదువు కూడా రాజు కాబట్టి తాను ఈ బాధ్యతలు నిర్వర్తించలేదని వివరిస్తుంది.

Karali Plans to Create Problems in Moksha House on November 14th Episode Number 200th in Naga Panchami Telugu Serial

కానీ ఇంట్లోని వాళ్లంతా పంచమియే ఈ బాధ్యతలు సరిగ్గా చూసుకోగలదని అంటారు. ముందుగా శబరి, ఆ తర్వాత బావలు.. చివర్లో శిశిర కూడా ఇంటి తాళాల గుత్తి పంచమి దగ్గరే ఉండడం మంచిదని అంటారు. కావాలంటే నేను నీకు సాయం చేస్తాను పిన్ని.. కానీ తాళాల గుత్తి జాగ్రత్త, నువ్వంటే నచ్చని వాళ్లు లాక్కునే ప్రమాదం ఉందని శిశిర చెబుతుంది. పాప మాటలతో ఆమె తల్లి ఫైర్ అవుతుంది. పంచమి వద్దంటున్నా... మోక్ష తల్లి ఇంటి బాధ్యతలను పంచమికే అప్పగిస్తుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో.. నాగలోక యువరాజు ఫణీంద్ర పంచమి వద్దకు వచ్చి పరిచయం చేసుకుంటాడు. పౌర్ణమి రోజు నిన్ను పవిత్రంగా నాగలోకానికి తీసుకెళ్తానని అంటాడు. కానీ పంచమి మాత్రం తన భర్తను బతికించుకున్నాకే అక్కడకు వస్తానని అంటుంది. అంతలోనే యువరాజు నాగలోకానికి వెళ్లాకా నిన్ను పెళ్లాడతానని చెబుతాడు. మరోవైపు మోక్ష వచ్చి పంచమిని ఎత్తుకుంటాడు. ఆపై ఆమె చేతులపై ముద్దులు పెడతాడు. కోపంగా చూస్తున్న యువరాజు అక్కడకు వస్తున్నట్లు చూపిస్తారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X