Naga Panchami 9th March: పంచమి, ఫణీంద్రలను చంపబోతున్న కరాళీ.. నాగదేవత అడ్డుకోగలదా?
Naga Panchami: నాగ పంచమ సీరియల్ లో అద్భుతమైన ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మేఘనే కరాళీ అనే విషయాన్ని పంచమి తెలుసుకుంటుంది. ఫణీంద్రతో కలిసి వెళ్లి మరీ మహాంకాళి ఆశ్రమం వద్దకు వెళ్తుంది. అప్పటికే మేఘన రూపంలో ఉన్న కరాళీ అమ్మవారికి పూజలు చేస్తుంటుంది. అక్కడకు వెళ్లిన పంచమి తనతో నువ్వే కరాళీ అని నాకు తెలిసిపోయింది.. ఇక రా తేల్చుకుందాం నువ్వో నేనో అంటూ సవాల్ విసురుతుంది. ఇదంతా విన్న కరాళీ మాత్రం పంచమితో పాటు ఫణీంద్ర ప్రాణాలు తీయాలని.. అక్కడే అమ్మవారి ముందు ఉంచిన ఖడ్గాన్ని తీస్తుంది. వారిని చంపాలని మనసులో అనుకుంటుంది.
నాకే తెలియకుండా నాలోకో ఏదో శక్తి వస్తోంది..
ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ పంచమి.. మేఘన, మోక్షలు పెళ్లి జరుగుతుందని చెబుతుంది. ఇది జరిగే అవకాశమే లేదంటూ మోక్ష చెబుతున్నా వినకుండా.. మీరే కాబోయే భార్యాభర్తలు.. మీ పెళ్లి అయిన తర్వాత నేను కచ్చితంగా నాగలోకం వెళ్లిపోతానంటూ పంచమి చెబుతుంది. ఆ తర్వాత చిత్ర, జ్వాలలు.. వాళ్ల భర్తలు ఒచోట మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వదిన నువ్వు ఒక్కోసారి ఒక్కోలి బిహేవ్ చేస్తున్నావని అనగానే.. నాక్కూడా మీరంతా చెబితే అనుమానంగానే ఉంందటూ వివరిస్తుంది. నాకు తెలియకుండా నాలోకి ఏదో శక్తి వచ్చి వెళ్తుందనిపిస్తుందంటూ చెప్పుకొస్తుంది.

అత్తామామల ఆశీర్వాదం తీసుకున్న మేఘన..
కావాలనే పంచమి.. మేఘన, మోక్షలకు పెళ్లి చేసేందుకు నీలోకి ఏదో శక్తి పంపుతుందని జ్వాల చెబుతుంది. ఇక ఆ తర్వాత మేఘన పొద్దునే లేచి పూజ చేస్తుంది. అదంతా చూసిన పంచమి సంబరపడిపోతుంది. ఇంత మంచి మేఘనను మోక్ష బాబు చాలా బాగా చూసుకుంటారు అంటూ అనుకుంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా అక్కడకు రాగా శబరి నీకు బాధయేట్లేదా అని అడుగుతుంది. ఆ తర్వాత అక్కడకు వచ్చిన చిత్ర ఇక ఈ ఇంటికి నీకు ఉన్న బంధం పూర్తిగా తెగిపోతుందంటూ చెప్పుకొస్తుంది. అంతలోనే అక్కడకు మోక్ష వస్తాడు.
మోక్ష కాళ్లు పట్టుకునేందుకు వెళ్లిన మేఘన..
వైదేహి పిలిచి మేఘన పూజు చేస్తుండగా... దండం పెట్టుకోవాలని చెబుతుంది. ఆ తర్వాత మేఘన అందరినీ హారతి ఇస్తుంది. ఆ తర్వాత అత్తా మామల వద్ద ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత మోక్ష కాళ్లు పట్టుకునేందుకు వెళ్లగా.. అతడు వెనక్కి జరగుతాడు. పెళ్లైన తర్వాత ఇవన్నీ సర్దుకుంటాయి అంటూ చెప్పుకొస్తుంది. మోక్షను కూడా తీసుకెళ్లు అనగానే నేను రానని అంటాడు. ఆ తర్వాత శబరి పంచమితో మాట్లాడుతూ.. వైదేహి కోసమే మోక్ష పెళ్లికి ఒప్పుకున్నాడు.. మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోండి అని చెబుతారు.
నేను, మీ నాన్న ఆత్మహత్య చేసుకుంటాం..
ఇదంతా విన్న వైదేహి శరబరిని తిట్టబోగా.. ఎవరు ఏం చేసినా ఈ పెళ్లి జరగుతుందని పంచమి అంటుంది. ఆ తర్వాత అంతా షాక్ అవుతారు. ఈక్రమంలోనే మోక్ష.. పంచమిని ఏమన్నా నన్ను అన్నట్లే అని, పంచమియే దగ్గరుండా నా పెళ్లి జరిపిస్తుందని చెబుతాడు. ఆ తర్వాత పంచమి నేను గుడికి వెళ్తానని అనగా.. మోక్ష నేను డ్రాప్ చేస్తానంటాడు. వద్దని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వైదేహి మోక్షపై ఫైర్ అవుతుంది. మేఘన జీవితంతో ఆడుకోవద్దని చెబుతుంది. రేపు పది మందిలో నీవు మా పరువు తీస్తే నేను మీ నాన్న ప్రాణాలతో ఉండమని బెదిరిస్తుంది.
ఆ తర్వాత ఫణీంద్రను పిలిచి తాను కరాళీ వద్దకు వెళ్తున్నానని నీవు చూడలేదు.. కదా చూపిస్తా పద అంటూ పిలుస్తుంది. ఫణీంద్ర షాక్ అవగానే.. ఏమైంది అంటుంది. ఈలోపే మోక్ష పెళ్లి జరగనివ్వదు అంటూ పంచమి చెప్పగా.. ఈ పెళ్లి జరగనిస్తుంది అదే కరాళీ కోరిక అని ఫణీంద్ర అంటాడు. కరాళీయే తెలియకుండా ఆమె కోరిక మీకెలా తెలుస్తుందని ప్రశ్నిస్తుంది. నువ్వు కరాళీ జోలికి వెళ్లకూడదనే అలా చెప్పానని అనగా.... కరాళీ అంతు చూడకపోతే మోక్షను బలిస్తుందని అంటుంది.
ఇక తర్వాత మేఘన మహాంకాళి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి పూజలు చేస్తుంది. మోక్షను బలిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశానంటూ అమ్మవారికి చెబుతుంది. అంతలోనే పంచమి, ఫణీంద్రలు ఆశ్రమానికి వస్తారు. ఇంతటితో ఈరోజటి ఎపిసోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











